నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడం నాకు చాలా ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 30:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను...'' ప్రకారం అక్కడ ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు. నా ప్రియులారా, అనారోగ్యముతో బాధపడుచున్నారా? మీరు మంచి ఆరోగ్యమును కోల్పోయారా? నా జీవితములో మంచినంతటిని కోల్పోయాను అని అంటున్నారా? మీరు మీ అనుదిన చర్యలను కూడా చేసుకోలేక ఉంటున్నారా? మీ యొక్క దీర్ఘకాలిక రోగములను బట్టి, మీ ప్రియులు కూడా మిమ్మును విడిచి దూరంగా వెళ్లిపోయి ఉన్నారా? అని చింతించుచున్నారా? మీరు సమాజములో మీకున్నటువంటి మర్యాద, గౌరవమును అంతటిని కోల్పోయారా? ఇంకను మీరు ఒంటరిగా భావిస్తున్నారా? అయితే, చింతించకండి. దేవుడు మీతో కూడా ఉన్నాడని ధైర్యముగా ఉండండి.

అయితే, బైబిల్ గ్రంథములో అటువంటి వ్యక్తిని మనము చూడగలము. పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావముగల స్త్రీని మనము చూడగలము. సమాజములో ప్రతి ఒక్కరు ఆమెను వెలివేశారు. అపరిశుద్ధురాలినిగా ఆమెకు పేరు పెట్టియున్నారు. తన మర్యాదనంతటిని కోల్పోయినది. ప్రభువైన యేసు ఆ మార్గములో ప్రయాణించుచున్నాడని ఆమె విన్నప్పుడు, ఆ పట్టణములో నుండి వెళ్లుచున్నాడు ఆమె విని, యేసు నొద్దకు పరుగెత్తుకొని వెళ్లి, ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి ప్రయత్నించినది. ఆమెను ఎవరు ముట్టుకోవడానికి ధైర్యము చేయలేకపోయారు. ఎందుకంటే, ఆమెను అపరిశుద్ధురాలు అని ముద్ర వేయబడినది. కానీ, ఆమె ఎలాగైన స్వస్థతను పొందుకోవాలని తలంచినది. కానీ ఆమె, యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టినట్లయితే, నేను స్వస్థపడతాను అను విశ్వాసము ఆమెలో ఉండినది. అప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా? ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే, ఆమె యొక్క రక్తస్రావము ఆగిపోయినది. అదే క్షణములోనే ఆమె స్వస్థతను పొందుకొనినది. ఆమె రక్తస్రావము నిలిచిపోయినది. ఆమె నూతనంగా మారిపోయినది. సమాజములో ఆమె కోల్పోయిన మర్యాద, గౌరవము అంతయు కూడా ఆమెకు తిరిగి వచ్చాయి. ఇంకను ఆమె మంచి ఆరోగ్యమును మరల పొందుకొనెను. ప్రభువు ఆమె గాయములన్నిటిని ముట్టి ఆమెను బాగుచేశాడు. హల్లెలూయా!

నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, నేడు మీరు కలిగియున్నదంతయు సమస్తమును కోల్పోయి ఉన్నారేమో? కానీ, ఈ రోజు యేసయ్యను గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే, విశ్వాసమును కోల్పోకుండా, ప్రభువు మిమ్మును స్వస్థపరుస్తాడు అని మీరు విశ్వసించుచుండగా, ప్రభువు మీ యొద్దకు వచ్చి, మిమ్మును తాకుతాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థపరచబడతాడు. ఆయన మీకు ఆరోగ్యమును మరల కలుగజేస్తాడు. మీ గాయములన్నిటిని కడతాడు. ఆ స్త్రీ వలె అనేక సంవత్సరములుగా మీరు కూడా బాధపడుచున్నారా? మీ గౌరవము అంతయు కోల్పోయినదా? లేక మీరు ఒంటరిగా ఉన్నారని తలంచుచున్నారా? ఈ రోజు మీ ఆరోగ్యము సహా, మీరు కోల్పోయిన వాటన్నిటిని, ప్రభువు మీకు తిరిగి మరల దయచేస్తాడు. ఇంకను మీకు సమాజములో గొప్ప నామమును కలుగజేస్తాడు. యేసు క్రీస్తు పొందిన గాయముల ద్వారా ఆయన మిమ్మును స్వస్థపరచు దేవుడని నిరూపిస్తాడు. కనుకనే, మీరు ఆయనకు వందనాలు చెల్లించుచూ, ఆయనకు వందనాలు చెల్లించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ యొక్క దీర్ఘకాలిక మరియు మరణాంతకమైన వ్యాధులను కూడా ఆయన ముట్టి స్వస్థతను ఇచ్చి, మీకు మరల ఆరోగ్యమును కలుగజేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపాకనికరముగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, అనారోగ్యములతో బాధపడుచున్న మమ్మును నీ గాయల ద్వారా తాకి స్వస్థపరుచుము. దేవా, దీర్ఘకాలిక వ్యాధులతోను, ప్రాణాంతాక వ్యాధులతో బాధపడుచున్న మమ్మును ఇప్పుడే నీవు ముట్టి స్వస్థపరచుము. అనేక సంవత్సరములుగా బాధపడుచున్న మమ్మును నీ గాయపడిన హస్తములతో తాకుము. దేవా, మేము కోల్పోయిన వాటన్నిటిని, మరల పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, సమాజములో మేము కోల్పోయిన గౌరవ మర్యాదలన్నిటిని మేము తిరిగి పొందుకొనునట్లుగా చేయుము. యేసయ్యా, వైద్యులకు అసాధ్యమైనదని చెప్పినదానిని నీవు తాకి స్వస్థపరచుము. ప్రియమైన ప్రభువైన యేసు, మా బాధను మరియు మా బాధ యొక్క లోతును నీవు చూస్తున్నావు. నేడు మేము భరించుచున్న ఒంటరితనం మరియు మరెవరూ చూడని గాయాలు, ఇంకను వ్యాధులు నీకు తెలుసు. కానీ యేసయ్యా, ఈ రోజు, నీ వస్త్రాన్ని తాకిన స్త్రీవలె మేము విశ్వాసంతో నీ దగ్గరకు వస్తున్నాము. దేవా, నీ నుండి వచ్చే ఒక్క స్పర్శ కూడా మమ్మును స్వస్థపరచగలదని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా శరీరంలో, హృదయంలో మరియు ఆత్మలో మమ్మును మరల పునరుద్ధరించుము. దేవా, మా జీవితం విడిచిపెట్టిన ప్రతి గాయాన్ని స్వస్థపరచుము. ప్రభువా, మా గౌరవాన్ని, శాంతిని మరియు బలాన్ని మాకు తిరిగి దయచేతుము. యేసయ్యా, నీ యొక్క స్వస్థపరచే శక్తి ఇప్పుడు మా ద్వారా ప్రవహించునట్లుగా చేయుము మరియు మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీవే మమ్మును స్వస్థపరచు దేవుడని చూచునట్లుగా మా పట్ల అద్భుతకార్యములను జరిగిస్తావని మేము పరిపూర్ణంగా నమ్ముచు యేసుక్రీస్తు గాయపడిన నామమున అతి మిక్కిలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.