నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 111:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీకు ఆహారమును అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు మీ కుటుంబ అవసరతలను గురించి మీరు చింతించుచున్నారా? మా కుటుంబాన్ని ఎలా చూచుకోగలము? మా బిల్లులన్నియు ఎలా కట్టగలుగుతాము? ఖర్చులన్నియు ఎలా సర్ధుబాటు అవుతాయి? అని అనుకుంటున్నారా? ఆలాగుననే, ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఒకవేళ మీరు ఎదుర్కొనియుండి ఉండవచ్చును. ఇంటి అద్దె ఎలా కట్టుకోవాలి, బిడ్డలను ఎలా పోషించుకోవాలో తెలియలేదు, వైద్య ఖర్చులు ఎలా సర్దుబాటు అవుతాయి అని తెలియలేదు అంటున్నారా? తరువాతి పూట ఆహారము కొరకు ఆలోచించుచున్నారా? అయితే, పై చెప్పబడిన వచనము ప్రకారము ప్రభువు మీకు అన్నిటిని సమకూరుస్తాడనని చదివియున్నాము కదా! కనుకనే, మీరు ఏమి తినాలి? ఏమి త్రాగవలెనని ఎంతమాత్రము కూడా చింతించకండి. అందుకే బైబిల్ నుండి మత్తయి 6:31-32వ వచనములలో చూచినట్లయితే, "కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును'' అని మనము చదువుచున్నాము కదా. అవును, ప్రభువు మిమ్మును గురించి పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. నా ప్రియులారా, మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నిటిని ఆయన మీకు ముందుగా ఎరిగియున్నాడు. ఆయన మిమ్మును గురించి జాగ్రత్త వహించుచున్నాడు.
చెన్నై పట్టణములో నివసించుచున్నటువంటి ప్రియమైన సహోదరి లత కుటుంబ జీవితములో కూడా ప్రభువు అదే చేసియున్నాడు. ప్రభువు తనను ఏ విధంగా పట్టించుకున్నాడని తన సాక్ష్యమును మాతో పంచుకొనియున్నారు. తన కుటుంబము ఎంతగానో పేదరికములో శ్రమపడియున్నదని చెప్పారు. తన తండ్రిగారు ఎంతగానో అనారోగ్యము చేత బాధపడ్డారు. వారి కుటుంబములో అనేకపరమైన ఆర్థిక ఇబ్బందులను వారు ఎదుర్కొనేవారు. ఇంకను తినడానికి ఆహారము కూడా లేకుండా ఆమె తల్లిగారు ఎంతగానో బాధపడుచూ నిరాశను చెందియున్నారు. వారి కుటుంబము ఎన్నో అవసరతలతో నిండియున్నది. వారు బ్రతకడానికి ఎంతగానో శ్రమపడ్డారు అని చెప్పారు. అయితే, 2010వ సంవత్సరములో ఆమె యొక్క ఆంటీగారు, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము యొక్క పరిచర్యను గురించి తనకు పరిచయము చేశారు. వారు అక్కడ నిర్వహించబడుచున్న ఒక ప్రార్థన కూటములో హాజరయ్యారు. అక్కడ మా తండ్రిగారైన డాక్టర్. పాల్ దినకరన్గారు ఒక వర్తమానమును పంచుకొని, ప్రజల కొరకు ప్రార్థన చేసియున్నారు. ఆ సహోదరి కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించారు. తద్వారా, ఆమె దేవుని వాక్యము ద్వారా ఎంతగానో ప్రోత్సాహించబడి, వ్యక్తిగతంగా కూడా మా తండ్రిగారి యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు ఆ ప్రార్థన అనంతరము ఆ కుటుంబములో నిరీక్షణ కలిగినది. ఆ తర్వాత ప్రభువు వారి జీవితాలలో అనేక విధాలుగా మార్పులను కలుగజేయుచూ వచ్చాడు. తన సహోదరుడు ఒక మంచి ఉద్యోగమును పొందుకున్నాడు. వారి ఖర్చుల నిమిత్తమై ధనమును నెమ్మదిగా సమకూర్చుకొనగలిగారు. ఆ సహోదరి తన చదువులను కూడ పూర్తి చేసుకొనగలిగినది. తన యొక్క సహోదరులు కూడా మంచి ఉద్యోగములను కూడా పొందుకొనగలిగారు. ఆమె ఉద్యోగ స్థలములో కష్టాలను ఎదుర్కొన్న ప్రతిసారి కూడా యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు కాల్ చేసి, వారి యొక్క సమస్యలను గురించి ప్రార్థించుకునేవారు. ప్రార్థించుకున్న ప్రతిసారి వారి యొక్క సమస్యల నుండి వారు విడుదలను మరియు జవాబులను పొందుకునేవారు. ఆ తర్వాత, వారు నెమ్మదిగా ఒక స్వంత వ్యాపారమును ప్రారంభించడానికి ప్రభువు వారికి ఒక నూతన ద్వారమును తెరచాడు. వారి యొక్క వ్యాపారము కొరకు వారికి ఒక చక్కని స్థలమును కూడా ఏర్పరచియున్నాడు. ఆలాగుననే, ప్రభువు ఆ వ్యాపారమును దీవించాడు. నెమ్మది, నెమ్మదిగా ఆ వ్యాపారము ఎంతగానో విస్తరించినదనగా, వారు రెండు శాఖలను ప్రారంభించారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందడము ప్రారంభించినది. 2018వ సంవత్సరములో వారు స్వంత కారును కొనుక్కొని, అన్నానగర్ ప్రాంతములోనే ఒక స్వంత యింటిని కట్టుకొనగలిగారు. ప్రభువు వారు ఉన్నటువంటి ఆర్థికమైన దీన స్థితి నుండి వారిని పైకి లేవనెత్తి, వారి కుటుంబమును ఎంతగానో ఆశీర్వదించియున్నాడు. వారి యొక్క ప్రతి అవసరతను ప్రభువు సమకూర్చి వారిని విస్తరింపజేసియున్నాడు. ఈ రోజు వారు అనేకమైన ఆశీర్వాదములను పొందుకున్నారు. వారు ఏమి లేని స్థితిలో వారి యొక్క జీవితమును ప్రారంభించారు. కానీ, ఇప్పుడు ప్రభువు వారిని అభివృద్ధి నొందించాడు. దేవుడు వారికి సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించి, వారిని ఆశీర్వదించియున్నాడు.
నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు కూడా అటువంటి పరిస్థితులలో ఉన్నారేమో? మేము శ్రమలపాలై ఎంతగానో కష్టపడుచున్నాము అని అంటున్నారా? మా యొద్ద ఏమి లేదు అని అంటున్నారా? ఆ తర్వాత మాకు ఏమి చేయాలో తెలియడము లేదు అని అంటున్నారా? నా ప్రియులారా, ఈ రోజు మీ చింతలన్నిటిని ప్రభువు హస్తములకు అప్పగించండి. ఆయన మిమ్మును గురించి జాగ్రత్త వహిస్తాడు, ఆయన మిమ్మును గురించి పట్టించుకుంటున్నాడు. ఈ సాక్ష ్యము ప్రభువు యొక్క మంచితనమును గురించి ఒక గుర్తుగా ఉంటున్నది. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మీరు విశ్వసించుచుండగా, మీ జీవితములో మీరు కలిగియున్న దానిలో ప్రభువును నమ్ముచూ, ఆయనను విశ్వసించుచుండగా, ఆయన మిమ్మును గురించి పట్టించుకుంటాడు. ఆయన మీ అవసరతలన్నిటిని చూసుకుంటాడు. మీ యొక్క ప్రతి అవసరత ఆయన ఎరిగియున్నాడు. మీకున్నదానితో ప్రభువును నమ్ముకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని చూసుకుంటారు మరియు మీ అవసరాలను తీరుస్తాడు. కాబట్టి, ధైర్యము వహించండి. సహోదరి లత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేడు మిమ్మును మరియు మీ కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకుని మీ అవసరతలన్నిటి తీర్చి మిమ్మును ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మాకు ఇచ్చుచున్న అద్భుతమైన దీవెనకై నీకు వందనములు. దేవా, నీ పిల్లలందరిని నీవు పట్టించుకుంటావని నీ వాక్యం ద్వారా మాకు గుర్తు చేసినందుకు నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు, మా యొక్క ప్రతి అవసరతలను నీ మహిమైశ్వర్యములో తీర్చుము. దేవా, మేము కొదువ కలిగియున్న కార్యములన్నిటిని ఇప్పుడే నీవు మాకు సమృద్ధిగా అనుగ్రహించుము. ప్రభువా, మాకు ఆర్థిక ఆశీర్వాదములను అనుగ్రహించి, మమ్మును మరియు మా కుటుంబమును అభివృద్ధి పొందించుము. దేవా, మాకు మరియు మా ప్రియులగువారికి మంచి ఉద్యోగమును, సంతానమును అనుగ్రహించి, మాకు వృత్తిపరముగా మూయబడిన మార్గములను తెరచి, మా చేతిపనిని అభివృద్ధిపరచుము. దేవా, మేము సంపాదించిన దానినంతటిని విస్తరింపజే యుము. ప్రభువా, మేము నిన్ను ఘనపరచుచున్నందున నీవు మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా కుటుంబంలోని ప్రతి కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకొని, వారిని లేవనెత్తి, మాకు ఎటువంటి కొదువ లేకుండా మా యొక్క ఆర్థిక కష్టముల నుండి బయటపడునట్లుగా చేయుము. ప్రభువా, మా యొక్క పిల్లల చదువు, మా వైద్య అవసరతలు మరియు మా యొక్క అనుదిన అవసరతలను సమకూర్చుము. దేవా, మా యొక్క దీన స్థితి నుండి నీవు మమ్మును పైకి లేవనెత్తి, మా కుటుంబమును నీ యొక్క మంచితనముతోను, విశ్వసనీయతను అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


