నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరియు మనలోనికి తన జీవమును ఆజ్ఞాపించుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 1:8,9వ వచనములను నేడు తీసుకొనబడినది. ఆ వచనము, " మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మ రక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు'' అని చెప్పబడిన ప్రకారము మనము ప్రభువైన యేసునందు విశ్వాసముంచియుండగా, ఇట్టి ఆనందము మనకు కలుగుతుంది. మనము దానిని అనుభూతి చెందుచున్నాము కదా! కొంతమందిని మీరు గమనించినట్లయితే, ఏ శ్రేష్టమైన బ్యాంకులలో దాచినట్లయితే, అవి భద్రముగా ఉంటాయని గుర్తించి, తమ ధననిధులను వారు దాచుకుంటారు. ఆలాగే, ఆ ధనము కొరకు భీమా కూడా తీసుకుంటారు. ఆలాగే దొంగలించబడకుండా, చాలా నిశ్చయత కలిగియుండే ప్రయత్నమును చేయుదురు. ఆలాగే, ఆ ధనమును కాపలా కాయడాని కొరకై శ్రేష్టమైన భద్రతా విధానములను తీసుకుంటారు. అవన్నియు కూడా వారి కొరకై నిధిని భద్రపరచడము కొరకే. ఎంతో ప్రయత్నము చేస్తారు. అయినప్పటికిని దాని మీద వారికి నెమ్మది ఉండదు.
కానీ, మన జీవితాలను చూడండి, మన యొక్క నిధిగా మన యొక్క విశ్వాసము యేసు మీద మనము ఉంచియున్నాము గనుకనే, ఆయననే మనము నిధిగా చేసుకున్నాము. మన హృదయము ఎంతో సంతోషముతో నింపబడియుంటుంది. ఎందుకనగా, సత్యమును ఎరిగియుండుట ద్వారానే, ఆ యొక్క సత్యము ఏమిటి? యేసు ద్వారా, ఆయన రక్తము బట్టి, మనము ఆయనకు బిడ్డలముగా ఉంటున్నాము. మన పాపములు కడిగి వేయబడియున్నవి. మనము మన జీవితములో పరిపూర్ణముగా విడిపించబడుచున్నాము. ఎటువంటి అపరాధభావన మనలను అణిచివేయలేదు. ఆయన మరణము నుండి లేచి మనకు జీవమును ఇవ్వడము కొరకు ఆయన వచ్చియున్నాడు.
కనుకనే, నా ప్రియులారా, ఆయన సిలువలో చేసిన కార్యమును బట్టి, నిత్య జీవము మన కొరకు తెరవబడియున్నది. మన జీవితము ఎంతో భద్రపరచబడుతుందిఅటువంటి సంతోషమును మన హృదయములో ఏ కొదువయు లేకుండా కలిగి ఉంటున్నాము. ఈ లోకములోను, రాబోవుచున్న లోకములోను, మన జీవితము ఎంతో భద్రపరచబడి ఉంటుంది. అటువంటి చెప్పనశక్యము కానీ, సంతోషమునందు విశ్వాసము ఉంచి, మన జీవితమును మనము కొనసాగించుచున్నాము. ఇందును మట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించుదామా? ఏ విచారము మీకు వెనుక మిగిల్చి ఉంచదు. కనుకనే, నా ప్రియులారా, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు ఈ నిరీక్షణను ఇచ్చినందుకై నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము ఇటువంటి సత్యమును తెలుసుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. కానీ, నీవు మేము దీనిని అంగీకరించిచునట్లుగా చేసియున్నారు, మీలో ఉన్న జీవమును, నిరీక్షణను, మేము మీలో భత్రదపరచునట్లుగా చేయుము, దేవా, నీలో మేము రక్షణానందమునతో నింపబడునట్లుగా చేయుము. దేవా, నూతనమైన బావిలో నీ రక్షణ మాలో ఉబుకుచుండునట్లుగా చేసి, నీవే మా జీవితమునకు సంరక్షకునిగా ఉండుము. ప్రభువా, మా పట్ల తెరవబడిన ద్వారములు మాకు అనుగ్రహించి, నీవు మా కొరకు మార్గమును సరాళము చేయుము. యేసయ్యా, మేము నిన్ను విశ్వసించునట్లుగాను, నీ అపారమైన ఆనందాన్ని మా హృదయంలోకి అంగీకరించునట్లుగా చేయుము. దేవా, ఈ లోకంలో మేము కలిగివున్న వాటన్నిటికంటే గొప్ప నిధిగా ఉండుము. యేసయ్యా, మా పాపాలను కడిగివేసి, మమ్మును పూర్తిగా స్వతంత్రుడిని చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఏ అపరాధభావమూ, భయమూ మా జీవితాన్ని మళ్ళీ పట్టుకోకుండా చూడుము. దేవా, నీ సత్యానందంలో ప్రతిరోజూ జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఈ ఆనందం పొంగిపొర్లేలా చేయుము. దేవా, మేము నిన్ను మరింత ఎక్కువగా విశ్వసించేలా మాకు నేర్పించుము. యేసయ్యా, నీ సిలువ మరియు పునరుత్థానం ద్వారా నిత్యజీవం ఇచ్చినందుకు నీకు వందనాలు. చెప్పనశక్యముకానీ ఆనందం కోసం మేము నిన్ను స్తుతించుటకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


