నా ప్రియమైన స్నేహితులారా, మీ జీవితములో కనికరమును ఎలాగున మీరు స్వీకరించవలెనని నేను మీతో మాట్లాడవలెనని మీ పట్ల కోరుచున్నాను. కానీ, దేవుడు మీరు కనికరమును కలిగియుండాలని మీ పట్ల కోరుచున్నాడు. అనేక ఫర్యాయములు, మనము, 'నాకు అంతయు ఉన్నది, శక్తి మరియు జ్ఞానము కలదు' అన్నట్టుగా భావిస్తుంటాము. కానీ, ఒక సమయము వస్తుంది, అప్పుడు మీకు కనికరము ఎంతో అవసరముగా ఉంటుంది. అందునిమిత్తము ప్రభువు నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఏమని చెబుతున్నాడని మత్తయి సువార్త 5:7వ వచనములో చూచినట్లయితే, "కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు'' ప్రకారముగా, మీరు కనికరము గలవారైతే, మీరు కనికరమును పొందుకుంటారు. దేవుడు మీకు కనికరమును చూపిస్తాడు. మీ కుటుంబము మరియు పనిచేయుచున్న స్థలములోను, సమాజములో మీకు కనికరమును చూపుతారు. మీరు కనికరముతో నింపబడినవారుగా ఉంటారు. కనికరము అనునది దేవుని యొద్ద నుండి వచ్చు వరమై యున్నది. దేవుని యొక్క కనికరమును బట్టి, మనము ఇంకను నిర్మూలము కాకున్నవారమై యున్నాము. అందుకే బైబిల్ నుండి విలాపవాక్యములు 3:22,23వ వచనములలో చూచినట్లయితే, " యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని కనికరము మనలను భద్రపరచును. అవును, దివారాత్రము ఆయన మనలను గమనించుచున్నాడు. ప్రజలు మరియు దయ్యములు మన చుట్టు మనలను నాశనము చేయుట కొరకు పోగుచేయబడినట్లుగా ఉన్నప్పుడు, పాపము మనలో నుండి పైకి లేచి మనలను నాశనము చేయుయాలని అనుకున్నప్పుడు దేవుని కనికరము పంపించబడుతుంది. దానినే మనము కృప అని కూడా అంటాము.
అవును, బైబిల్ నుండి యోనాను సముద్రములోనికి విసిరివేసియున్నారు. ఎందుకనగా, అతడు దేవునికి అవిధేయుడయ్యాడు. అయినప్పటికిని, దేవుని చేత ఒక చేప పంపించబడినది. అది యోనాను సంపూర్ణంగా మ్రింగివేసినది. అది ఏ మాత్రము అతనిని ముక్కలు ముక్కలుగా కొరికివేయలేదు. కారణము, ఆ తర్వాత అతడు చేప కడుపులో ఉన్నప్పుడు యోనా దేవునికి మొఱ్ఱపెట్టాడు. బైబిల్ నుండి యోనా 2:2వ వచనములో చూచినట్లయితే, "ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు'' ప్రకారము యోనా దేవునికి మొఱ్ఱపెట్టాడు. ఎందుకనగా, జీర్ణ రసములు స్రవించబడి, అవి యోనాను కరిగించుకొనుటకు మంట పుట్టునట్లుగా యోనా మీదికి వచ్చుచున్నప్పుడు దేవుని కనికరము అతని మీదికి వచ్చి, అతనిని ఆవరించెను, అంతమాత్రమే కాదు, అతనిని భద్రపరచినది. దేవుడు అతని కొరకై పరిచర్యలో నియమించిన అదే స్థలములో ఆ చేప దేవుని ద్వారా వచ్చి యోనాను కక్కివేసియున్నది. ఇదంతయు చరిత్రయే కదా! ఎందుకనగా, దేవుడు అతని పట్ల కనికరము చూపించియున్నాడు కనుకనే, అతడు నాశనము కాలేదు. అతని ద్వారా ఒక దేశము దేవుని చెంతకు వచ్చియున్నది. అదే కృప మీ మీదికి వస్తున్నది. దేవుని కనికరము మరియు దేవుని యొక్క క్షమాపణ, అయినప్పటికిని, దేశమునకు మరియు నగరమునకు మనలను దీవెనకరముగా చేయుచున్నది. నా ప్రియులారా, ఈ రోజు దేవుడు మీకు కనికరమును చూపించగోరుచున్నాడు. కనుకనే, బైబిల్ నుండి 1 యోహాను 1:9వ వచనములో చూచినట్లయితే, " మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును'' అని చెప్పబడినట్లుగానే, మనము మన పాపములను ఒప్పుకొనెదము. ఆలాగుననే, మీరు మీ పాపములను ఒప్పుకొన్నప్పుడు, అప్పుడు దేవుడు నీతిమంతుడునుగాను, న్యాయముగలవానిగా మిమ్మును క్షమించడానికి సిద్ధముగా ఉంటాడు. అంతమాత్రమే కాదు, సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రపరుస్తాడు. దేవుడు ఇటువంటి కృపను నేడు మీకు అనుగ్రహించును గాక.
