నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మనము యేసుని యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిద్దాం. దేవుని ఆశీర్వాదాలన్నిటికంటే అత్యధికంగా, ఆయన మనలో తృప్తిని కలిగిస్తాడు. ఈరోజు, ఆయన మనలో ఉన్నాడు. ఇంకను బైబిల్ నుండి 1 పేతురు 1:9వ వచనము ద్వారా నేటి వాగ్దానము నుండి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. కనుకనే, నేడు మన పట్ల ఆయన ఈలాగున వాగ్దానం చేయుచున్నాడు, "ఆత్మ రక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు'' ప్రకారం అవును, ఆయన మనలో కుమ్మరించడానికి కోరుకునే ఆనందం ఇదే. ఈ లోకంలో మీరు ఎప్పుడైనా అటువంటి ఆనందాన్ని అనుభవించియున్నారా? ఒకవేళ మీరు నిరాశకు గురై ఉండవచ్చును? మీ హృదయంలో ఆనందం లేకుండా, పరిపూర్ణమైన సంతోషము లేకుండా ప్రతిరోజు త్వరగా గడిచిపోతుందా అని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎంతగానో ఆనందించడానికి వివరించలేని మరియు మహిమాన్వితమైన ఆనందంతో కూడిన సంతోషాన్ని పొందడానికి ఈ రోజు ప్రభువు ద్వారా మీ కొరకు ఒక మార్గం తెరవబడుచున్నది. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, అందుకే, ఈ వచనం ఇలాగున చెబుతుంది, "మీరు ఆయనను చూడకపోయినా, ఆయన యందు విశ్వాసముంచి మరియు ఆయనను నమ్ముచున్నారు. అందుకే నేను, ప్రభువు, మీరు ఆనందించడానికి మరియు అధిక ఆనందాన్ని పొందడానికి ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చుచున్నాను అని చెబుతున్నాడు. ఆలాగుననే, మేము రాయ్‌పూర్ ప్రార్థన గోపురమును సందర్శించినప్పుడు ఒక యౌవనస్థుడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, 'అన్నా, నేను యు-టర్న్ బృందంలో భాగస్థునిగా కావాలనుకుంటున్నాను, యువత పరిచర్యలో భాగం కావాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను డ్రాయింగ్‌లు మరియు గ్రాఫిక్ డిజైన్‌లను తయారు చేయగలను. కాబట్టి, ఈ పరిచర్యకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అది చాలా మంచిదని నేను చెప్పాను మరియు నేను అతని కొరకు ప్రార్థించాను. ఆ యౌవనస్థుని కొరకు నేను ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి అతని మీదికి బలముగా దిగివచ్చి, అతనిని నింపినది మరియు అతను తన హృదయంలో ప్రభువు యొక్క ఆనందకరమైన సన్నిధితో నింపడం ద్వారా ఆనందముతో ఉప్పొంగుచూ, ఏడ్చుటకు మొదలు పెట్టాడు. అతను తన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అతను ఆ ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయాడు.
చూడండి నా ప్రియులారా, మేము అక్కడున్న వారందరిని వ్యక్తిగతంగా కలుసుకొని, వారి కొరకు ప్రార్థించిన తర్వాత, వారందరు వెళ్లిపోయినప్పటికిని, అతను మాత్రం మోకాళ్లపై కూర్చొని ఏడుస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే, దేవుని సన్నిధిని అతడు అదుపు చేయలేకపోయాడు. నా ప్రియులారా, అలాంటి గొప్ప ఆనందంతో మీరు ప్రతిరోజు జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. అలాంటి ఆనందకరమైన హృదయం దేనికిని భయపడదు మరియు ఎప్పుడూ చింతించదు. కారణము, దేవుడు వారిలో ఉన్నాడు గనుకనే, వారు దేనికిని భయపడరు మరియు చింతించరు. కనుకనే, నా ప్రియులారా, దేవుడు తానే మీలో తృప్తికరమైనవానిగా మార్చబడతాడు. నేడు అటువంటి హృదయంతో మనం ఆయనను స్తుతించి, దానిని పొందుకుందామా? ఆలాగైతే, నేడు ఇటువంటి ఆనందమును మీరు పొందుకోవాలంటే నిశ్చయముగా మీ జీవితములో సమస్తము ఆయన అధికారమునకు అప్పగించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీకు సమస్త కార్యములను జరిగించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు, మేము నీలో సంపూర్ణంగా అనుభవించాలని కోరుకుంటున్నాము. దేవా, దయచేసి మమ్మును నీ సన్నిధితో నింపుము మరియు నిన్ను నమ్మడం మరియు విశ్వసించడం ద్వారా మాత్రమే వచ్చే వివరించలేని మరియు మహిమాన్వితమైన ఆనందంతో మా హృదయం పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజు ఎప్పుడు గడిచిపోతుందని మేము ఎదురు చూచినప్పుడు, ఆనందం చాలా దూరంగా అనిపించిన రోజులు ఉన్నాయని మేము అంగీకరించుచున్నాము. కానీ ప్రభువా, ఈ రోజు మాకు ఒక నూతన మార్గాన్ని తెరవబోవుచున్నావనియు, అది గాఢంగా ఆనందించే మార్గం అని మేము నమ్ముచున్నాము. దేవా, ఈ ఆనందం మా ఆత్మ యొక్క ప్రతి మూలను నింపునట్లుగా చేయుము. యేసయ్యా, మా భయాలను మరియు విచారాన్ని నీ యొక్క ప్రేమపూర్వకమైన సన్నిధితో భర్తీ చేయుము. దేవా, మా జీవితానికి చాలినంత దేవుడవుగా నీవు ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ఆత్మ రక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారమై నీలో ఆనందించునట్లుగా కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.