నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి విలాపవాక్యములు 3:22వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము'' అని చెప్పబడినట్లుగానే, మనము నిర్మూలము కాకున్నవారముగా ఉండాలని మన పట్ల ప్రభువు కోరుచున్నాడు. కనుకనే, అదే విషయమును 2 సమూయేలు 24:14 లో, "యెహోవా బహు వాత్సల్యతగలవాడు'' మరియు 1 దినవృత్తాంతములు 21:13లో "యెహోవా మహా కృపగలవాడు'' అని మనము చదువగలుగుచున్నాము.

అదేవిధముగా, బైబిల్ నుండి నెహెమ్యా 9:31వ వచనములో చూచినట్లయితే, "అయితే నీవు మహోపకారివై యుండి, వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవై యున్నావు'' అని చెప్పబడినట్లుగానే నిజముగా ఆయన కృపా కనికరములుగల దేవుడుగా మన పక్షముగా ఉన్నాడు. కనుకనే, బైబిల్ నుండి లూకా సువార్త 1:50వ వచనమును మనము చూచినట్లయితే, "ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును'' అని చెప్పబడినట్లుగానే, ఆయనకు భయపడువారి పట్ల ఆయన కనికరము తరతరములకు ఉంటుంది అని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి హెబ్రీయులకు 4:16వ వచనములో చూచినట్లయితే, "గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' అని చెప్పబడినట్లుగానే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముగా మనము కృపను పొందుకొనుటకు ఆయన యొద్దకు చేరవలెనని మన పట్ల దేవుడు కోరుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి, దేవుని యొద్దకు రండి. ఆయన అందించు సహాయమును పొందుకొనండి.

నా ప్రియ స్నేహితులారా, ఏదైన ఒక విషయము కొరకు మీరు ఈ రోజు చింతించుచున్నారా? అయితే, యేసు నొద్దకు రండి, తన కృపను ఇవ్వమని ఆయనను వేడుకొనండి మరియు ప్రార్థించి, మీ జీవితములో ఆయన కృపలను పొందుకొనండి. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:4-7వ వచనములను మనము చూచినట్లయితే, "అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండి నప్పుడు సయితము మన యెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసు కృపచేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయన తో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను'' అని చెప్పబడినట్లుగానే, క్రీసు కృపచేత మీరు రక్షింపబడియున్నారు. గనుకనే, క్రీస్తుయేసునందు మనలను కూడ ఆయనతో లేపియున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, మీ జీవితములను మీరు ఒకసారి పరీక్షించుకోవాలి? దేవుని కృపా కనికరముల చేత నింపబడడాని కొరకు మనము దేవుని పాద సన్నిధిలో వేచియుంటున్నామా? లేదా మీ జీవితములో మీరు కోల్పోయిన విషయములను గురించి, ఎల్లప్పుడు చింతించుచూ, బాధగా ఉంటున్నారా? ఇప్పుడు కూడా మీరు ప్రభువు వైపు చూద్దాము. దేవుని యొక్క కృప వెంబడి కృపను పొందుకొనుట కొరకై దేవుని చూస్తున్నామా? లేదా? అనే విషయమును మనము పరీక్షించుకుందాము. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని, మనము అర్హులము కానటువంటి ఆయన యొక్క గొప్ప కృపను ఇప్పుడు పొందుకుందాము. ఆయన కృప మీ కొరకు సిద్ధముగా ఉన్నది. కృప కలిగినటువంటి దేవుడు మీ కొరకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, నేడు మీ జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైనటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీ అచంచలమైన కరుణకు, కృపకు నీకు వందనాలు. దేవా, నీ బిడ్డల జీవితములను దృష్టించుము. ప్రభువా, మేము నీ యొద్ద కృప వెంబడి కృపను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో అనవసరమైన వాటన్నిటిని మరియు మా యొక్క పాపపు జీవితమును క్షమించుము. యేసయ్యా, నీ యొక్క ప్రశస్తమైన రక్తముచేత మమ్మును కడిగివేయుము. ప్రభువా, నీ యొక్క కృపాకనికరముల చేత మా జీవితములను నింపుము. దేవా, ప్రతిరోజూ ధైర్యంగా నీ సింహాసనమునొద్దకు వచ్చుటకు మాకు సహాయ ము చేయుము. ప్రభువా, నీ యొక్క అమూల్యమైన రక్తంతో మా హృదయ మును పరిశుద్ధపరచి, మా జీవితమును నూతనపరచు ము. దేవా, నీ కృపతో మమ్మును నింపి, ప్రతి పరిస్థితిలో మమ్మును బలపరచుము. ప్రభువా, నీ కనికరము మా జీవితమును ఆవరించునట్లుగాను, నీ యొక్క పరిపూర్ణ చిత్తం లోనికి మమ్మును నడిపించుము. దేవా, మా యొక్క పాపములను క్షమించి, మాకు నూతన జీవితమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.