నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆమోసు 3:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు'' ప్రకారం ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనము. దేవుడు తన ప్రణాళికలను మీ కొరకు బయలుపరచాలని మీ పట్ల కోరుకుంటున్న దేవుడుగా ఉన్నాడు. మీరు ఆయన కొరకు ఏర్పరచబడిన పాత్రయై యున్నాడు. మీరు దేవుని హృదయానికి అత్యంత సన్నిహితులై యున్నారు. యోహాను యేసు యొక్క రొమ్మున ఆనుకొని యుండేవాడు. ఆ రీతిగా, యేసు యొద్ద నుండి మర్మమును అర్థము చేసుకొన్న ఒక శిష్యుడు. ఒకవేళ, ప్రియులారా, ఈ రోజు కూడా మీరు యేసు యొక్క రొమ్మున ఆనుకొనియుండవచ్చును. మీరు ఆయన ప్రణాళికలలో నడుచు నిమిత్తము; ఆయన మనస్సును మరియు ఆయన తలంపులను యెరిగి ఉండవచ్చును. ఇంకను మీరు దేవుని ప్రణాళికలను ఇతరుల యొద్దకు కూడా తీసుకొను వెళ్లునట్లుగా; మీరు ఈ లోకములో ఘనత వహించిన, వినియోగించదగిన పాత్రగా ఉండవచ్చును. యేసు కొరకు ఉపయోగపడు విధంగా, మీ కుటుంబానికి మరియు ఆలాగుననే, ఈ లోకమునకు ఉపయోగపడువిధంగా ఉండి యుండవచ్చును. మీరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడు విధంగా ఉండి ఉన్నప్పుడు, ప్రభువు మిమ్మును ఘనపరచి,ఈ లోకములో ఉన్నత స్థలములకు పైకి లేవనెత్తుతాడు. ప్రతి ఒక్కరు మీ కొరకు వెదకుతారు, ప్రతి ఒక్కరు మీ కొరకు ఎదురు చూస్తుం టారు. అందరు మిమ్మును కోరుకునేవారుగా ఉంటారు. అటువంటివారు ఈనాటి లోకములో ఎంతగానో అవసరమై యున్నారు. కాబట్టి, మీరు ప్రభువునందు ఆనందించండి.
అయితే, నా ప్రియులారా, దేవుడు తన ప్రణాళికను మన పట్ల ఏరీతిగా బయలుపరుస్తాడు? అని బైబిల్ నుండి హెబ్రీయులకు 4:3వ వచనములో మనము చదివినట్లయితే, "కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము'' ప్రకారం జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్ణములై ఉన్నవని లేఖములలో వ్రాయబడియున్నది. ఈ లోకములో ఏమి సృజించబడవలసి ఉన్నదో, ఆలాగే విశ్వాసములోను, విశ్వసము ఏలాగున పనిచేయబడవలెను, జీవము ఏలాగున స్థిరపరచబడవలెననో, జీవభ్రమణ చక్రము ఏ రీతిగా ఉండవలెనో, నరుడు ఏ విధంగా సృజించబడవలెనో, ఋతువులు కాలములు ఏలాగున పనిచేయవలెనో, చరిత్ర కాలములో ఏమేమి సంభవించవలసియున్నదో, గతమును, వర్తమానము, భవిష్యత్తును కూడా మరియు అన్నిటిని కూడా ముందుగానే ప్రణాళిక చేయబడియున్నవి. మనము చూస్తున్నవన్నియు ముందుగానే ప్రణాళిక చేయబడి ఉన్నవి. దేవుడు మన భవిష్యత్తును ఎరిగియున్నాడు. అయినప్పటికిని, అపవాది జోక్యము కలుగజేసుకొనియున్నాడు. మనిషితో కలిసి పనిచేసియున్నాడు. నరుడు పాపము జరిగించులాగున చేసియున్నాడు. కానీ, దేవుడు సృజించినవన్నియు కూడా మంచిగానే ఉన్నవి. ఆయన హృదయమంతయు కూడా మంచిగా ఉండవలెననియు, అందరు కూడా మంచిని, మేలును అనుభవించి ఆనందించవలెననియు ఆయన కోరుకున్నాడు. అయినప్పటికిని అపవాది చిత్రములోనికి వచ్చాడు. మనిషితో కలిసి పనిచేశాడు, నరుడు పాపము చేయునట్లుగా చేసినది. నరుని చర్యల ద్వారా లోకములోనికి దుష్టత్వము వచ్చినది. మనుష్యుని చర్యలు ఈ సమాజములోనికి కీడును మరియు వాతావరణములోనికి కీడును తీసుకొని వచ్చాయి. అయినప్పటికిని, దేవుడు ఈ లోకములోనికి మంచి రావాలని కోరుకున్నాడు. కనుకనే, ఆయన ప్రణాళికను సిద్ధము చేశాడు. ఆయనే స్వయంగా మానవ రూపము ధరించాడు, యేసు అను రూపమును ధరించుకొని ఈ లోకములోనికి మానవునిగా వచ్చాడు. తనను తాను త్యాగము చేసుకొని, తన రక్తమును చిందించియున్నాడు. మానవుని సృజించి, పాపమునకు మరియు చెడునకు పరిహారము కలుగునట్లుగానే, ప్రతి పురుషుడు, స్త్రీ పాపము నుండి విమోచించబడి దైవాశీర్వాదములను వారి జీవితములో అనుభూతి చెంది, ఆనందించునట్లుగా చేసియున్నాడు.
