నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి న్యాయాధిపతులు 3:9వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, " ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను'' అని చెప్పబడినట్లుగానే, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి, వారు వెనుకకు మళ్లినప్పుడు, వారికి ఎక్కడకు వెళ్లాలో తెలియదు. ప్రజల యొక్క ఆచారములను వారు పాటించారు. కాబట్టి, దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చినందున దేవుడు వారికి విరోధముగా శత్రువును పంపించియుండెను. కాబట్టి, ఇశ్రాయేలీయులు ఒక రక్షకుని కొరకు దేవునికి మొఱ్ఱపెట్టియున్నారు. వెంటనే, దేవుడు ఒత్నీయేలును, దెబోరా, గిద్యోను అను ఇటువంటి వారిని న్యాయాధిపతులనుగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి, వారిని రక్షించెను. ఇశ్రాయేలీయులు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, దేవుడు కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల మీద రక్షకునిగా నియమించి వారి యొద్దకు పంపించి యుండెను. అదేవిధముగా, ఇశ్రాయేలీయులను రక్షించడానికి, అనేకమంది న్యాయాధిపతులు వచ్చియున్నారు. వారిలో, ఏహూదు, దెబోరా, గిద్యోను అదేవిధంగా అనేకమంది న్యాయాధిపతులు ఉండిరి. వారందరు కూడా గొప్ప కార్యములు చేసి, ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి కాపాడియున్నారు. చూడండి, ఇది ఎంతటి గొప్ప అద్భుతము కదా.
క్ఛటట్చజ్ఛ:
నా ప్రియులారా, మనకు కీడు చేయు ప్రజల చేత అణిచివేతకు గురియగుచున్నప్పుడు, మనము ప్రభువునకు మొఱ్ఱపెడుతూ ఉంటాము. బైబిల్‌లో యోబు, శ్రమలను మరియు కష్టాలను ఎదుర్కొనప్పుడు, ' నన్ను ఎవరైనా రక్షిస్తారా?' అని దేవునికి మొఱ్ఱపెట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి యోబు గ్రంథము 9:33వ వచనములో చూచినట్లయితే, " మా యిద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు'' అని చెబుతున్నాడు. చూడండి, యోబు, ' మా ఇద్దరి మధ్య ఎవరైన చెయ్య ఉంచదగిన మధ్యవర్తి ఉండినట్లయితే, ఎంత బాగుంటుంది' అని ఈ వచనములో అంటున్నాడు. అతని తరుపున ఎవరైనా విజ్ఞాపనము చేయాలని అతడు ఎంతగానో ఎదురు చూచియున్నాడు కదా. అతనిని విడిపించడానికి ఎవరైనా ఉండాలని ఇతరుల సహాయము కొరకు కనిపెట్టికొని ఉండెను.
అవును, నా ప్రియులారా, అనేకసార్లు మనము కూడా అణిచివేతకు గురియైనప్పుడు, 'ఎవరైనా ఒకరు వచ్చి, మనకు సాయము చేసినట్లయితే, ఎంత బాగుంటుంది' అని ఎదురు చూస్తుంటాము కదా! ఎవరి సాయము పొందలేనప్పుడు, చివరిగా యేసయ్యా నొద్దకు వెళ్లతాము. అవును, యేసయ్యా, మనకు నిజమైన విమోచకుడుగా ఉంటూ ఉన్నాడు. మన పాప బంధకముల నుండి మరియు మన భయముల నుండి, చివరికి మన యొక్క మరణము నుండి కూడా ఆయనే మనలను విమోచించగలడు. మనము ఆయనకు ఎప్పుడు మొఱ్ఱపెట్టినను కూడా, 'ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.
