నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:32వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు నేడు మీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ఎందుకనగా, ఆయన మీ యెడల కృపను కలిగియున్నాడు. ఒకానొక ఆదివారమున, డాక్టర్. డి.జి.యస్. దినకరన్ స్మారక ప్రార్థన గోపురములో జరుగుచున్న ఆరాధనకు వెళ్లినప్పుడు, ఒక సహోదరి తాను పొందుకున్న సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. ప్రార్థన గోపురమునకు వెళ్లి రావడానికి కావలసిన దారి ఖర్చుటకు సరిపడ డబ్బులు మాత్రమే ఆమె యొద్ద ఉండెను. కానీ, ఆమె ప్రార్థన గోపురమునకు ఈ కూడికకు వచ్చినప్పుడు, తాను ఎంతగానో కదిలించబడినది. అయినను, తన సమస్యల మధ్యలో తనకు ఎంతగానో సమాధానమును కలిగియుండెను. ఆలాగుననే, తన జీవితములో అనేక సమస్యలను ఆమె ఎదుర్కొను చుండెను. అయితే, ఆ కూటములో అందించబడిన సందేశమును ఆలకించిన తర్వాత, నేను ఏమైన ఇవ్వాలి అని తలంచుకొనెను. కానీ, తన యొద్ద ఉన్న డబ్బులు అన్నియు ప్రార్థన గోపురమునకు చెల్లించెదను అని ఆమె అనుకొనెను. అది ప్రభువునకు ఒక కానుకగా ఉంటుంది అని తలంచెను.

ఆమె యింటికి తిరిగి వెళ్లడానికి ఎవరో ఒకరు సహాయము చేశారు. ఆ తర్వాత, ఆమె దుకాణము తెరవడానికి కూడా ఎవరో ఒకరు సహాయపడ్డారు. తనకు వచ్చే రాబడి అంతటిలో నుండి పరిచర్యకు సహాయపడినది. తనకు వచ్చే రాబడిలోనే ఆమె పరిచర్యకు ఇచ్చుటకు ప్రారంభించినది. ఇంకను ఆమె మాస పత్రికను పొందుకొనినది, ఆమె ప్రార్థన గోపురమునకు కూడా తరచుగా వచ్చేది, ఆమె ప్రార్థన గోపురమును దర్శించిన తర్వాత, ఆమె తన వ్యాపారాన్ని తెరవడానికి అద్భుతముగా ఎవరో ఆమెకు సహాయము చేశారు. తనకు వచ్చుచున్న రాబడిలో నుండి ఆమె క్రమముగా పరిచర్యకు సహకరించుచుండెను. యేసు పిలుచుచున్నాడు పరిచర్య నుండి పొందుకుంటున్న మాస పత్రికను క్రమము తప్పకుండా చదువుచుండెను. ప్రార్థన గోపురములో జరుగుచున్న కూడికలకు కూడా ఆమె హాజరగుచుండెను. ప్రభువునకు సమీపముగా ఆమె ఎదుగుతూ వచ్చినది. తన జీవితములో ఆశీర్వాదములు రావడము ఆమె గమనించినది. తన వ్యాపారము వర్థిల్లినది. తన బిడ్డల జీవితములను కూడా ప్రభువు స్థిరపరచి, వారిని వర్థిల్లింపజేసియున్నాడు. అదియుగాక, ప్రభువు అద్భుతమైన జీవిత భాగస్వాములను కూడా వారికి ఇచ్చాడు. ఇంకను చక్కని ఉద్యోగములను కూడా ప్రభువు వారికి అనుగ్రహించియున్నాడు. తన బిడ్డలకు చక్కని ఉద్యోగములను కూడా ఇచ్చి ప్రభువు వారికి సహాయము చేశాడు. తన బిడ్డల చదువులను చూచుకొనుటకు ప్రభువు కృపను చూపించియున్నాడు. అద్భుతమైన కుటుంబాలతో వివాహము జరుగునట్లుగా ప్రభువు వారిని దీవించాడు. తన వ్యాపారములోని లాభముల ద్వారా ఒక చిన్న గృహమును కనుకొనుటకు కృపనిచ్చాడు. ప్రభువు తన వ్యాపారమును ఎంతగా ఆశీర్వదించాడనగా, ఇప్పుడు మరొక గృహమును, అనగా, రెండంతల గృహమును ఆమె నిర్మించుకొనినది. ప్రార్థన గోపురమునకు ఖాళీ చేతులతో నేను వచ్చియున్నాను. తిరిగి వెళ్లడానికి కూడా డబ్బులు నా దగ్గర లేవు. కానీ, ఈ రోజు ప్రభువు ఇప్పుడు తన కృప చేత నాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించియున్నాడు అని ఆ సహోదరి తాను పొందుకున్న అద్భుతములను గురించి తెలియజేసెను.

