నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 1:27వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించెను'' ప్రకారము నేను దేవుని అడిగినది ఆయన నాకు అనుగ్రహించాడు అని హన్నా పలికెను. కానీ, మనం దేవుని అడిగినవి ఎలా పొందుకొనగలము? అని బైబిల్ నుండి మత్తయి 7:7వ వచనములో చూచినట్లయితే, "అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును'' అని యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు కనకునే, మీరు దేవుని అడగండి అది మీకు ఇవ్వబడును, మరియు ఇదే సత్యం మార్కు 11:24లో కూడా వ్రాయబడియున్నది. అయితే, మనం దేనిని అడిగినను సరే, దేవుని యెదుట సరైన ఉద్దేశంతో అడగాలి. అందుకే బైబిల్ నుండి యాకోబు 4:3వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, "మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు '' ప్రకారము మీరు అడిగినప్పుడు, మీ కోరికలను తీర్చుకోవాలనే దురుద్దేశముతో అడుగుచున్నారు కాబట్టి, నా ప్రియులారా, మీకు ఏమియు పొందుకొనుట లేదు. కనుకనే, మీరు అడిగినప్పుడు, సరైన ఉద్దేశంతో అడిగినప్పుడు మీరు అడిగినది దేనినైనను సరే అది మీకు దొరుకుతుంది. రెండవదిగా, మనం ప్రార్థన చేయునప్పుడు అడిగినది పొందుకుంటామని నమ్మాలని ప్రభువైన యేసు తెలియజేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 21:22 మరియు 1 యోహాను 5:15వ వచనాలలో మనము చూచినట్లయితే, "మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరికినవని) నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. '' అవును, మనం దేవుని అడిగినప్పుడు, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని మనకు గ్రహించాలి. అంతమాత్రమే కాదు, మనం దేవుని అడిగినవన్నియు పొందియున్నామని నమ్మినట్లయితే, అప్పుడు అవన్నియు మీరు పొందుకుంటారు. కనుకనే, మీరు దేవుని యందు నమ్మకముతో అడగండి.
ఆలాగుననే, నా ప్రియులారా, మూడవదిగా, మనం దేవుని వాక్యం ప్రకారం అడగాలి. అందుకే బైబిల్ నుండి యోహాను 15:7వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది: " నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును'' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, కాబట్టి, మీరు బైబిల్ గ్రంథమును ప్రతి దినము క్రమముగా చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాగ్దానాలను అంగీకరించండి మరియు లేఖనములలో ఆయన తెలియజేసిన వాగ్దానములను నెరవేర్చమని దేవుని అడగండి, అప్పుడు అవన్నియు మీరు పొందుకుంటారు. ఆయన చిత్త ప్రకారము మీరు అడగండి, అప్పుడు మీలో ఆ కోరికలు నెరవేర్చబడుతాయి. సాధారణంగా, ఈ లోకపరమైన లేదా భోగేచ్ఛల నిమిత్తము అడగకండి. అందుకు బదులుగా దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసిన లేఖనములను బట్టి, ఆయనను అడిగినట్లయితే, పరలోకము నుండి దేవుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నాల్గవదిగా, నా ప్రియులారా, మీరు దేనిని అడిగినను, దేవుని చిత్తానుసారంగా అడగాలి. కాగా జగత్పునాది వేయబడక మునుపే, మన నిమిత్తము దేవుని ఉద్దేశములన్నిటిని సంపూర్తి చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 4:3 మరియు రోమీయులకు 8:26-27 వ వచనములలో చూచినట్లయితే, దేవుని చిత్తాన్ని మీకు చూపించమని పరిశుద్ధాత్మను అడగండి. కనుకనే, నా ప్రియులారా, మనం ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడిగినట్లయితే, సమస్తమును దేవుడు మీకు దయచేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మన మనవిని ఆలకిస్తాడనే మనకున్న ధైర్యం అని 1 యోహాను 5:14వ వచనములో చెప్పబడియున్నది. ఆ వచనము, " మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మనమెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము'' ప్రకారము దేవుని చిత్తానుసారముగా మనము అడగాలని చెప్పబడినట్లుగానే, దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయుచున్నాడు. అప్పుడు, మనము ఆయన చిత్తానుసారముగా దేనిని అడిగినను సరే, ఆయన మన మనవి ఆలకిస్తాడని నమ్మండి. నిశ్చయముగా, మీరు వాటిని పొందుకుంటారు.
