నా ప్రియ స్నేహితులారా, నేడు మీకందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. అవును, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 29:13వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు'' అని వాగ్దానము ఇవ్వబడియున్నది. మనము ఏదైనా పనిచేస్తున్నప్పుడు, స్త్రీలముగా అనేకమైన విషయాలను గురించి మనము ఆలోచిస్తాము. చాలా చిన్న చిన్న విషయాలతో మన హృదయాలను నిండి ఉంటాయి. బహుళ పనులు చేయడములో స్త్రీలు ప్రజ్ఞావంతులు. అవును, అది మంచిదే. అయితే, మీ పూర్ణ హృదయముతో ప్రభువును వెదకాలి అని ఈ రోజు దేవుడు మనతో చెబుతున్నాడు. ఈ రోజు మన హృదయము దేవుడు కాకుండా, వేరే విషయాలతో నిండియున్నదా? మన ముఖానికి మేకప్ వేసుకోవడము, దేవునికంటె కూడా ప్రాముఖ్యముగా భావించుచున్నామా? దేవుని వైపు చూడకుండా, అత్యధికముగా భర్తను మరియు పిల్లలను చూచుకోవడము ప్రాముఖ్యతను ఇచ్చుచున్నామా? ఇవన్నియు కూడా ప్రాముఖ్యమైనవి. కానీ, అందముగా ఉండడము, కనబడడము ప్రాముఖ్యమే. ఇంకను కుటుంబము, ఉద్యోగమును పట్టించుకోవడము కూడా ప్రాముఖ్యమే. అయితే, మన హృదయములో దేవునితో నిండియుండవలసిన స్థలమును అవి తీసుకొనుచున్నవా? దాని గురించి ఆలోచించుదాము నా ప్రియ స్నేహితులారా, ఇది స్త్రీలకు మాత్రమే కాదు, కానీ, ఈ సందేశమును చదువుచున్న మనలో ప్రతిఒక్కరికి వర్తించుచున్నది.
నా ప్రియులారా, మన పూర్ణ హృదయమును ప్రభువుకు సమర్పించినప్పుడు, ఆయనే మన జీవితములో అన్నిటిని చూచుకుంటాడు. అది కష్టతరమే. నేను కూడా దానిని ఎదుర్కొన్నాను. ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే, మిగిలినవన్నియు గుర్తుకు వస్తాయి. నా బిడ్డ సరిగ్గా తింటుందా?లేదా? నా భర్త ఉద్యోగము నుండి క్షేమముగా వస్తాడా? లేదా? నేను పనికి తిరిగి వెళ్లగలుగుతానా? యింటి అద్దెను సమయమునకు ఎలా కట్టగలుగుతాను? ఎవరైన వచ్చి రాత్రి సమయములో మా యింటి మీద దాడి చేస్తారా? అని ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మాత్రమే ఇవన్నియు కూడా మన హృదయాలలో వస్తాయి. అయితే, ప్రభువు, "ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి'' అని అంటున్నాడు. కనుకనే, ఈ రోజు మనము ఊరక ఉండి దేవుని సన్నిధానమును పొందుకుందాము. మన పూర్ణ హృదయముతో ప్రభువును వెదకినప్పుడు, ఆయన మన ఆశలన్నిటిని నెరవేరుస్తాడు.
నా ప్రియులారా, కాబట్టి, ఒక ప్రశాంతమైన స్థలములో కూర్చుని, మీ చింతలన్నిటిని ప్రభువుకు తెలియజేయండి. మనము ఆలాగున చేసినప్పుడు, ప్రభువు మనకు తన సమాధానమును ఇస్తాడు. అప్పుడు మన పూర్ణ హృదయముతో ఆయనను మనము వెదకగలము. నా ప్రియ స్నేహితులారా, మన జీవితములో మిగిలినవన్నిటిని ప్రభువే చూసుకుంటాడు. కనుకనే, మనము చేయవలసినదంతయు మన పూర్ణ హృదయముతో ఆయనను వెదకడమే. ఈ రోజు వేరేమైనను సరే, మీకు అడ్డంకులుగా ఉండవచ్చును, అది సామాజిక మాద్యమాలయైనను ఉండవచ్చును, లేక మీ స్నేహితులై ఉండవచ్చును, మీ ఫోన్ కావచ్చును, అది జరుగకుండా, మీ సొంత కుటుంబసభ్యులే అడ్డుకుంటుండవచ్చును. అందును గురించి ఆలోచించి, ఈ రోజు మనమందరము కలిసి ప్రార్థించి, ఆయన మహిమను పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు.ప్రభువైన యేసయ్యా, మా హృదయములలో అనేక విషయాలను గురించి, చింతించుచూ ఆలోచించుచున్న మా హృదయాలను నీ సన్నిధితో నింపుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మాకు అడ్డంకులుగా ఉన్న ప్రతి విషయాలను తొలగించుకొనగలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఈ లోకముతో దురవ్యసనములతో నిండియున్న మేము కలిసియున్నప్పుడు, నీవు మాలో నుండి ఈ వ్యసనములన్నిటిని తొలగించివేయుము. దేవా, మేము ఈ లోకములో ఉన్నవాటికి సోషల్ మీడియా, ఫోన్, ఇంకను ఎన్నో విషయాలకు మేము ఆకర్షితులము కాకుండా, మా హృదయమును నీతో నింపుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రియ ప్రభువైన యేసు, ఈ రోజు మేము నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము. ప్రభువా, మేము మా హృదయాన్ని ఇతర విషయాలతో నింపుకొనుచున్నాము. తండ్రీ, మేము ఎన్నో ఇతర విషయాలతో ఉన్నాము. ప్రభువా, నీ సన్నిధి మా మీదికి రావాలని మేము వేడుకొనుచున్నాము. తండ్రీ, మేము మా హృదయంతో నిన్ను వెదకగలుగునట్లుగాను మరియు ఈ లోక వ్యసనములలో పడకుండా ఉండుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీతో మా నడకకు ఆటంకం కలిగించే అన్ని విషయాలను తొలగించడానికి నీవు మాకు సహాయం చేయమని మేము కోరుచున్నాము. దేవా, నీ సన్నిధి మా హృదయంలో నీ యొక్క సన్నిధి స్థానాన్ని నింపుము. ప్రభువా, మా పూర్ణ హృదయంతో నిన్ను వెదకడానికి మరియు నీ శాంతి సమాధానముతో జీవించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


