నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు నేడు మీకు గొప్ప పేరును అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఈ రోజున మీరు సమాజములో గొప్ప పేరును సంపాదించుకోవాలని ప్రయత్నించుచున్నారేమో? నా జీవితములో నేను 17 సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడు, నేను దేవునికి దూరముగా వెళ్లిపోయినప్పుడు, మా తండ్రిగారు మాట్లాడుచున్నప్పుడు, నేను ఆలకించాను. ఆయన ఈలాగున చెప్పారు, 'మీరు గొప్ప వారుగా కావాలని కోరుకుంటున్నారు, మీరు దేవునికి దూరమైపోయారు గనుకనే, గొప్పవారుగా కావడముకంటే, ఏమి కాని వారుగా మారిపోయారు. కాబట్టి, యేసు చెంతకు రండి, ఏమీ కానీ స్థితి నుండి ఆయన ప్రేమ చేత మీరు గొప్ప వారుగా మార్చబడతారు. కనుకనే, మీరు ఆయన యొద్దకు రండి అని చెప్పారు.' అటువంటి వాగ్దానమును నేడు బైబిల్ నుండి ఆదికాండము 12:2వ వచనమును మీకు దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఆ వాగ్దాన వచనము, " నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆశీర్వాదములు ఈ లోకములో ఐశ్వర్యమును వృద్ధిపొందింపజేయుచున్నది. దేవుడు కేవలము మనకు ధనమును మాత్రమే ఇవ్వడము కాదు, ఆయన అన్నివిధాలుగా మనలను ఆశీర్వాదిస్తాడు. మన యొక్క ఆత్మను ఆయనలో భద్రముగా ఉంచుతాడు. కేవలము ప్రభువు మాత్రమే ఆలాగున చేయగలడు. మీరు కేవలము ధనమును మాత్రమే కలిగియున్నట్లయితే, మీరు మీ ఆత్మను కోల్పోవుదురేమో? మీరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలముగా ఉన్నదని తెలియజేయబడుచున్నది. కానీ దైవభక్తి, ఈ లోకమందును, రాబోవు లోకమందు కూడా ప్రయోజనకరమైనది ఉన్నది.
కనుకనే, నా ప్రియులారా, ఈ రోజున మీ జీవితమును ప్రభువైన యేసు యొక్క చేతులకు అప్పగించుకొనండి. ఆయన మిమ్మును గొప్పవారినిగా చేయుచున్నాడు. ఆలాగుననే, ఆయన శక్తి ద్వారా మీరు గొప్పవారు కావలెనని ఆయన మీ కోసము ఎంతగానో శ్రమపడియున్నాడు. ఎంతగానో త్యాగము చేసియున్నాడు. అందుకే బైబిల్‌లో ఫిలిప్పీయులకు 2:6 నుండి 10 వ వచనముల వరకు మీరు చదివినట్లయితే, లేఖనము ఏమంటుందో చూడండి, " ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలోగాని, భూమి మీద ఉన్నవారిలోగాని, భూమి క్రింద ఉన్నవారిలోగాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను'' అని చెప్పబడిన ప్రకారము యేసు దేవుని యొక్క స్వభావమును కలిగినవాడై యున్నప్పటికిని, ఆయన దేవుడై యున్నాడు. శరీరాకృతిలో ఉన్న దేవుడై యున్నాడు. అయినప్పటికిని, ఆయన సర్వశక్తిగల దేవుడుగా ఉన్నప్పటికిని, ఆయన దాసుని రూపమును ధరించియున్నాడు. ఒక మానవాళి వలె కాదు, గానీ, మానవాళి మధ్యలో దాసుని వలె ఉన్నాడు. మానవాళి ద్వారా కలిగించబడే ప్రతి సమస్యను ఆయన ఎరిగియున్నాడు. మీరు, నేను అనుభూతి చెందుచున్న ప్రతి శ్రమ గుండా ఆయన అనుభూతి చెంది వెళ్లియున్నాడు. చివరికి ఆయన మరణము నొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని చిత్తమునకు విధేయుడైయ్యాడు. మన యొక్క విమోచన కొరకు తనను తాను బలియర్పణము గావించుకొనియున్నాడు. అయినప్పటికిని దేవుడు ఆయనను తిరిగి లేవనెత్తియున్నాడు. ఆయనకు జీవమును అనుగ్రహించియున్నాడు. యేసు యొక్క ఆత్మ ద్వారా ఆయన దేహమైతే, మృత్తినొందియున్నది. కానీ, యేసు ఆత్మ సజీవముగా ఉన్నది. యేసు యొక్క ఆత్మ, దేహమును లేవనెత్తియున్నది. ఈ రోజు ఆయన సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
