నా ప్రియులారా, ఈ రోజు మా తండ్రిగారైనటువంటి సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారు ప్రభువును కనుగొన్న దినము. ఆయన తన జీవితాన్ని యేసునకు సమర్పించి, తాను చేసిన పాపాలన్నిటికి ఆయన క్షమాపణ పొందుకొని, మా తండ్రిగారు క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డాడు. అప్పటి నుండి, ఎన్నో లక్షలాది మంది ప్రజలు ప్రభువును కనుగొన్నారు మరియు ఆయన పరిచర్య ద్వారా రూపాంతరపరచబడియున్నారు! నా ప్రియమైన స్నేహితులారా, మనలో ఆయనను మోసుకెళ్ళడానికి, మనము దేవుని ఆలయంగా ఉండటానికి మరొకసారి మనలను మనం సమర్పింకుందామా? ఆలాగుననే, మనము ఆయన ఆలయముగా, ఆయనకు పరిశుద్ధమును మరియు సజీవయాగంగా సమర్పించుకుందాము. నా స్నేహితులారా, దేవుడు మనలను ఆశీర్వదించి, ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా మార్చుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:28వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' అని చెప్పబడిన ప్రకారము యేసును ప్రేమించువారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి. కనుకనే, మీరు యేసు ప్రభువును ప్రేమించుచున్నారని నాకు తెలుసు, మీరు మీ జీవితాన్ని యేసుకు సమర్పించియున్నారు మరియు మీ జీవితంలో సమస్తమును మేలు కొరకు జరగాలని నేను ఈ రోజు మీ కొరకు ప్రార్థించుచున్నాను.
నా ప్రియులారా, మనం యేసును ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున నడుచుకున్నప్పుడు మనకు కలిగే మేలు ఏమిటి, ఎటువంటి మేలులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు? మొట్టమొదటిదిగా, దుష్టప్రజలు మనకు కీడు చేయాలనుకున్న వారందరిని దేవుడు మన జీవితాలలో మేలుగా మార్చుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 50:19-20వ వచనములలో మనము చూచినట్లయితే, యోసేపు గురించి తెలియజేయబడియున్నది. అదేమనగా, అతడు పొందుకున్న ఆశీర్వాదం పట్ల అసూయపడి అతని అన్నలు తనను బానిసగా అమ్మి వేశారు మరియు వారు తమ తండ్రికి అతనిని ఒక పెద్ద అడవి మృగము చంపిందని చెప్పారు. వారు యోసేపుతో సంబంధాన్ని కోల్పోయినప్పటికిని, యోసేపు దేవుని ప్రేమించాడు. కనుకనే, దేవుడు యోసేపుకు కూడా తోడుగా ఉండెను. కాబట్టి యోసేపు ప్రభువును ప్రేమించినందున, పరిశుద్ధాత్మ కృపావరములను పొందుకున్నాడు, మరొక దేశంలో కూడా, ఐగుప్తులోని ఒక అధిపతికి బానిసగా అమ్మబడినప్పటికిని కూడా, ప్రభువు పట్ల అతనికి ఉన్న ప్రేమను బట్టి మరియు మానవాళిని రక్షించాలనే దేవుని సంకల్పము చొప్పున అతడు పిలువబడినందున మరొక దేశములో దేవుడు తగిన సమయంలో అతనిని పైకి లేవనెత్తి, తన కుటుంబానికి, దేశమునకు ఆశీర్వాదకరముగా ఉండెను. అదేవిధంగా, నా ప్రియులారా, దేవుడు మీ జీవితానికి ఒక సంకల్పమును కలిగియున్నాడు మరియు యోసేపువలె, మీరు మానవాళిని రక్షించడానికి పిలువబడియున్నారు. కరువు, ప్రకృతి వైపరీత్యాలు, అసూయ మరియు చెడు మాటల మధ్య, మీ జీవితంలో ఆయన సంకల్పమును నెరవేర్చడానికి దేవుని యొక్క మేలులు మిమ్మును వెంబడించును.
యోసేపు దేవుని సంకల్పము చొప్పున ఆయనకు సమర్పించుకున్నాడు. తద్వారా, అతడు చెరసాలకు కూడా వెళ్ళవలసి వచ్చినది. అయినప్పటికిని, అతను ఏ పాపమును కూడా చేయలేదు. కానీ, దేవుడు అతనిని బానిసత్వము నుండి బయటకు తీసుకువచ్చి అతని అన్నలు అతని పాదాల మీద సాగిలపడి ఆహారం కొరకు వేడుకొనునట్లుగా దేవుడు అతనిని హెచ్చించాడు. నా ప్రియులారా, నేడు దేవుడు మీ జీవితంలో సమస్తమును మేలుగా మారుస్తాడు మరియు మీకు అత్యధికమైన ఘనత మరియు సమాధానము కలుగుతుంది. కాబట్టి, నా స్నేహితులారా, మీ హృదయమును కలవరపడనీయ్యకండి. రెండవదిగా, దేవుడు మీ జీవితంలోని కీడునంతటిని మేలుగా మారుస్తాడు, తద్వారా, మీరు ఇతరులను క్షమించే శక్తిని దేవుడు మీకు దయచేయుచున్నాడు. యోసేపును అతని అన్నలు మరియు అధిపతి మోసం చేసి, నిందారోపణ చేసి, అతనిని శిక్షించినప్పుడు, దేవుడు అతనికి క్షమించే హృదయాన్ని దయచేసియున్నాడు. ఆయన వారికి నివసించడానికి భూమిని ఇచ్చాడు, వారి గొర్రెలను, పశువుల మందను మేపడానికి ఒక పెద్ద దేశమును అనుగ్రహించియున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన వారి కుటుంబాలను పోషించగలిగాడు, వారిని రక్షించాడు మరియు అతని ద్వారా కాపాడబడి, అతడు ఘనపరచబడ్డాడు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2వ అధ్యాయములో చూచినట్లయితే, యేసు దేవుని స్వభావములో ఉన్నప్పటికిని, ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, మానవాళి పాపములను క్షమించియున్నాడు మరియు దేవుడు ఆయనను ప్రతి నామముకంటే పై నామము ఒకే నామంతో లేవనెత్తాడు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:10వ వచనములో చూచినట్లయితే, యేసు నామమున, పరలోకములోను, భూమిపైను, భూమి క్రిందను ఉన్న ప్రతి మోకాలు వంగును. నేడు ఆలాంటి నామమున ఆయన మీకు దయచేయుచున్నాడు. ఆయన సిలువపై దొంగను పరలోకానికి తీసుకెళ్లినట్లుగానే, పరలోకములోను మరియు భూమి మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడియున్నది. ఇంకను పాపాలను క్షమించుటకు అధికారము మరియు మనలను పరలోకానికి తీసుకొని వెళ్లుటకు అధికారమును ఆయన కలిగియున్నాడు.
