నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మన మధ్యన ఉండియున్నాడు. ఆ యన మనలను తన బలమైన సానిధ్యముతో నింపి, తన జీవవాక్కులతో మా ట్లాడవలెనని మన పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 థెస్సలొనీక యులకు 5:24వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మిమ్ము ను పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మనలను పిలిచియున్నాడు, కనుకనే, ఆయన ఆలాగుననే మీకు జరిగిస్తాడు, ఆమేన్. ఆయన ఎందునిమిత్తమై మనలను పిలిచియున్నాడో, ఆయన మీ కోసము దానిని జరిగిస్తాడు. ఈ రోజున మీ పిలుపు విషయమును చాలా ఇబ్బందిపడుచున్నారేమో? నేను ఈ పెద్ద కార్యమును ఏలాగున నెరవేర్చబోవుచున్నాను? మరియు నేను ఈ సవాళ్లను ఏ విధంగా అధిగమించబోవుచున్నాను? నా అక్కరలన్నియు కూడా ఎక్కడ సంధించబడతాయి? అని తలంచుచుండవచ్చును. అయితే, మీరు ఆయన యొద్దకు వచ్చి, 'ఓ దేవా, మాకు బలమును అనుగ్రహించుము' అని అడగండి. నా ప్రియ స్నేహితులారా, మీరు దేనిని గురించి విచారించకండి, మీ పిలుపును మరియు నెరవేర్పును జరిగించుటకు ప్రభువు నమ్మదగినవాడుగా ఉన్నాడు. కనుకనే, ఆయన మీ మధ్యకు వచ్చి, మీకు సమస్తమును జరిగిస్తాడు.

నా ప్రియులారా, మీ పిలుపును నేరవేర్చుట కొరకు ఆయన మూడు కార్యములను జరిగించుచున్నాడు. మొదటిగా, మన పిలుపును నెరవేర్చుచుటకు తగిన శక్తిని అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఇంకను ఆయన, మన సామర్థ్యమును బలపరచి, తన జ్ఞానమును మరియు వరములను అనుగ్రహించుచున్నాడు, ఆమేన్. నా స్నేహితులారా, దేవుని యొక్క అభిషేకమును పేతురును నింపియున్నప్పుడు జరిగినట్లుగానే, అతడు సంపూర్ణముగా విభిన్నమైన వ్యక్తిగా మార్చబడియున్నాడు. అతడు వీధులలో ఉన్న ప్రజల మీద తన యొక్క నీడ పడినప్పుడు వారు స్వస్థపరచబడియున్నారు అని మనము బైబిల్‌లో చూడగలుగుచున్నాము. ఆయన శక్తి మీ ద్వారా కూడా ప్రవహించడము జరుగుతుంది.

రెండవదిగా, ఈ పిలుపును నెరవేర్చడము కొరకు దేవుడు మీ సరిహద్దులయందంతట గొప్ప సమాధానమును అనుగ్రహించుచున్నాడు మరియు ప్రత్యేకముగా శత్రువులు మిమ్మును అణచివేయాలని ప్రయత్నించినప్పుడు మరి ఎక్కువగా ఆయన ఆలాగున చేయుచున్నాడు. బైబిల్‌లో దైవజనుడైన ఎలీషా నిద్రలేచి, అరామీయుల మహా సైన్యము (సిరియనుల దండువారు) పట్టణమును చుట్టుముట్టియున్న సంఘటనను చూసినప్పుడు, అతడు భయపడలేదు. అతనిలో గొప్ప నెమ్మది కలిగియుండెను. ఎందుకనగా, ఆ పట్టణము చుట్టు కూడా దేవుని సైన్యము ఆవరించియున్నట్లుగా అతడు చూచియున్నాడు. కనుకనే, ఆయన పరిపూర్ణమైన నెమ్మదితో ఉండెను. నా ప్రియులారా, నేడు మీరు కూడా ఆలాగుననే, నెమ్మదిని కలిగియుంటారు. అదే విధంగా, దేవుడు మీ హృదయాన్ని శాంతితో నింపుతాడు. ఎదురయ్యే వ్యతిరేకత ఎంత తీవ్రంగా అనిపించినప్పటికిని, ఆయన సన్నిధి మీలోని ప్రతి భయమును, చింతలను నిమ్మళింపజేయుచున్నది.

చివరిగా, ప్రభువు మీ పిలుపునకు సంబంధించిన వనరులన్నియు కూడా ఆయన మీకు తగిన సమయములో సమకూర్చుచున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు ఆహారమును మరియు పానీయమును వారికి భద్రపరచిన రీతిగానే, మీకును అదేరీతిగా అనుగ్రహించుచున్నాడు. అరణ్యములో వారు ప్రయాణించుచున్న సంవత్సరములన్నియు కూడా, దేవుడు మహా అద్భుతముగా సమస్తమును సమకూర్చియున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, దేవుడు మీకును కూడా సకలమును సమకూరుస్తూ, మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. సమస్తమును సమకూర్చువాడు ఆయన మీతో కూడా ఉన్నాడు. నా ప్రియులారా, మీరు అడగకముందే మీ ప్రతి అవసరమును ఆయనకు తెలుసు; ఆలాగుననే, మీ అక్కరలన్నిటిని ఆయన మీకు సమకూర్చి, తన మహిమైశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరమును తీర్చుచున్నాడు.

