నా ప్రియ స్నేహితులారా, దేవుడు ప్రత్యక్షంగా మీతో నిలిచియుంటాడు, ఇంకను మీ పక్షమున నిలిచి ప్రతి యుద్ధంలోనూ మీ కొరకు పోరాడుతాడు, ఆయన మీ కొరకు నిర్ణయించిన ఆశీర్వాదాలు నెరవేరునట్లుగా మీ పట్ల బాధ్యత వహిస్తాడు.కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు.'' ప్రకారము సర్వశక్తిమంతుడైన దేవుడు, మీ రక్షకుడు, మీ కేడెమును మరియు మీ ఆశ్రయ దుర్గం అని గుర్తెరగడము ఎంత ఆదరణ కలిగిస్తుంది కదా! అందుకే, ద్వితీయోపదేశకాండము 28:7లోని దేవుని వాక్యం మీకు విరోధంగా మీ మీద పడు శత్రువులందరు, మీ కన్నుల యెదుట ఓటమిపాలు అవుతారని మీ పట్ల వాగ్దానం చేయబడుచున్నది. హల్లెలూయా! ఒకవేళ, మీరు మాంత్రిక విద్యలు, దుష్టశక్తులు, అనూహ్యమైన అడ్డంకులు, అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, మీ పిల్లల జీవితాలలో ఓటమిలు మరియు మీ జీవితాలలో వైఫల్యాలు లేదా కారణం తెలియని రుగ్మతలతో బంధించబడినట్లుగా అనిపిస్తుందా? మీరు బలహీనంగా, గందరగోళంగా, అదృశ్యమైన శక్తులచేత బంధించునట్లుగా మీకు అనిపించవచ్చును. కానీ, దేవుడు ఈ రోజు మీరు వాటన్నిటి నుండి విడుదల పొందుకోవాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. బైబిల్ కాలంలో మీ ఆత్మీయ శత్రువులను జయించిన అదే ప్రభువు యొక్క ఆత్మ ఇప్పుడు మీ పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నది. కనుకనే, మీ ఉద్యోగం, వ్యాపారం, సేవా కార్యక్రమం మరియు మీ జీవితంలో ఆలస్యమైన ప్రతి ఉద్దేశం ఇప్పుడు దేవుని బలమైన హస్తము మీకు అనుకూలంగా కదిలించబడునట్లుగా అనుభవము కలిగి ఉంటున్నది.

బైబిల్ నుండి సువార్తలలో దురాత్మ పట్టిన ఒక చిన్నవాని కథను గురించి ఆలోచించండి. దురాత్మ అతని మాటను, వినికిడిని, మరియు ఉద్దేశపూర్వకంగా జీవించే సామర్థ్యాన్ని దోచుకుంది. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఆ చిన్నవాడు మానవ నియంత్రణకు మించిన శక్తులచే బంధించబడ్డాడు. కానీ, యేసుకు వాని మీద కనికరపడి, ఆయన ఆ మూగదయ్యాన్ని గద్దించి, అది ఆ చిన్నవాని విడిచి వెళ్లునట్లుగాను మరియు సంపూర్ణమైన విడుదల పొందునట్లుగా ఆజ్ఞాపించెను. వెంటనే, ఆ చిన్నవాడు సంపూర్ణమైన విడుదలను పొందుకున్నాడు. ఆ తర్వాత, ఆ దయ్యము పట్టినవాడు చక్కగా మాట్లాడగలిగాడు, వినగలిగాడు మరియు సంపూర్ణ స్వస్థతతో జీవించగలిగాడు. నా ప్రియులారా, ఆ చిన్నవానిని తిరిగి బ్రతికించిన అదే యేసుక్రీస్తు నేడు మీతో కూడా నిలువబడి, మీ జీవితాన్ని బంధించే ప్రతి సంకెళ్లను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఆశీర్వాదాలను ఆలస్యం చేయుచున్నది ఏదైనా సరే, అది అనారోగ్యమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, విఫలమైన సంబంధాలైనా, లేదా ఆధ్యాత్మిక ఒత్తిడియైనను ఆవన్నియు ఇప్పుడు మీ నుండి తొలగించబడును. దేవుడు తన వాగ్దానాలలోనికి నడవడానికి మరియు విజయవంతంగా జీవించడానికి నేడు మీ బంధకాలన్నిటి నుండి మిమ్మును విడిపించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 118:24వ వచనమును చూచినట్లయితే, "ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము'' అని వ్రాయబడినట్లుగానే, ఈ దినము మీరు లేచి, 'ఇది ప్రభువు చేసిన దినము' అని ఈ దినము యందు మేము ఉత్సహించి సంతోషించెదము అని ధైర్యముగా ప్రకటించండి. దేవుడు మిమ్మును ఆలాగుననే నడిపిస్తాడు.