అవును, నా ప్రియులారా, దేవుడు యేసుకు అత్యున్నతమైన స్థానమును ఇచ్చాడు. అవును, యేసు అత్యున్నతమైన స్థానములో ఉండియున్నాడు. ఈ రోజున యేసు నామములో ప్రతి మోకాలు వంగుతుంది. మనుష్యుడు ప్రయత్నించవచ్చును, ఈ లోక శక్తులు ప్రయత్నము చేయవచ్చును. యేసును మరియు ఆయన ప్రజలను నాశనము చేయడము కోసము అపవాది ప్రయత్నము చేయవచ్చును. ప్రజలు శతాబ్దాలుగా ఈ విధంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అవును, రోమా గవర్నర్‌లు మరియు సీజర్ యేసు నామాన్ని ధరించిన వారందరిని చంపడానికి ప్రయత్నించారు. అయితే, రోమా నుండి పారిపోయిన వారు పరిసర ప్రాంతములయందంతట, విస్తరించి, సంచరించి, యేసు నామములో ప్రకటించి, అద్భుతములను జరిగించియున్నారు. తత్ఫలితముగా, ్రకైస్తవ్యము మరియు క్రీస్తు యొక్క నామమున కోట్లాదిమందికి ఈ రోజు పరిచర్య చేయబడినట్లుగా ఉన్నది. ప్రతి నామము యేసు నామమునకు లోబడవలసియున్నది. ప్రజలు యేసు నామమునకు విరుద్ధముగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చును. యేసు నామమును భరించువారికి నాశనము చేయ ప్రయత్నము చేయవచ్చును. అయినప్పటికిని, వీటన్నిటి ద్వారా యేసు నామమును, ఆయన నామమును మోయుచున్నవారిని దైవాశీర్వాదముల ద్వారా వారిని పైకి లేవనెత్తబడుతుంది. వారి యొక్క నామము గొప్ప చేయబడుతుంది. వారిని నాశనము చేయువారు ఇక కనబడరు. కనుకనే, రోమా సైన్యము, కైసరు ఇక లేరు. ఈ రోజు ఎక్కడైతే, రోమా నగరములో ్రకైస్తవులు చంపబడియున్నారో, అదే ప్రాంతము ్రకైస్తవులకు అత్యంత ప్రాముఖ్య కేంద్రమైన ప్రాంతముగా ఉంచబడుతుంది. దేవుని ప్రజలకు విరుద్ధముగా వెళ్లుచున్న ప్రతి దేశములో కూడా ఈ రీతిగానే జరిగించబడబోవుచున్నది. ఆ దేశము యేసు నామమును భరించేవారికి రాజధానిగా ఉండబోవుచున్నది. యేసు నామములో అటువంటి శక్తి ఉన్నది. అటువంటి యేసు నామమును ఆయన మీకు అనుగ్రహించుచున్నాడు కనుకనే భయపడకండి, బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 4:12వ వచనములో చూచినట్లయితే, "మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను '' ప్రకారము యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ అనుగ్రహింపబడదు. కనుకనే, భయపడకండి. దేవుని రక్షణ మీ చెంతకు వచ్చుచున్నది. మీరు యేసు నామమున వంగుతూ ఉన్నవారిగా ఉన్నట్లయితే, ఆయన యేసు నామమున మిమ్మును మోసుకొని తీసుకొని వెళ్లును. మీ హృదయమును కలవరపడనీయ్యకండి. నేటి వాగ్దానము నుండి మీ పేరును గొప్ప చేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. తండ్రీ, నీ కృప మా పట్ల విస్తరించునట్లుగా చేయుము మరియు నీ జాగ్రత్తకు మమ్మును మేము అప్పగించుకొనుచున్నాము. దేవా, మా నుదుట మీద నీ నామమున ఉండునట్లుగా చేసి, మా హృదయాలను మోసుకొని వెళ్లుచున్న అపవాది యొక్క దుష్ట పన్నాగముల నుండి మమ్మును నీవు తప్పించుము. యేసయ్యా, నిన్ను మోయుచున్న మా పేరును నీవు గొప్పగా చేయుము. ప్రభువా, మా జీవితములో ప్రతి పరిస్థితిని ఇప్పుడే మార్చివేయుము. దేవా, మా యొక్క ప్రతి ప్రార్థనకు జవాబును ఇచ్చు మీ నామము ద్వారా మా ప్రార్థనకు జవాబిచ్చి, అందరి యెదుట మా పేరు ఘనపరచుము. ప్రియమైన ప్రభువా, ఈ రోజు మా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము, నీ ప్రేమ మరియు శక్తి ద్వారా మమ్మును ఒక గొప్ప వ్యక్తిగా చేయగలది నీవు మాత్రమే. కనుకనే, మా జీవితంలో నీ వాగ్దానం నెరవేరాలి మరియు నీ చిత్తానుసారంగా మా పేరును గొప్పగా చేయాలి. దేవా, మా ఆత్మను నీలో సురక్షితంగా భద్రపరచబడునట్లుగాను మరియు లౌకిక లాభంపై ఉన్న ప్రతి ప్రేమను తొలగించుము. ప్రభువా, అన్ని విషయాలలో నిన్ను ప్రీతికరంగా ఉంటూ, దైవభక్తితో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును గొప్ప స్థితికి హెచ్చించే నీ అంతిమ త్యాగానికి నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీ నామమున స్థిరపరచు, మమ్మును ఆశీర్వదించి మరియు మా జీవితమును నీ మహిమ కొరకు ఉపయోగించుకొనబడునట్లుగా మాకు నీకృపను అనుగ్రహించుము. దేవా, మా రక్షణ మరియు మంచి భవిష్యత్తు కోసం మేము కేవలం నీ నామము మీదనే నమ్మకం ఉంచునట్లుగా కృపను దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