నా ప్రియులారా, ఇప్పుడు కూడా మన పిలుపును నిర్వర్తించుటకు
ఆయన శక్తి, ఆయన సమాధానం మరియు ఆయన సమకూర్పు అను ఈ మూడు కార్యములను దేవుని యొద్ద నుండి సంపూర్తిగా మనము పొందుకుందాము. అంతమాత్రమే కాదు, దేవుడు మిమ్మును ప్రకృతికి అతీతముగా వెళ్లునట్లుగా మార్చుచున్నాడు. ఆలాగుననే, మీరు ప్రకృతికి అతీతమైన జ్ఞానమును, మాట్లాడుటకు తగిన సామర్థ్యమును, అద్భుతమైన కార్యములు చేయుటకు తగిన సామర్థ్యమును మరియు దేవుని యొద్ద నుండి గొప్ప సమాధానమును ఇప్పుడే పొందుకొనండి. ఆ గొప్ప సమాధానమును మీ హృదయాంతరంగములోనికి వచ్చుచున్నది. దేవుని దృష్టిలో మీ యొక్క సమస్యలన్నియు ఎంతో చిన్నవిగా కనిపించుచున్నవి, కనుకనే, నేడు మీ చింతలన్నియు కూడా తొలగింపబడి, దేవుని యొక్క బలమైన సమాధానము మీ మధ్యకు వచ్చుచున్నది. కనుకనే, మీ అక్కరలన్నియు మీకు అనుగ్రహించి, మిమ్మును దీవించుచున్నాడు. ఎందుకనగా, మిమ్మును పిలిచిన ప్రభువు, మీ జీవితంలో తన కార్యములను సంపూర్ణముగా నెరవేర్చుటలో నమ్మదగినవాడుగా ఉన్నాడు. కనుకనే, అద్భుతములు ఇదివరకే జరుగుచూనే ఉన్నవి. మీరు అడుగుచున్నవాటన్నిటిని ఇప్పుడే పొందుకొనబోవుచున్నారు మరియు మీ పిలుపును నెరవేర్చుచున్న ఆయనను స్తుతించినట్లయితే, నిశ్చయముగా, మీ పట్ల నమ్మకముగా ఉన్న దేవుడు నేడు మీ మధ్యకు వచ్చి, మీ పట్ల ఆలాగున జరిగించి, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యేసయ్యా, మా పిలుపును నీ హస్తములకు అప్పగించుచున్నాము. దేవా, మమ్మును పిలిచిన నీవు, నీ వాక్యము ప్రకారము మా పట్ల నమ్మదగినవాడుగా ఉన్నందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీ పరిపూర్ణ సంకల్పం ప్రకారం మమ్మును పిలిచినందుకు నీకు వందనములు. దేవా, ఇప్పుడు మమ్మును నీ శక్తి మరియు సామర్థ్యముచేత నింపుము. ప్రభువా, మేము ప్రకృతికి అతీతముగా వెళ్లునట్లుగా మమ్మును మార్చుము. దేవా, ప్రకృతికి అతీతమైన జ్ఞానమును, మాట్లాడుటకు తగిన సామర్థ్యమును, అద్భుతమైన కార్యములు చేయుటకు తగిన సామర్థ్యము మాకు దయచేయుము. ప్రభువా, మాకు అత్యంత సమృద్ధిగా నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించుము. దేవా, మేము అడుగువాటన్నిటిని పొందుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుటకు, మా పిలుపును మరియు భవిష్యత్తును నీ చేతులకు అప్పగించుచున్నాము. యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన శక్తితో మమ్మును నింపుము మరియు నీ ఆత్మ బలంతో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు మాకు అప్పగించిన వాటన్నిటిని నెరవేర్చడానికి మాకు జ్ఞానం, సామర్థ్యం మరియు కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క సమాధానము మా హృదయంలో ఏలునట్లుగా చేసి, మాలో ఉన్న ప్రతి భయం, చింతలు మరియు నిరుత్సాహమును తొలగించుము. దేవా, మా జీవితములో సవాళ్లు ఎదురైనప్పుడు నిన్ను నమ్మడానికి మరియు నీవు ఎల్లప్పుడు మాతో ఉన్నావని గుర్తుంచడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా అవసరతలన్నిటిని సమృద్ధిగా తీర్చుము. దేవా, ఎవరూ మూయలేని తలుపులను మా నిమిత్తము తెరచి, మా జీవితములో అద్భుతములు వెంబడించునట్లుగా చేసి, మా ద్వారా నీ నామం మహిమపరచబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.