హలో నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును తన యొక్క బలమైన కృపచేత నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. కృప మన జీవితులలో ప్రతి ఆశీర్వాదమును తీసుకొని వచ్చుచున్నది. మనము మన యొక్క ప్రతిభను బట్టి, ఆశీర్వదింపబడియుండలేదు. కానీ, మన ప్రభువు మనకు చూపించిన కృపను బట్టి, దయను బట్టి, మనకు ప్రభువు ఆ విధంగా చూపించియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానమున బైబిల్ నుండి 2 తిమోతికి 2:1వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని కృపచేత బలవంతులముగా జీవించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అవును, క్రీస్తు యేసునందు ఉన్న కృప ఏలాంటిది? అని మనము చూచినట్లయితే, మనకు అవసరమైన వాటన్నిటిని కూడా అది అనుగ్రహించుచున్నది.
అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:8వ వచనములో చూచినట్లయితే, " మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనలను అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించగల శక్తిమంతుడైయున్నాడు. తద్వారా, అన్ని విషయములలో, ఆలాగుననే, అన్ని సమయములలోను మీకు అవసరమైన సమస్తమును మీరు కలిగియుండెదరు. ఆలాగుననే, ప్రతి సత్క్రియ యందును మీరు వృద్ధి పొందెదరు. ఆ యొక్క కృప ద్వారా యేసు నొద్ద నుండి మీలోనికి అటువంటి శక్తి వచ్చుచున్నది. కనుకనే, ఈ రోజున అటువంటి కృప మీ మీదికి వచ్చును గాక. ఆలాగుననే, మీకు అవసరమైన సమస్తమును మరియు అత్యంత సమృద్ధి అనుగ్రహించునట్లుగాను మరియు మీరు ప్రతి సత్క్రియయందు వర్థిల్లతను పొందునట్లుగాను, దేవుని కృప ద్వారా అవన్నియు మీ మీదికి నేడు వచ్చును గాక.
రెండవదిగా, బైబిల్ నుండి 2 తిమోతికి 1:9వ వచనములో చూచినట్లయితే, "మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను'' అని చెప్పబడినట్లుగానే, కృప మనము రక్షింపబడునట్లుగానే, ఇంకను మనము దేవుని బిడ్డలుగా మారునట్లుగాను మనకు సామర్థ్యమును అనుగ్రహించుచున్నది. మన యొక్క ప్రతిభను బట్టి, మనము పరిశుద్ధపరచబడియుండలేదు. కానీ, దేవుని యొక్క కృప, ఆయన దయ కనికరమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. అవును, యేసు ద్వారానే మనము పరిశుద్ధపరచబడియున్నాము.
మూడవదిగా, దేవుని కృప ద్వారా మన యొక్క బలము నూతనపరచబడుచున్నది. అందుకే బైబిల్ నుండి యెషయా 40:31వ వచనమును చూచినట్లయితే, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనలను పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లుగా మన బలమును నూతనపరచబడుచున్నాడు. ఆయన దీనులకు కృపను అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మనము వినయముతో దేవుని పాదముల చెంత వేచియున్నప్పుడు పక్షిరాజులవలె రెక్కలు చాపి ఆ రీతిగా మనము పైకి ఎగరగలము. కనుకనే, మీరు ప్రతి బలహీనతను మరియు అపజయమును అధిగమించి, మీరు పైకి ఎగురునట్లుగా, దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఒకవేళ నా ప్రియులారా, మీరు మీ జీవితములో అత్యల్పస్థాయిలో ఉన్నారేమో? కానీ, దేవుని కృప మీ మీదికి వచ్చి, మిమ్మును పైకి లేవనెత్తును. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
అలాగుననే, చివరిగా, బైబిల్ నుండి తీతుకు 2:11-13వ వచనములలో చూచినట్లయితే, "ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని కృపను బట్టి, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమగునట్లుగాను మరియు సమస్త మనుష్యులకు నీతిని అనుగ్రహించునట్లుగాను, దైవీకము కాని దానిని మనము తృణీకరించునట్లుగా చేయుచున్నది. అంతమాత్రమే కాదు, లోకపరమైన ఆశలను మనము త్యజించునట్లుగా చేయుచున్నది. అయితే, నీతిగా మరియు దైవీకముగా జీవించునట్లుగా చేయుచున్నది. దేవుడు ఇటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. దేవుని కృప మీ మీదికి దిగివచ్చును గాక. దేవుని కృపను బట్టి, మనము ఇంకను లయము కాలేదు. ఆయన కనికరములు ప్రతి ఉదయకాలమున నూతనముగా పుట్టుచున్నవి. కనుకనే, ఈ ఉదయకాలమున మీరు నూతనమైన కృపను కలిగియుండెదరు. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరముగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితంలో నీ సమృద్ధియైన కృపకు వందనములు. దేవా, నీ యొక్క కృప ద్వారా మాకు బలమును దయచేయుము. ప్రభువా, మేము నూతనమైన ఉత్తేజముతో పైకి లేవనెత్తబడునట్లుగా చేయుము. దేవా, మేము ఈ రోజు నుండి దైవీకతను కలిగియుండునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతి విషయమునందు మేము సర్వసమృద్ధిని కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి బలహీనతకు, ప్రతి అవసరానికి, మరియు ప్రతి సవాలుకు నీ కృప చాలు అని నమ్ముటకు కృపనిమ్ము. ప్రభువా, నీ యొక్క బలంతో మమ్మును నింపు, మా ఆత్మను నూతనపరచు, మరియు పరిశుద్ధమైన, దైవభక్తిగల జీవితమును గడపడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ కృప మా శరీరాన్ని స్వస్థపరచి, మా మనస్సును బలపరచి, మా జీవితంలోని ప్రతి రంగాన్ని ఆశీర్వదించుము. ప్రభువా, మా ప్రతి వైఫల్యం నుండి మేము పైకి లేచి, నీ సంకల్పంలో నడవడానికి మాకు కృపను దయచేయుము. దేవా, మా యొక్క బలహీనతలలో నీ యొక్క బలమును పరిపూర్ణమగునట్లుగా చేయుము. ప్రభువా, నీ కృప ద్వారా మా దేహములు స్వస్థతను, దైవీకమును కలిగియుండు కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