నా ప్రియులారా, ఇంకను ప్రభువైన యేసు ఏమని చెబుతున్నాడనగా, "నా బిడ్డలారా, మీ హృదయమును తెరవండి, నన్ను మీ హృదయములోనికి అంగీకరించండి, నేను మీలోనికి వస్తాను, మీతో కలిసి భోజనము చేస్తాను. మీ జీవితములో నా ప్రణాళికను నేను మీకు బయలుపరుస్తాను. పరిశుద్ధాత్ముని ద్వారా, యేసు యొక్క ఆత్మ ద్వారా, మీరు నా స్వరమును ఆలకించవచ్చును, మీరు నా ప్రణాళికను ప్రవచించవచ్చును'' అని తెలియజేశాడు. తద్వారా, దేవుడు మీ కొరకు సృజించిన మంచి ప్రణాళికలోనికి ప్రవేశించవచ్చును. దేవుడు మీ కొరకు ఒక మార్గమును సిద్ధము చేశాడు, ఈ యొక్క లోక దుష్టత్వమంతటి మధ్యలో మీరు మరియు నేను యేసు ద్వారా తన యొక్క మంచితనమును ఆనందించవచ్చును.ఆయన ఆత్మ యొక్క శక్తిద్వారా, ప్రవచనము ద్వారాను, అందుచేతనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:17వ వచనమును మనము చదివినట్లయితే, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు'' ప్రకారం ఈ రోజు నా ప్రియులారా, పరిశుద్ధాత్మను మీలోపల కలిగియుండవచ్చును. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన ప్రణాళికలను, మీరు ఆలాగున చేయుచుండగా, మీరు వర్థిల్లెదరు. నాకు అమూల్యమైన స్నేహితులారా, నేడు దేవుడు మీతో కూడా మాట్లాడబోవుచున్నాడు. ఇప్పుడే మీరు దేవునికి మొఱ్ఱపెడతారా? ఆలాగైతే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీ బిడ్డలైన మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుము. పరిశుద్ధాత్మ దేవా, నీవు మా హృదయములోనికి ప్రవేశించి, మేము నూతనంగా అన్య భాషలను మాట్లాడునట్లుగా మరియు మేము ప్రవచించునట్లుగా చేయుము. ఓ దేవా, మేము నీ చిత్తము మరియు నీ యొక్క ప్రణాళికను అర్థము చేసుకొనునట్లుగా చేయుము. ప్రభువా, నీ ప్రణాళికను ప్రకటించుట ద్వారా భూలోకములో నీ రాజ్యమును తీసుకొని వచ్చునట్లుగా మమ్మును మార్చుము. దేవా, నీ యొక్క ప్రణాళిక ప్రకారం మా జీవితములో సమస్తమును యేసు నామమున నెరవేర్చాబడాలి, ఇకమీదట నుండి మేము ప్రవచించునట్లుగా చేయుము. ప్రభువా, నీ స్వరమును వినుటకును మరియు నీ రాజ్యమును ఈ లోకమునకు తీసుకొని వచ్చునట్లుగా అటువంటి కృపను మాకు దయచేయుము. దేవా, నీ హృదయాన్ని మాకు బయలుపరచి, మా పట్ల నీకున్న ప్రణాళిక కనుపరచడానికి తృష్ణగొను దేవుడుగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్య, మా హృదయాన్ని నీకు తెరచుచున్నాము. దయచేసి మాలోనికి వచ్చి, మాతో కలిసి భోజనము చేయాలని కోరుచున్నాము. దేవా, మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, మేము నీ స్వరాన్ని స్పష్టంగా వినునట్లుగాను మరియు జగత్పునాది వేయబడినప్పుడే నీవు మా కొరకు సిద్ధపరచిన ప్రణాళికలో నడవాలని మేము కోరుకుంటున్నాము. దేవా, మా భయం, సందేహం మరియు పాపాన్ని మేము ప్రక్కన పెట్టి, మేము నీ యొక్క క్షమాపణ మరియు మంచితనాన్ని పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మమ్మును నీకు, మా కుటుంబానికి మరియు ఈ లోకానికి ఉపయోగపడే ఘనమైన పాత్రగా చేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మచేత మమ్మును ప్రతి అడుగులోనూ నడిపించునట్లుగా మరియు నీ ప్రవచనాత్మక స్వరాన్ని ఇతరులకు తీసుకువెళ్లుటకు మాకు నీకృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.