ఇంకను బైబిల్ నుండి ఎఫెసీయులకు 4:32వ వచనములో చూచినట్లయితే, "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి'' అని చెప్పబడినట్లుగానే, ఒకరి యెడల ఒకరు దయగలిగి ఉండండి. ఇంకను ఒకరినొకరు క్షమించుకొనండి. క్రీస్తు మిమ్మును క్షమించియున్న రీతిగానే మీరు క్షమించండి. అందుకే బైబిల్ నుండి మత్తయి 6:14-15వ వచనములలో చూచినట్లయితే, " మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు'' అని చెప్పినట్లుగానే, మీరు ఇతర ప్రజలను క్షమించినట్లయితే, పరలోకపు తండ్రి మిమ్మును క్షమించును. అవును, పరలోకపు తండ్రి మిమ్మును క్షమించును. అందుకే బైబిల్ నుండి లూకా 6:37-38వ వచనములలో చూచినట్లయితే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు'' అని చెప్పబడియున్నది. అవును, మనము క్షమించబడు నిమిత్తము మనము ఇతరులను క్షమించెదము. రెండవదిగా, మనము ఇవ్వడము నేర్చుకుందాము. ఇవ్వడము ద్వారా మనము కనికరమును చూపుదుము. అందుకే బైబిల్ నుండి మత్తయి 7:7-11వ వచనములలో చూచినట్లయితే, "మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా?'' ప్రకారము ఒక కుమారుడు రొట్టెను అడిగినప్పుడు రొట్టెకు బదులుగా రాతినిస్తాడా? చేపను అడిగినట్లయితే, అతడు పామునిస్తాడా? లేదు కదండి, లేదు కదండి. అదేరీతిగా, ఎవరైనా దేనికోసమై అడిగినట్లయితే, మనము కనికరము చూపుచూ ఉన్నవారికి దానిని వారికి ఇచ్చినట్లయితే, అప్పుడు దేవుడు మనకు బహుమానమును అనుగ్రహిస్తాడు. మనము ఏది అడుగుతామో దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 7:12వ వచనములో చూచినట్లయితే, " కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి '' అని చెప్పబడినట్లుగానే, ఇతరులు మీకేమని చేయాలని కోరుకుంటారో, ఆలాగున మీరు ఇతరుల పట్ల జరిగించండి. అందుకే బైబిల్ నుండి మత్తయి 5:40వ వచనములో చూచినట్లయితే, "ఎవడైన నీ మీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము'' అని చెప్పబడినట్లుగానే, ఎవరైనా మీ చొక్కాను కోరినట్లయితే, మీ పై వస్త్రమును అనగా, మీ కోటును కూడా ఇచ్చి వేయండి అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇంకను బైబిల్ నుండి హెబ్రీయులకు 13:16వ వచనములో చూచినట్లయితే, " ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి'' అని చెప్పబడినట్లుగానే, మేలు చేయుటను మీరు మరచిపోకండి, ఇతరులతో మీరు కలిగియున్న దానిని పంచుకొనుటకు మరచిపోకండి. ఎందుకనగా, అట్టి యాగముల ద్వారా దేవుడు మిమ్మును బట్టి, ఆనందిస్తాడు. కనుకనే, ఈ రోజు మనము ఇచ్చేవారముగా ఉందాము. ఇంకను బైబిల్ నుండి లూకా సువార్త 6:38వ వచనములో చూచినట్లయితే, " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును'' అని చెప్పబడినట్లుగానే, మనము అప్పుడు కనికరము మన చెంతకు రావడము మనము చూడగలము. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి. నేడు మనము ఇటువంటి కనికరము కొరకు ప్రార్థన చేయుదము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును కాపాడిన నీ గొప్ప కనికరమును మా పట్ల చూపుచున్నందుకై నీకు వందనములు. దేవా, నీవు కనికరముగలిగియున్నట్లుగానే, మేము కూడా కనికరముగలవారై ఉండుటకు మాకు నేర్పించుము. ప్రభువా, నీ యెదుట మేము ఒప్పుకొనుచున్న మా పాపములను దయచేసి క్షమించుము. ఇంకను యేసయ్యా, మా యొక్క సమస్త దుర్నీతి నుండి మమ్మును పవిత్రులనుగా చేసి, మా హృదయాన్ని పరిశుద్ధపరచుము. దేవా, నీవు మమ్మును క్షమించినట్లుగానే, మేము ఇతరులను సంపూర్ణంగా క్షమించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, కనికరమును, దయ, మరియు కృపతో మమ్మును నింపుము. దేవా, మేము ఇంకను ధారాళంగాను, ఉత్సాహంగా ఇచ్చుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము నిర్మూలము కాకున్నవారముగా ఉన్నామంటే, అది నీ కృప మాత్రమే అని మేము నమ్మునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ కనికరము మమ్మును కాపాడి, మా జీవితాన్ని నీతి న్యాయములను జరిగించునట్లుగా మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