నా ప్రియులారా, ఇది మీ విజయమునకు సమయము ఆసన్నమైన దినము! కనుకనే మనం కలిసి మొఱ్ఱపెట్టుచూ, దేవుని విడుదలను పొందుకుందాము. కనుకనే, ప్రభువుతో ఇలాగున చెప్పండి, 'ప్రభువా, శత్రువును ఓడించు, ప్రతి సంకెళ్ళను తెంపివేయుము, ప్రతి ఆటంకమును తొలగించుము మరియు నీ ఆశీర్వాదాలను మా జీవితంలోనికి విడుదల చేయుము. మాకు ద్వారములను తెరిచి, అతీంద్రియ అనుగ్రహాన్ని దయచేయుము. అద్భుతాలు మరియు మంచి నివేదికలు మా ఇంట్లోనికి మరియు వ్యాపారంలోనికి పొంగిపొర్లునట్లుగా చేయుము. మాకు విరోధంగా అపవాది పన్నుచున్న ప్రతి ప్రణాళికను నిర్మూలము చేయుము. నీ ఆత్మ మమ్మును విజయానికి నడిపించును గాక. మా జీవితాన్ని శాంతి, ఆనందం మరియు సమృద్ధియైన సంపదతో నింపుము. ప్రభువా, నీ బలమైన చేతి కార్యాలను బట్టి నీకు వందనాలు. మేము యేసు నామంలో విడుదలను పొందుకున్నామని ప్రకటించుచున్నాము, '' అని చెప్పినప్పుడు, మన దేవుడు నమ్మదగినవాడు మరియు ఓటమి ఉన్న చోట విజయాన్ని, దుఃఖం ఉన్న చోట ఆనందాన్ని, కొరత ఉన్న చోట ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొనివస్తాడు. ప్రియమైనవారలారా, ఈరోజే విశ్వాసం మరియు నిరీక్షణతో మీరు ముందుకు సాగండి, ఎందుకంటే ప్రభువు ఇప్పటికే మీ యుద్ధాలతో పోరాడియున్నాడు. కనుకనే, నేడు మీకు విజయమును అనుగ్రహించి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితములో ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధం మరియు పోరాటములతో పాటు నిలిచి ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ నామంలో మాకు విరోధంగా లేచు ప్రతి శత్రువును ఓడించుము. దేవా, మా జీవితంలోని ప్రతి సంకెళ్ళను, బంధకములను మరియు అటంకములను బ్రద్ధలు చేయుము. ప్రభువా, అనారోగ్యం, నష్టం లేదా వైఫల్యం యొక్క ప్రతి దాడిని మా నుండి ఇప్పుడే యేసు నామమున తొలగించు. దేవా, నీ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం మరియు అవకాశాల తలుపులు మా కొరకు తెరువుము. ప్రభువా, అద్భుతాలు, మంచి నివేదికలు మరియు ఆనందాన్ని మా మీద కుమ్మరించుము. దేవా, మమ్మును ఎల్లప్పుడూ ముందుకు నడిపించడానికి మరియు సంరక్షించడానికి నీ ఆత్మను మా పట్ల విడుదల చేయుము. దేవా, మా ఇల్లు, కుటుంబాన్ని నీ యొక్క ఆత్మ శక్తితో మరియు సమృద్ధితోను నింపుము. ప్రభువా, నీ యొక్క విజయం మా జీవితంలోని ప్రతి ప్రాంతంలోనూ స్పష్టంగా కనిపించునట్లుగాను నీకృపను మాకు అనుగ్రహించి, మమ్మును సంపూర్ణంగా విజయోత్సవముతో ఊరేగించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.