హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 12:22వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు'' అని చెప్పబడినట్లుగానే, నమ్మకస్థులు దేవునికి ఇష్టులైనవారుగా ఉంటున్నారు. కొంతమంది నాకు చాలా ఇష్టము అని మీకు తెలుసా? ఎవరైతే, నమ్మకస్థులుగా ఉంటారో, అటువంటి వారికి మీరు రహస్యాలు చెప్పిన కూడా వారు ఎవ్వరితోను కూడా చెప్పరు. నాకు అతి సమీపముగా ఉన్నటువంటి కొందరు దగ్గర స్నేహితులుగా ఉన్నారు. వారు చాలా నమ్మకస్థులు. వారితో నేను ఏది పంచుకున్నను కూడా ఇతరులతో కానీ, లేక ఎవ్వరితో కూడా వారు చెప్పరు. అవును, నా ప్రియులారా, మనమందరము కూడా మన స్నేహితులు ఆలాగున ఉండాలి అని కోరుకుంటాము కదా. నేను కూడా అటువంటి స్నేహితురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను.

నా ప్రియులారా, ఈ రోజు, "దేవా, మేము నమ్మకస్థులముగానే ఉన్నాము. కానీ, అందరు మా గురించి చెడు చెబుతున్నారు'' అని మీరు అంటున్నారా? మా పనులన్నిటిని చాలా నమ్మకముగా చేయుచున్నాము. కానీ, 'అందరు మాలో చెడును వెదకుచున్నారు' అని అనుకుంటున్నారా? 'చిన్న పనులు కూడా యథార్థంగానే చేయుచున్నాము కానీ, ప్రజలు తప్పులు పట్టవలెనని చూస్తున్నారు,' అని అనుకుంటున్నారా? చింతించకండి, నా స్నేహితులారా, ప్రభువు మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు. నేటి వాగ్దాన వచనముగా ఉన్న సామెతలు 12:22లో చూచినట్లయితే, "సత్యవర్తనులు ఆయనకిష్టులు'' అని చెప్పబడినట్లుగానే, మీ స్నేహితులు, మీ స్వంత కుటుంబ సభ్యులు మిమ్మును ప్రేమించనప్పటికిని, దేవుడే మిమ్మును ప్రేమించుచున్నాడు అని చెబుతున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును బట్టి గర్వించుచున్నాడు. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సత్యవంతులుగా ఉండుటను బట్టి ప్రభువు అటువంటి మిమ్మును చూచి, మీ పట్ల ఆనందించుచున్నాడు. మీ కుటుంబమును గురించి మరియు మీ స్నేహితులను గురించి చూచి, ప్రభువు వీటన్నిటిని కూడా గమనించుచున్నాడు. మీ విశ్వసనీయతను ఎవరూ గుర్తించనప్పుడు కూడా, మీరు అనుభవించిన ప్రతి విషయాన్ని ఆయన చూస్తూనే ఉంటాడు. కనుకనే, మిమ్మును ఎవరు చూడలేదు అని మీరు దిగులుపడకండి.

నా జీవితములో చూచినట్లయితే, నేను ఏ పని చేసినను, నా కొరకు నిలువబడు ఒక స్నేహితురాలు ఉన్నది. అనుకోకుండా, ఏదైనా చేయకూడనది తెలియకుండా చేసినట్లయితే, తను, నన్ను చూచి, ' లేదు శిల్పానే, నీవు సరిగ్గా చేశావు' అని చెబుతుంది. అటువంటి స్నేహితురాలిగా మీరు ఉండాలని నేను కోరుకొనలేదు గానీ, ఊరికే చెబుతున్నాను. అంత నమ్మకమైన సత్యవంతమైన స్నేహితురాలు తను. నా ప్రియులారా, మీరు కూడా ఆలాగున ఉంటూ, 'ప్రభువా, నా స్నేహితుల కొరకు మరియు దేవా, కుటుంబము కొరకు కూడా నిలబడుచున్నాను. దేవా, నీ కొరకు కూడా నిలబడుచున్నాను. మా జీవితములో అస్సలు ఆశీర్వాదములే లేవు అని అంటున్నారా?' అయితే, "నేను నీ యందు అతిశపడుచున్నాను'' అని ప్రభువు మిమ్మును చూచి అంటున్నాడు. ఎందుకనగా, ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరు సత్యవర్తనులు కావలెనని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ సత్యమును ఆయన గుర్తించినప్పుడు, ప్రభువు నిశ్చయముగా మిమ్మును దీవిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును సత్యవర్తనులుగా చేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల పరలోక తండ్రీ, ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రభువా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము నీ యందు సత్యవర్తనులుగాను మరియు నమ్మకస్థులుగా ఉండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తానుసారముగా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ యొక్క ఆశీర్వాదములు మా జీవితములలోనికి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా శరీరములో ఉన్న వ్యాధులను నీవు ముట్టి మాకు స్వస్థతను అనుగ్రహించుము. దేవా, మేము నీతిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ లోక కార్యముల వలన మేము నీతిగా జీవించలేకున్న మమ్మును నీ హస్తము ద్వారా తాకి మేము నీతిగా జీవించు కృపను మాకు దయచేయుము. యేసయ్యా, మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని నీ హస్తములకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ యొక్క ఆత్మ శక్తి చేత మా సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, మా శరీరములో ఉన్న నొప్పులను, బాధలను, మా మోకాళ్ల నొప్పులను తొలగించి, నీ స్వస్థతా శక్తి ద్వారా మమ్మును బలపరచుము. దేవా, జీవము ద్వారా నీవు మా ఆరోగ్యమును పునరుద్ధరించి, మా జీవితమును నూతనపరచుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములు మా జీవితములలోనికి ప్రవహించి, మా గృహములను శాంతి మరియు సంతోషముతో నింపునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.