నా ప్రియమైన స్నేహితులారా, యేసు మీకు స్వస్థతను మరియు క్షమాపణను అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అవును, యేసు అందునిమిత్తము క్రయధనమును చెల్లించియున్నాడు. యేసు శరీరధారియైన దేవుడుగా ఉన్నాడు. తద్వారా, స్వస్థపరచు శక్తిని మరియు పాప క్షమాపణను ఉత్పత్తి చేయునట్లుగాను ఆయన మానవ స్వరూపమును ధరించియున్నాడు. కనుకనే, మీరు క్షమించబడుట కొరకు మరియు మీరు స్వస్థపరచబడుట కొరకు యేసులో నిరీక్షణ కలదు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 53:5వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, యేసు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మొట్టమొదటగా, మన యతిక్రమక్రియలనుబట్టి యేసు గాయపరచబడియున్నాడు. మనము పాపము జరిగించిన ప్రతి ఫర్యాయము ఇది మన దేహమును గ్రుచ్చినట్లుగా ఉంటుంది. పాపము మనలను గాయపరుస్తుంది. పాపము మన యొక్క ప్రాణాత్మలను గాయపరుస్తుంది. పాపము మన అవయవములను గ్రుచ్చినట్లుగా ఉంటుంది. అందుచేతనే, ప్రజలు మధ్యపానము సేవించి, సేవించి, తమ కాలేయమును పాడుచేసుకుంటుంటారు. ప్రజలు భోగేచ్ఛ విధానములో జీవించుచున్నప్పుడు, అపరాధభావన వారి హృదయములలోనికి వస్తుంది. ప్రజలు ఇతరులతో తప్పుగా ప్రవర్తించినప్పుడు, మనుష్యుల భయము వారి హృదయములోనికి వస్తుంది. అవును, పాపము మనలను గాయపరచినట్లుగా ఉంటుంది.
అందుకే బైబిల్ నుండి ఆదికాండము 3:6వ వచనములో చూచినట్లయితే, " స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను'' అని చెప్పబడినట్లుగానే, హవ్వ తినవద్దన్న పండును తిన్నప్పుడు, అది ఆమె జీవితమును గాయపరచినది. ఆమె ఆ పండును ఆదామునకు కూడా ఇచ్చినది. అతడు కూడా విధేయుడై దానిని తిన్నాడు. అది అతనిని కూడా గాయపరచినది. తద్వారా, వారు దేవుని మహిమను కోల్పోయారు. ఆలాగుననే, బైబిల్ నుండి 2 సమూయేలు 11వ అధ్యాయములో చూచినట్లయితే, దావీదు బత్సెబాను మోహించాడు. అంతమాత్రమే కాదు, అతడు తన భర్తయైన ఉరియాను చంపించాడు. ఈ పాపము తన భర్తను పొడిచివేబడినట్లుగా చేసినది. దావీదు తన కోసమైన బత్సెబాను తీసుకొనుటకు ఆలాగున చేసియున్నాడు. తప్పుడు విధానముల నిమిత్తము ఆమె భర్తను చంపించెను. అదేవిధముగా, పాపము మన దేహములను గాయపరచుచున్నది. భోగేచ్ఛ ఒకని ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు, బైబిల్ నుండి కీర్తనలు 51వ అధ్యాయములో మనము చూచినట్లయితే, దావీదు ఈ రీతిగా మొఱ్ఱపెట్టుచున్నాడు, "ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా ఆత్మను శుద్ధీకరించుము, నన్ను నీవు స్వస్థపరచుము'' అని పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు, దేవుడు దావీదు యొద్దకు తన వాక్కును పంపించియున్నాడు. దావీదు ఈ రీతిగా ఉండెను, "నీవు మరణించవు, నేను నీ ప్రార్థనను అంగీకరించాను, అయినప్పటికిని, ఆ ఖడ్గము ఎన్నటికిని మీ కుటుంబమును విడిచిపెట్టిపోదు '' అని సెలవిచ్చెను. అప్పటి నుండి, ఒకదాని వెంబడి అన్నట్టుగా ఖడ్గము దావీదు యొక్క బిడ్డలను మరియు అతని సంతతిని అణిచివేయుచుండెను. అతని కుమారుడు రాజుగా ఉన్నప్పటికిని కూడా, తన సొంత సోదరుని చంపవలసిన పరిస్థితి ఏర్పడినది.
నా ప్రియ స్నేహితులారా, మీ కుటుంబమునకు ఈ రీతిగా జరుగకూడదు. పాపము మనలను గాయపరచి నలుగగొడుతుంది. తద్వారా, ప్రతి అతిక్రమ క్రియలకు సంబంధించిన శాంతిని కలిగించునట్లుగా, అందుచేతనే యేసు నలుగగొట్టబడియున్నాడు, ఇంకను గాయపరచబడియున్నాడు. అవును, ఎరిగియుండియు మనము పాపము చేసినట్లయితే, అది పరిశుద్ధత కొరకైన దేవుని నియమములను ఉల్లఘించినట్లుగా అవుతుంది. కనుకనే, ఈ రోజున అటువంటి యేసునకు మొఱ్ఱపెట్టండి, ఆయన మన కొరకు ఒక మార్గమును కలిగియున్నాడు. ఆ మార్గము, యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క ప్రతిపాపము నుండి మనలను శుద్ధీకరించుచున్నది. ఎందుకనగా, యేసు అందునిమిత్తమే గాయపరచబడియున్నాడు. మన అతిక్రమముల నుండి మనము విడుదల పొందుకొనుచున్నాము. మనము పాపక్షమాపణ అడిగినప్పుడు, యేసు నామమున మీరు రూపాంతరపరచబడతారు. ఇంకను అట్టి పాపమును మీరు ఇకను చేయకుండా మీరు శక్తిని కలిగియుంటారు.