ఇంకను ఐదవదిగా, 'ప్రభువా, మేము నీ చిత్తాన్ని నెరవేర్చాలి' అని మీరు అడిగినప్పుడు, నిశ్చయముగా మీరు ప్రార్థించే ప్రతిదానికి ఆయన జవాబిస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 3:21-22వ వచనములలో ఇలాగున చెప్పబడియున్నది: దేవుడు ఏమి చేయమని సెలవిచ్చుచున్నాడో, ఆ కార్యములను మనము చేసినప్పుడు ఆయన మనకు సమస్తమును దయచేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు, మనం ఏమి అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆరవదిగా, మీరు దేవుని రాజ్యము కొరకు ఫలించినప్పుడు, మీరు ఏమి అడిగినా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 15:16 వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని'' అని చెప్పబడినట్లుగానే, మీరు యేసులో ఫలించినప్పుడు, మీరు యేసు నామములో ఏమి అడిగినా తండ్రి మీకు తప్పకుండా అనుగ్రహించును. అంతమాత్రమే కాదు, మీరు స్వస్థపరచమని యేసును అడిగినప్పుడు, ఆయన మిమ్మును స్వస్థపరుస్తాడు. ఒకవేళ మీరు నిరుపేదల కొరకు దేవుని సహాయం అడిగినప్పుడు, ఆయన మీకు జవాబిస్తాడు. మీరు జీవితాలను మార్చమని మరియు రక్షణను అనుగ్రహించమని దేవుని అడిగినప్పుడు, ఆయన మీకు నిశ్చయముగా జవాబిస్తాడు. ఇవి దేవుని రాజ్యానికి ప్రతిఫలము పొందునట్లుగా చేయును. మరియు బైబిల్ నుండి యోహాను 16:24వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును '' ప్రకారము మీరు అడిగినప్పుడు మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. నా ప్రియులారా, మీరు, ' నేను ప్రార్థించి, పవిత్రంగా జీవించాను, అందుకే నాకు అద్భుతం జరిగింది' అని ఎప్పుడూ చెప్పకండి. దేవుని కృపలో మీరు సంతోషించినప్పుడు, ఆయన మీరు అడుగు వాటన్నిటికంటెను మరియు ఊహించు వాటన్నిటికంటెను అత్యధికంగా మీకు మీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని ఎఫెసీయులకు 3:20 అని చెప్పబడియున్నది. మరియు బైబిల్ నుండి జెఫన్యా 3:17వ వచనములో చూచినట్లయితే, ఆయన సంతోషగానములు పాడుచూ మీ నిమిత్తమై ఆనందించును అంతమాత్రమే కాదు, మీ విషయమై హర్షించును. కనుకనే, ఈ నూతన సంవత్సరములో దేవుడు ఇంతటి గొప్ప ఆశీర్వాదములను ఈ నూతన సంవత్సరములో మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఈ సంవత్సరమంతయు ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మేము ప్రార్థించేటప్పుడు మా ప్రార్థన ఆలకించినందుకై నీకు వందనాలు. దేవా, దయచేసి పవిత్రమైన ఉద్దేశ్యములతో మరియు నమ్మకమైన హృదయంతో నిన్ను అడగడం మాకు నేర్పించుము. ప్రభువా, మేము నీ వాక్యమును విశ్వసించడానికి మరియు నీ వాగ్దానాలను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ చిత్తాన్ని తెలుసుకొనునట్లుగా మాకు నీ చిత్తమును బయలుపరచుము. ప్రభువా, నీ రాజ్యం కొరకు మా ప్రార్థనలు ఫలించునట్లుగాను మరియు నీవు మా ప్రార్థనలకు జవాబులను తీసుకువచ్చునప్పుడు మా జీవితమును నీ యొక్క సంతోషముతో నింపుము. దేవా, మేము, నీ కృపలో మాత్రమే ఆనందించునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