నా ప్రియులారా, మనం కూడా ఇతరులను క్షమించినప్పుడు, దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీదికి పంపుచున్నాడు మరియు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, యేసు నామంలో పాపములను క్షమించు అధికారమును మనము పొందుకుంటాము మరియు ప్రజలు యేసు యొద్దకు మరియు క్షమాపణ వైపునకు నడిపించబడతారు. మూడవదిగా, మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడు, క్రీస్తు స్వభావాన్ని, అనారోగ్యం, బలహీనత మరియు పాపపు వ్యసనాలను స్వస్థపరిచే స్వభావాన్ని అంగీకరించడానికి సమస్తమును సమకూడి మేలు కొరకు గొప్ప కార్యాలు జరిగించబడును. మరియు అదే కృప మనకు ఇవ్వబడుతుంది. మా తండ్రిగారి జీవితములో చూచినట్లయితే, 1969వ సంవత్సరములో, మా తండ్రిగారి ఊపిరితిత్తులు పాడైపోయి, ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, యేసు ఆయనకు ప్రత్యక్షమై, వేదన మరియు బాధల ద్వారా, ప్రజల యొక్క బాధను మా తండ్రిగారు అర్థం చేసుకోవాలనియు, ప్రేమా కనికరముతో చలించి పోవాలనియు, ఆయన కన్నీళ్ల ద్వారా విరిగినలిగిన హృదయము గలవారికి స్వస్థత పొందుకుంటారని తెలియజేశాడు. చివరగా, ఆశీర్వాదాలను విస్తరింపజేయడం కొరకు సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించబడతాయి. యేసు పిలుచుచున్నాడు, కారుణ్య ప్రారంభమైనప్పుడు, దాదాపు 25 సంవత్సరాల క్రితం మేము భయంకరమైన అప్పులలో కూరుకుపోయాము మరియు ప్రభువు ప్రజలను ప్రేమించు అని చెప్పాడు, అంటే దైవజనులను ప్రేమించమనియు, సంఘములను మరియు దేవాలయములను నిర్మించడానికి, బహిరంగ కూటములు నిర్వహించడానికి మరియు కొన్నిసార్లు వారి వైద్య బిల్లులను చెల్లించడానికి నీవు వారికి సహాయము అందించినప్పుడు, వారు మీ కొరకు ప్రార్థించినప్పుడు నేను మీ యొక్క అప్పు బాధల నుండి బయటపడునట్లుగా చేస్తానని ప్రభువు సెలవిచ్చాడు. ఆలాగుననే, ప్రభువు మాటకు మేము విధేయత చూపి, మమ్మును మేము ఆయనకు సమర్పించుకున్నందున ఈరోజు దేవుడు మమ్మును దీవించియున్నాడు. అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, భయపడకండి. దేవుడు తన పిల్లల పట్ల శ్రద్ధ వహించి, మేలు జరిగించినప్పుడు మిమ్మును విస్తరింపజేస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి బలంగా దిగి వచ్చి, మీ జీవితములో సమస్తమును సమకూడి మేలు జరిగించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితాన్ని నీ ప్రేమగల చేతులలోనికి మేము సమర్పించుకొనుచున్నాము. దేవా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, మా జీవితంలో సమస్తమును సమకూడి మేలు జరుగునట్లుగా చేయుము. యేసయ్యా, నీవలె మాకు కూడా దయచేసి క్షమించగల హృదయాన్ని దయచేయుము మరియు నీ పరిశుద్ధ స్వభావం మా ద్వారా బయలుపరచబడునట్లుగా చేయుము. దేవా, మాలో బ్రద్ధలు చేయబడిన ప్రాంతాలను ఇప్పుడే బాగు చేయుము. మరియు విరిగిన హృదయములను స్వస్థపరచుము. ప్రభువా, నీ ప్రజల పట్ల శ్రద్ధ వహించునట్లుగా కనికరముతో మమ్మును నింపుము. ప్రభువా, మా జీవితములో కీడు జరగకుండా, సమస్తమును సమకూడి మేలు జరుగునట్లుగా కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మమ్మును నీవలె మా దేహములను సజీవయాగముగాను, పరిశుద్ధ ఆలయముగాను, సమర్పించుకొనుటకు మా హృదయమును ఆయత్తపరచుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదాలు మరియు నీవు కనుపరచిన ప్రేమను, విధేయత ద్వారా హెచ్చింపబడినట్లుగానే, మేము కూడా నీవలె తగ్గించుకొని మరియు నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చు నీ పరిశుద్ధ ఆలయంగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


