నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మిమ్మును ధైర్యవంతులుగాను మరియు బలవంతులుగా ఉండమని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 32:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి...మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మిమ్మును విడువడు మరియు మీకు సహాయము చేయవలెనని మీ పట్ల కోరుచున్నాడు. నేను ఈ మధ్యన బైబిల్ గ్రంథము నుండి చదివిన ఒక చక్కటి కధను నేను చదివియున్నాను. అది ప్రవక్తయైన ఎలీషాను గురించినటువంటి సంఘటను చదివాను. రాజైన ఆరామునకు, ఇశ్రాయేలీయులకు మధ్యన ఒక గొప్ప యుద్ధము జరుగబోవుచున్నది. ఆరాము రాజు వచ్చి, ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేయుటకు సిద్ధపడుచున్నాడు. అప్పుడు, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి, కిటికీలో నుండి చూచినప్పుడు, అతడు భయపడి, అంతట అతని పనివాడు, 'అయ్యో నా యేలినవాడా, గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. ఎంతో మంది ప్రజలు మనలను నశింపజేయుటకు వచ్చుచున్నారు, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనెను.' అందుకే బైబిల్ నుండి 2 రాజులు 6:17వ వచనములో చూచినట్లయితే, ఎలీషా ప్రవక్త ఈవిధంగా చెప్పియున్నాడు, "యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.'' అవును, ప్రభువు యొద్ద నుండి అనేకమైన రథములు వచ్చి, ఎలీషా చుట్టుముట్టియుండెను. అప్పుడు ఎలీషా పనివానిని చూచి, 'భయపడవద్దు, మన పక్షమున నున్నవారు, వారికంటె అధికులైయున్నారని చెప్పెను.'

అవును, నా ప్రియులారా, మనము కూడా ఆలాగుననే ఉంటాము కదండి. మన మనో నేత్రములు మూసుకొనిపోయి, అన్నిటిని గురించి మనము ఎప్పుడు చూచిన, భయపడుతూ ఉంటాము. 'ప్రభువా, నా భవిష్యత్తు గురించి నేను ఏమి చేయాలి? ఈ పరిస్థితులను నేను ఎలా ఎదుర్కోవాలి? అనేకులు గర్భవతులుగా ఉంటూ, నేను ఈ బిడ్డను ఎలాగున ప్రసవించగలను? అని భయపడుతూ ఉండియుండవచ్చును. లేదా ఏదైనా పరీక్ష కొరకు సిద్ధపడుతూ, ఎంతగానో భయపడుచున్నారా? అయితే, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు అంటున్నాడు కదా, 'మీతో ఉన్నవారు, శత్రువులతో ఉన్నవారికంటె గొప్పవారు కదా.' అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 32:7వ వచనము ప్రకారముగా, "...మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు'' అని చెప్పబడియున్నది.

అవును, నా ప్రియ స్నేహితులారా, మనతో ఉన్నటువంటి దేవుడు ఈ లోకములో ఉన్నవానికంటె గొప్పవాడుగా ఉన్నాడు. కనుకనే, నేడు నా ప్రియులారా, మీరు ఏ సమస్యను ఒంటరిగా ఎదుర్కొనలేదు. ఆలాగుననే, మీ పరిస్థితులన్నిటిని మీరు ఒంటరిగా ఎదుర్కొనుట లేదు. ప్రభువు మీ చుట్టూర గొప్ప సైన్యమును ఉంచియున్నాడు. ప్రభువే మీ ప్రక్కన ఉండియున్నాడు. కాబట్టి, మీరు మీ పరిస్థితులను చూచి, భయపడకుండా, ధైర్యవంతులుగాను, బలవంతులుగా ఉండండి. ఆయన మీ పక్షమున యుద్ధము చేసి, మీకు పరిస్థితులన్నిటిలో కూడా మీకు విజయమును అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, మీ జీవితములో కూడా ప్రభువు తన యొక్క ప్రణాళికలన్నిటిని కూడా నెరవేరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, మేము కూడలిలో ఎటువైపు వెళ్లాలో మాకు తెలియని పరిస్థితులలో మేము ఉన్నాము. దయతో నీవు మమ్మును సరైన మార్గములో నడిపించుము. ప్రభువా, నేడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను, ఎలా ఎదుర్కొనవలెనన్న మాలో ఉన్న భయమును ఇప్పుడే మా నుండి తొలగించుము. దేవా, మాకు విరోధముగా అనేకమంది ప్రజలు లేచినప్పటికిని, మాతో ఉన్న నీవు వారికంటె గొప్పవాడవు గనుకనే, వారి మీద మాకు విజయమును దయచేయుము. ప్రభువా, పరిస్థిల మధ్యలో నీవు మాతో ఉండి, నీ సన్నిధానముతో మమ్మును నింపుము. దేవా, మా పరీక్షలను గురించిన భయమును మాలో నుండి తొలగించి, మాకు కావలసిన జ్ఞానమును దయచేయుము. యేసయ్యా, మేము ఈ బిడ్డను ప్రసవించడానికి కావలసిన బలమును మాకు దయచేయుము. దేవా, మాకు ఉన్న కోరికలన్నిటిని మా పట్ల నెరవేర్చుము. యేసయ్యా, ప్రతిరోజు మేము నీ సన్నిధిలో అనుభూతి చెందునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో కష్టమైన పరిస్థితులు మరియు భవిష్యత్తును గురించిన ఆందోళనను, భయమును మా నుండి తొలగించుము. ప్రభువా, నీ యొక్క శక్తివంతమైన సన్నిధిని చూడటానికి, ఎలీషా యొక్క పనివాని కన్నులు తెరచినట్లుగానే, నేడు మా యొక్క ఆధ్యాత్మిక కన్నులను తెరవజేయుము. దేవా, నీ యొక్క శక్తిచేత మమ్మును బలపరచి, మమ్మును నడిపించుము. ప్రభువా, మా కుటుంబము చుట్టూ, నీ దైవీకమైన కాపుదలను చుట్టుముట్టునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయములను ధైర్యముతోను, విశ్వాసముతోను, సమాధానముతోను నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.