ఇటువంటి తలంపును కలిగియున్న ఒక వ్యక్తిని మనము చూడగలము. మేము నిర్వహించిన కార్యక్రమములోనే, అక్టోబరు 2వ తేదీన జరిగిన కూటములో ఒక అద్భుతము జరిగియున్నది. మహారాష్ట్రములో, సాంగ్లీ అను ప్రాంతములో ఉండి సహోదరులు విశాల్ ఈ విధంగా తన సాక్ష్యమును పంచుకున్నాడు. అనేక రోజుల నుండి గొంతు నొప్పితో ఎంతగానో బాధపడుచుండెను. అతడు ఒక అద్భుతము కొరకు కనిపెట్టుకొనియుండెను. దేవుడు అతనిని స్వస్థపరచులాగున అతడు దేవునికి మొఱ్ఱపెడుతూ మాతో కలిసి ప్రార్థించాడు. అక్టోబరు 2వ తారీఖున నేను ప్రజల కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చివరిలో నేను ఈలాగున ప్రార్థించాను, "ప్రభువా, ఎవరైతే, గొంతు నొప్పితో బాధపడుచున్నారో, వారిని ఇప్పుడే తాకి స్వస్థపరచుము '' అని చెప్పాను. అప్పటి నుండి కూడా ఈ సహోదరుడైన విశాల్ స్వస్థతను పొందుకొని చక్కగా ఉన్నాడు. అతడు సంపూర్ణముగా స్వస్థతను పొందుకొనియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమును గట్టిగా పట్టుకున్నాడు. ఇంకను అతడు దేవునికి మొఱ్ఱపెట్టియున్నాడు. కనుకనే, దేవుడు అతని యొక్క సమస్య నుండి అతనిని విమోచించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా మీరు ప్రభువునకు ఈలాగున మొఱ్ఱపెట్టండి, ' ప్రభువా, ఈ సమస్య నుండి మమ్మును విడిపించుము మరియు మమ్మును స్వస్థపరచు దేవా, ఇప్పుడే మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయుము ' అని ప్రార్థించినప్పుడు, నా ప్రియులారా, ఈ రోజే మీకు రక్షణ దినముగా ఉంటుంది. ఈ రోజే మీకు విమోచన దినముగా ఉంటుంది. నా ప్రియులారా, యేసు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. కనుకనే, మీరు ఒకవేళ, ' మరల మాకు ఎందుకు ఈ సమస్యలు ఎదురవుచున్నవి, మా బాంధవ్యములోను, మా శరీరములోను మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము' అని మీరు చెప్పవచ్చును. కానీ, 'ఈ సమస్య నుండి మమ్మును విడిపించుమని' మీరు ధైర్యముగా ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ మొఱ్ఱలను ఆలకించి, మిమ్మును రక్షించుటకు ఆయనే మీ మధ్యకు దిగివచ్చి, మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మీకు సంపూర్ణమైన విమోచనను అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందములు. దేవా, నీవే మాకు నిజమైన విమోచకుడవుగా ఉన్నందుకు నీకు వందనములు. యేసయ్యా, ఇప్పుడు కూడా మాకున్న సమస్యలన్నిటి నుండి మమ్మును రక్షించి, విడిపించుటకు శక్తిగలవాడు. కనుకనే, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము, ఇప్పుడే మమ్మును రక్షించుము. ప్రభువా, మా సమస్యలన్నిటిలో నుండి నీ చేయి పట్టి, మమ్మును పైకి తీసుకొని వచ్చి, మా సమస్యల నుండి మమ్మును విడిపించుము. దేవా, మా కుటుంబ జీవితములలో మాకు ఎటువంటి మనస్పర్థలు ఉండకుండా, నీ యొక్క విమోచన శక్తిని మాకు దయచేసి, మా కుటుంబము నీలో కట్టబడునట్లుగా చేయుము. యేసయ్యా, మా శరీరములో ఉన్న ప్రతి అవయములు ఇప్పుడే స్వస్థతను పొందుకొనునట్లుగా నీ శక్తితో మమ్మును తాకుము. దేవా, మాలో ఎటువంటి వ్యాధులున్నను సరే, అది మూర్ఛ, వణకడము, ప్రేగుల సమస్య, నరముల సమస్య, కాలేయ సమస్య, చెవి సమస్య, మోకాళ్ల మరియు నడుము నొప్పి సమస్యల నుండి మమ్మును ఇప్పుడే, యేసు నామమున విడిపించుము. యేసయ్యా, నీవు పొందిన గాయముల చేత, మా శరీరములో ఉన్న ప్రతి విధమైన నొప్పి, వ్యాధి, బాధలన్నియు తగ్గిపోయి, సంపూర్ణముగా స్వస్థపరచబడునట్లుగా నీ కృపను మా పట్ల కనుపరచుము. ప్రభువా, పై చెప్పబడిన సహోదరుని వలె మేము కూడా నీకు సాక్షులముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా కుటుంబములో ఉన్న పిల్లలందరిని నీవు తాకి వారికి స్వస్థతను దయచేసి, వారి నుండి కుటుంబములో ఒక గొప్ప సంతోషమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