ఆలాగుననే, నా ప్రియులారా, ఆ సహోదరి వలె మీరు కూడా, ' నా జీవితము ముగించిపోవుచున్నది అని చెబుతున్నారా? నా చేతులలో ఏమి లేదు అని అంటున్నారా? నా బిడ్డల కొరకు మరియు కుటుంబము కొరకు చేయడానికి శక్తి ఏమియు లేదు అని అంటున్నారా? నేను మరొక రోజు ఎలా జీవించబోవుచున్నాను అని అంటున్నారా?' అయితే, నా ప్రియులారా, ప్రభువు తన కృప చేత మీకు అన్నిటిని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్రభువు పక్షులను ఎలా చూసుకుంటాడు, అంతకంటె మీరు శ్రేష్టులై యున్నారు. ఆకాశములోనికి పక్షులకు ఆయన ఆహారమును ఇచ్చుచున్నాడు. మీ యొక్క అవసరములన్నిటిని ఆయన ఎరిగియున్నాడు. ఆయన మీ గురించి ఎంతగానో పట్టించుకుంటున్నాడు మరియు మీ పట్ల జాగ్రత్త వహించుచున్నాడు. ఆయన తన ఏకైక కుమారుని మీ కొరకు అనుగ్రహించియున్నాడు. కాబట్టి, మీరు ఆయనను విశ్వసించుచుండగా, మీ కొరకు సమస్తమును ఆయన మీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగాను మరియు ఈ లోకపరంగా సమస్తమును మీకు ధారాళముగా ఇస్తాడు. కాబట్టి, నా ప్రియులారా, ధైర్యము వహించండి. మీ హృదయమును కలవరపడనీయ్యకండి. మీ విశ్వాసమును ప్రభువు మీద ఉంచండి. ఆయన మీకు కావలసిన వాటన్నిటిని మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన కృపను బట్టి, ఆయనకు వందనములు చెల్లించండి. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రియ ప్రభువా, నీవు దయగలవాడవని మరియు మా అవసరతలన్నింటిని గమనించుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము శూన్యంగా మరియు నిస్సహాయంగా భావించినప్పుడు, నీవే మా పోషకుడవని మాకు గుర్తుచేసినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు నీ సొంత కుమారుని సైతం మాకు కొరకు అనుగ్రహించావు, కాబట్టి మా నుండి ఏ మేలు కూడా నీవు అనుగ్రహింపకుండా వెనుదీయవని మేము నమ్ముచున్నాము. దేవా, మేము ముందుకు వెళ్ళడానికి మార్గం కనిపించనప్పుడు కూడా నిన్ను నమ్మడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా చేతుల పనిని ఆశీర్వదించి, మా ప్రతి అడుగును నడిపించుము. యేసయ్యా, నీ శాంతి మమ్మును నింపునట్లుగాను మరియు నీ అనుగ్రహం మమ్మును ఆవరించునట్లుగా చేయుము. దేవా, మా జీవితంలో నీ దైవీక పోషణను మేము పొందుకొనుటకు మాకు నీ కృపను చూపుము. ప్రభువా, నేడు మేము ఎన్నో శ్రమలను పొందుచూ, మరొక రోజును ఎలా ఎదుర్కొనగలము? అనేక ఆర్థిక ఇబ్భందుల ద్వారా మా జీవితము ఇక ముగిసిపోవునేమోనన్న భయము మాలో ఉన్నందున మా మీద నీ దృష్టిని ఉంచి, మా మీద నీ కనికరమును చూపించుము. దేవా, మాకు కావలసినవాటన్నిటిని నీ కృపచేత మాకు సమస్తమును ధారాళముగా దయచేయుము. ప్రభువా, మేము నీ వైపు చూస్తుండగా, మమ్మును దీవించి, ఘనపరచుము. దేవా, మా జీవితములో ఏ కొదువ ఉండకుండా మాకు నీ కృపనిమ్ము. యేసయ్యా, నీ యందు మాకు నిరీక్షణను అనుగ్రహించి, ఆధ్యాత్మికంగాను మరియు ఈ లోకపరంగా పడిపోయిన మమ్మును పైకి లేవనెత్తుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.