నా ప్రియమైన స్నేహితులారా, నేడు ప్రభువు మిమ్మును బట్టి గర్వించుచున్నాడని సెలవిచ్చుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెఫన్యా 3:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును'' అని చెప్పబడిన ప్రకారము సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మును బట్టి ఆనందించడము ఎంత గొప్ప విషయమై యున్నది కదా! నా ప్రియులారా, ఎవ్వరు మిమ్మును బట్టి అతిశయించకుండా ఉన్నట్లయినను సరే, యేసయ్య, మిమ్మును బట్టి గర్వించి, ఆనందించుచున్నాడు. మీకు ఆ విషయమును గుర్తు చేయడానికి నేను మీ మధ్యకు ఈ సందేశమును తీసుకొని వచ్చియున్నాను. ఒకవేళ, మీరు, ' అయ్యో, నేను ఎంతో కష్టపడి పనిచేయుచున్నాను, కానీ, నన్ను ప్రోత్సహించువారెవరు అస్సలు లేరు అని అనుకుంటున్నారేమో?' ఇంకను, ' నా తల్లిదండ్రులు నేను పడుచున్న కష్టాలను వారు అస్సలు చూడనే చూడరు అని మీరు అనవచ్చును. ' '  నేను వారి కొరకు పడుచున్నటువంటి కష్టాలను నా బిడ్డలు చూడనే చూడరు అని మీరు చెప్పవచ్చును.' అయితే, ప్రభువు మిమ్మును చూచి అంటున్నాడు, 'నా బిడ్డలారా, నేను మీ యందు ఆనందించుచున్నాను' అని సెలవిచ్చుచున్నాడు. ఇంక మనకు ఏమి కావాలి నా ప్రియ స్నేహితులారా?

నా ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మీలో ప్రతి ఒక్కరి వైపు చూచి, మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు. నేను నా పోస్ట్-గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరము చదువుకుంటున్నప్పుడు, పి.జి. మొదటి సంవత్సరము ఎంతో కష్టతరముగా ఉంటుంది. రెండు సంవత్సరముల క్యేటిని అప్పుడు నేను కలిగియున్నాను. ఒకరోజు, నేను నా పనినంతటిని ముగించుకొని, ఇంటికి వచ్చేసరికి, రెండుగంటల సమయము అయినది. నేను మరల ఉదయము ఆరున్నర గంటలకు వెళ్లాలి. నేను ఉదయము ఐదున్నరకు లేచి, బయలుదేరినట్లయితేనే, నేను సరియైన సమయమునకు హాస్పిటల్‌కు వెళ్లగలను. నేను వచ్చాను, క్యేటిని చూచి ముద్దు పెట్టుకున్నాను, పడుకున్నాను. మరల ఉదయమున లేచి నేను వెళ్లిపోయాను. ఆ రోజు నేను ఎంతగానో అలసిపోయాను. అప్పుడు, 'నేను ప్రభువా, ఇదంతయు నేను ఎందుకు భరించాలి? ఇది చాలా కష్టముగా ఉన్నది' అని అడిగాను. ఒకవేళ మీలో అనేకులు కూడా ఇలాగున అనుకుంటుండవచ్చును. ఇంకను మీలో చాలామంది ఈలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండవచ్చును. అయితే, దిగులు చెందవద్దు.

నేను ఆ రోజు 5 గంటలకు వెళ్లుచున్న సమయమునకు, మా మామయ్య డా. పాల్ దినకరన్ అంకుల్‌గారు వచ్చారు. నేను ఎప్పుడు వెళ్లినా, ఆయనగారు నాకు కొరకు ప్రార్థిస్తారు. మా అంకుల్ ద్వారా దేవుడు నాతో ఇలాగున మాట్లాడాడు, ' నా కుమార్తె, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను, ఇప్పుడు నీవు చేయుచున్న త్యాగాలు, కష్టాలు అన్నియు కూడా దీవించబడతాయి' అని చెప్పారు. నా ప్రియులారా, ఈ రోజు కూడా ప్రభువు మీతో కూడా అదే చెబుతున్నాడు. నేడు మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నను సరే, ప్రభువు మిమ్మును బట్టి గర్వించుచున్నాడు. కాబట్టి, మీరు ఆయనను విడిచిపెట్టవద్దు. ప్రభువు మీ కన్నీటినంతటిని మరియు మీ త్యాగమునంతటిని చూచుచున్నాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, యేసయ్య, మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడని మీరు జ్ఞాపకము ఉంచుకొనండి. ఆయన ప్రేమను బట్టి, మీ కన్నీటినంతటిని తుడిచివేసి, మీ యందు ఆనందించుచున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవు మా పట్ల గర్వపడుతున్నావని మాకు గుర్తు చేసినందుకు నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, మేము విడిచిపెట్టబడకుండను, మేము అలసిపోకుండునట్లుగా మమ్మును నీ యొక్క బలముతోను మరియు విశ్వాసముతో నింపుము. దేవా, మా మీదికి నీ బలము దిగివచ్చునట్లుగా మాకు నీవు సహాయము చేయుము. ప్రభువా, మేము తలంచిన గమ్యమును చేరుకోవడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే ఉండునట్లుగా చేయుము. మేము కోరుకున్న సీటును పొందుకొనుటకు సహాయము చేయుము. దేవా, నీవు మమ్మును బట్టి, అతిశయించుచున్నావనియు, నీవు మాకు తోడుగా ఉన్నావనియు మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా కన్నీళ్లను, త్యాగాన్ని ఎవరూ అర్థం చేసుకోనప్పుడు, నీవు సమస్తమును చూచుచున్నావని మేము గుర్తెరుగునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మేము అలసిపోయినట్లు మరియు ఎవరు మమ్మును గురించకపోయినను సరే, మేము దేనిని గురించి చింతించకుండా, దయచేసి నీ కృపతో మమ్మును బలపరచుము. ప్రభువా, మేము వేచి ఉన్న కాలంలో నిన్ను విడిచిపెట్టకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము చేయు ప్రతి ప్రయత్నాన్ని మరియు ప్రతి బాధను నీ చేతుల్లోకి అప్పగించుకొనుచున్నాము, నీవు మా పట్ల బాధ్యత వహించి, నిత్యము మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితంలో నీ వాగ్దానములన్నిటిని నెరవేరునట్లుగా కృపను చూపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.