ఇంకను, రెండవదిగా, మన దోషములను బట్టి యేసుయైన ఆయనే నలుగగొట్టబడియున్నాడు. అందుకే బైబిల్ నుండి ప్రకటన 2:14 వ వచనములో చూచినట్లయితే, " అయినను బాలాము బోధను అనుసరించువారు మీ యొద్ద ఉన్నారని నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. ఈ బాలాము విగ్రహములకు బలియిచ్చినవాటిని తినునట్లును, వ్యభిచరించునట్లును ఇశ్రాయేలీయుల ఎదుట ఆటంకమును ఉంచుటకు బాలాకునకు నేర్పెను.'' మరియు బైబిల్ నుండి 2 పేతురు 2:15వ వచనములో చూచినట్లయితే, " తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి'' అని వ్రాయబడియున్నట్లుగానే, బిలాము దేవుని ప్రవక్తయైనప్పటికిని, ఇశ్రాయేలీయులకు భోగేచ్ఛ ద్వారా పాపములను జరిగించునట్లుగా చేసియున్నాడు. తద్వారా, దేవుని శాపము ఇశ్రాయేలీయుల మీదికి రావాలనియు, వారు ఆ విధంగా నాశనము చేయబడాలనియు, బిలాము ఆలాగున చేశాడు. అవును, నా ప్రియులారా, చివరికి బిలాము నలుగగొట్టబడ్డాడు. అదేరీతిగా, మన యతిక్రమక్రియలను బట్టి మనము నలుగగొట్టబడకుండా ఉండునట్లుగా యేసు సిలువలో నలుగగొట్టబడ్డాడు. సిలువలో అంధకారము ఆయనను ఆవరించినది. అందుకే ఆయన, " నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి'' అని కేకలు వేశాడు. మనము పాపము చేయునట్లుగా, అంధకార శక్తులన్నింటి నుండి మనం విడుదల పొందునట్లుగా, ఆయన పాపము మరియు దేవునికి దూరమయ్యే స్థితికి సంబంధించిన భరించలేని భారమును తన మీద వేసుకున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ మీరు ఇతరులు తొట్రిల్లి పడిపోవడానికి కారణమైతే, లేదా పాపం కారణంగా మీ జీవితంలోకి అంధకారం ప్రవేశించి ఉన్నట్లయితే, ఈ రోజే యేసు యొద్దకు రండి. ఆయన క్షమాపణను కోరుకొనండి. ఆయన మిమ్మును విడిపించి, మీ జీవితమును తన వెలుగుతో మరియు శాంతి సమాధానముతో నింపుతాడు.
మూడవదిగా, మన అనారోగముల నిమిత్తం యేసు గాయపరచబడ్డాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 17:14-15వ వచనములో చూచినట్లయితే, "వారు జనసమూహము నొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ఒక తండ్రి యేసు వద్దకు వచ్చి కనికరం కొరకు వేడుకున్నాడు; ఎందుకంటే అతని కుమారుడు ఒక దురాత్మ వలన ఎన్నో ఇబ్బందులకు గురవుతూ, అగ్నిలోనూ నీళ్లలోనూ పడిపోయేవాడు. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలిపోయెను; ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. అవును, నా ప్రియులారా, యేసు తాను చేసిన పరిచర్య అంతటా, ఆయన రోగులను స్వస్థపరచాడు మరియు బాధపడువారిని విడిపించాడు. చివరిగా, సిలువ మీద ఆయన మన వ్యాధులను తన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలుగునట్లుగా చేశాడు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు, మనం యేసు నామమునకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మేకులు గ్రుచ్చబడిన తన చేతులను మన వైపు చాపుతాడు. ఆయన మన పాపములను క్షమించి, మన దోషములను తొలగించి, మన వ్యాధులను స్వస్థపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో ఎటువంటి భారములు ఉన్నను సరే, దానిని యేసు సన్నిధికి తీసుకురండి. ఆయన మిమ్మును క్షమించడానికి, పునరుద్ధరించడానికి, విడిపించడానికి మరియు సంపూర్ణంగా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు మీరు ఆయన ఆశీర్వాదమును పొందుకొని, మీ జీవితంలో ఆయన యొక్క రూపాంతరపరచు శక్తిని అనుభవించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, మా అతిక్రమముల కొరకు నీవు గాయపరచబడినందుకై, మా అపరాధముల నిమిత్తము నలుగగొట్టబడినందుకు మరియు మా స్వస్థత కొరకు గాయపరచబడినందుకు నీకు వందనములు. యేసయ్యా, నీ వలె మేము దీనమనస్సుగల హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము, నీ క్షమాపణ, స్వస్థత మరియు పునరుద్ధరణను కోరుకుంటున్నాము. దేవా, నీ అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మును కడిగి పవిత్రపరచి, నీతి మార్గంలో నడవడానికి మాకు నీ యొక్క బలమును అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితము నుండి ప్రతి భారమును, అపరాధభావమును, భయమును మరియు చీకటిని తొలగించుము. యేసయ్యా, నీ స్వస్థపరచు స్పర్శ మా శరీరమును, మనస్సు మరియు ఆత్మపై నిలిచియుండునట్లుగా చేయుము. దేవా, మా జీవితములలో ఉన్న ప్రతి దుష్టశక్తుల నుండి మమ్మును విడిపించి, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. ప్రభువా, నిన్ను ఘనపరచే మరియు నీ నామమునకు మహిమను తీసుకొనివచ్చు జీవితమును జీవించుటకు మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


