నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు దేవుని యొక్క ఆనందముతో నింపబడబోవుచున్నారు. ఈ రోజు ప్రభువు అదే వాగ్దానము మీ పట్ల చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 21:6వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడు నాకు నవ్వు కలుగజేసెను'' అని వ్రాయబడియున్న ప్రకారము అదేవిధముగా, నేడు ప్రభువు మిమ్మును తన ఆనందముతోను మరియు నవ్వుతోను నింపుతాడు. సాధారణంగా, చిన్న పిల్లలు ఏదైనా మొదటిసారిగా చూచినప్పుడు, వారు ఎంతగానో నవ్వుతూ ఉండుట మీరు ఎప్పుడైనా గమనించియున్నారా? మా చిన్న బిడ్డయైన జేడెన్ కూడా, ఫ్యాన్‌ను చూచిన ప్రతిసారి ఆశ్చర్యముతో నవ్వుతూ ఉంటాడు.

ఒకరోజు, మేమందరము కారులో ప్రయాణిస్తుండగా, నేను ముందు సీట్లులో కూర్చుని యున్నాను, నా ఒడిలో నా కుమారుడు కూర్చుని ఉన్నాడు. నేను, నా భర్త, శ్యామ్ మరియు క్యేటి మరియు మేము ముగ్గురము కూడా చలువ కళ్లద్దాలు పెట్టుకొనియున్నాము. ఒక్కసారిగా, జేడెన్ మా వైపు చూచి, ఆశ్చర్యముతో నవ్వుతూ, నవ్వుతూనే ఉన్నాడు. వాని నవ్వులో ఎంతో అమయాకత్వము మాకు కనిపించినది. అదేవిధముగా, నా ప్రియులారా, ప్రభువు అటువంటి నవ్వుతో మిమ్మును నింపబోవుచున్నాడు. కనుకనే, మీ జీవితములోని చిన్నవిషయాలలో కూడా మీరు ఆనందమును కనుగొనగలుగుతారు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క సమాధానముతో మరియు సంతోషముతో మీరు నింపబడతారు. ఈ లోకములో అనేక విషయాలు మనలను కలత చెందిస్తూ ఉంటాయి. అవేమనగా, మన పరీక్షలను గురించి, మన బిడ్డలను గురించి మరియు మన కుటుంబమును గురించి మనము చింతిస్తూ ఉంటాము. అయితే, ప్రభువు తన సమాధానముతో మిమ్మును నింపబోవుచున్నానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఇంకను మీరు ఎల్లప్పుడు నవ్వుతూ ఉండునట్లుగా ప్రభువు మిమ్మును దీవిస్తాడు.

ఒకరోజు నేను కళాశాలలో ఉన్నప్పుడు, నాతో పనిచేయుచున్నవారిలో ఒక సహోదరి నా యొద్దకు వచ్చి, నన్ను ఈలాగున అడిగెను, 'మేడమ్, మీరు ఎల్లప్పుడు చక్కగా నవ్వుతూ, సంతోషముగా ఏలాగున ఉండగలుగుచున్నారు?' అని ప్రశ్నించెను. అప్పుడు నేను ఈలాగున అన్నాను, 'సహోదరి నాకైతే తెలియదు. కానీ, దేవుని ఆనందము నాలో ఉన్నది.' అదేవిధముగా, దేవుని ఆనందములో మీలో ఉంటూ, మిమ్మును దీవింపజేయుచున్నది. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు అటువంటి ఆనందమును కనుగొనవలెననగా, మీ జీవితాలను దేవుని యొక్క హస్తాలకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యొక్క ఆనందముతో నింపబడునట్లుగాను మరియు నీ సమాధానముతో నింపబడునట్లుగాను మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో ఎన్ని చింతలు ఉన్నను సరే, ఎల్లప్పుడు మేము నవ్వుతూ, నవ్వుతూ ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మేము ఎల్లప్పుడు నీ యందు నమ్మకము కలిగి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ఆనందముతో నింపబడునట్లుగాను, మేము మా భవిష్యత్తును గురించిన భయమును మా నుండి తొలగించుము. పరలోకపు తండ్రీ, ప్రభువైన నీవు మాలో ఉంచిన దైవిక ఆనందానికి «కృతజ్ఞతలు. దేవా, ఈ రోజు మా హృదయాన్ని నీ నవ్వుతోను మరియు సమాధానముతోను నింపుము. ప్రభువా, మా మనస్సు నుండి ప్రతి ఆందోళన, భయం మరియు భారాన్ని తొలగించి, జీవితంలోని చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని కనుగొనడంలో మాకు సహాయం చేయుము. దేవా, నీ ఆనందం మాలో మరియు మా ద్వారా పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, నీ పరిపూర్ణ ఆనందము మా హృదయాన్ని ఎల్లప్పుడూ కాపాడునట్లుగా చేయుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.