నా ప్రియమైనవారలారా, ప్రభువు మీకు వెలుగుతోను మరియు స్వస్థతతోను కూడిన జీవితమును అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. మీ జీవితము ఆయన వెలుగుతో నింపబడుతుంది. ఒకవేళ, మీ జీవితమంతయు అంధకారమయంగా అనిపించడం వలన మరియు అనారోగ్య సమస్యల వలన మీరు ఎంతో బాధను అనుభవించుచున్నారా? అయితే, మీరు దిగులుపడకండి. యేసు ప్రభువు మీకు వెలుగై యున్నాడు. దేవుడే మీ వెలుగు. ప్రభువు మీకు స్వస్థతను కలిగించు దేవుడై యున్నాడు. నేడు ఆయన మీకు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:8వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మీ వెలుగును మరియు స్వస్థతను అనుగ్రహించుచున్నాడు.
నా ప్రియమైనవారలారా, ప్రభువు మీకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 1:3-4వ వచనములో చూచినట్లయితే, "దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనకు వెలుగై యున్నాడు. ఒకవేళ, మీరు చీకటిలో జీవించుచున్నారా? యేసు నామములో నేను ఆజ్ఞాపించుచున్నాను, మీకు వెలుగు కలుగును గాక! చీకటి మీ నుండి తొలగిపోవును. కనుకనే, మీరు వెలుగులో జీవించుచూ, వెలుగు సంబంధులై ఉండండి.
అందుకే బైబిల్ నుండి యోహాను 8:12వ వచనములో ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నేనే లోకమునకు వెలుగును; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండు ను'' అని చెప్పబడినట్లుగానే, మీరు జీవపు వెలుగును పొందుటకు ప్రభువు మీకు పరిశుద్ధతను మరియు కృపను అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 18:28 వ వచనములో చూచినట్లయితే, " నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును '' అని చెప్పబడిన ప్రకారముగా దేవుడు మీ చీకటిని వెలుగుగాను, మీ జీవితములను తన వెలుగుతో వెలిగింపజేసి, మీ యొక్క పరిశుద్ధ దీపములను వెలిగిస్తాడు. అంతమాత్రమే కాదు, మీలో జీవపు వెలుగు ప్రకాశించునట్లుగా చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 119:105 వ వచనములో చూచినట్లయితే, "నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము ద్వారా ఆయన మీతో మాట్లాడుచున్నాడు. కనుకనే, మనము దేవుని వాక్యమును గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆ క్షణములో, ప్రభువు తన కృపను మీకనుగ్రహించి, మీ త్రోవకు వెలుగుగా ఉంటాడు. ఆయన మిమ్మును ప్రతి పాపము మరియు చీకటి బంధకముల నుండి ప్రభువు మిమ్మును విడిపిస్తాడు. ఆయన మీ త్రోవకు వెలుగుగా ఉంటూ, మీరు నడవవలసిన త్రోవను మీకు బోధిస్తాడు.
అందుకే బైబిల్ నుండి యెషయా 60:1,3వ వచనములలో చూచినట్లయితే, " నీకు వెలుగు వచ్చి యున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది '' అని చెప్పబడినట్లుగానే, మీ జీవితము కూడా ఈలాగున వెలుగుతో నింపబడుతుంది. అందుకే బైబిల్ నుండి మత్తయి 6:22 వ వచనములో చూచినట్లయితే, " దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును'' ప్రకారము మీ కన్ను శరీరమునకు దీపముగా ఉన్నదని చెపబడినట్లుగానే, ప్రభువు మిమ్మును అట్టి వెలుగుతో నింపుతాడు. ఆలాగుననే, బైబిల్ నుండి మత్తయి 5:14 వ వచనములో, " మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగై యుండనేరదు'' అని చెప్పబడినట్లు గానే, మీ జీవితము కొండ మీద నుండు పట్టణము వలె మరుగుగా ఉండునట్లుగా ఆయన మీకు వెలుగై యుంటూ, మీ జీవితం ఆయన మహిమ కొరకు ప్రకాశించునట్లుగా చేస్తాడు. అంతమాత్ర మే కాదు, వెలుగుతో కూడా మీకు స్వస్థతను కూడా అనుగ్రహించు చున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 30:17వ వచనములో చూచినట్లయితే, "వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ ఆరోగ్యమును స్వస్థతను కలుగజేసి, మీ గాయములను మాన్పుతాడు. అందుకే, యేసు సిలువ మీద తనను తాను సమర్పించుకున్నాడు, తన శరీరము గాయపరచబడునట్లుగా అనుమతించి యున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో చూచినట్లయితే, మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ క్షణంలో, మీలో ఎటువంటి వ్యాధులున్నను సరే, ఇప్పుడే, యేసు నామములో, ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగునట్లుగా, క్రీస్తు జీవం మీలోనికి ప్రవేశించును గాక. మీ జీవితములో ప్రతి విషయములోను మార్పు పొందునట్లుగాను, మీ జీవితాలలో సంతోషకరమైన దినములు ప్రారంభమగును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితమును నీ యొక్క వెలుగుతోను, స్వస్థతతోను నింపుము. యేసయ్యా, మా జీవితములో ఉన్న ప్రతి చీకటిని, వ్యాధిని, బలహీనతను, అప్పుల సమస్యల నుండియు, పాపపు బంధకాల నుండియు, మా భయము నుండి మమ్మును తొలగించుము. దేవా, నీ వాక్యము మా పాదములకు దీపముగాను, మా త్రోవకు వెలుగుగా ఉండి మమ్మును సరైన మార్గములో నడిపించుము. యేసయ్యా, నీవు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నట్లుగానే, మేము కూడా వెలుగుగా ఉండునట్లుగా, నీ వెలుగును మా మీద ప్రకాశింపజేసి, నీ యొక్క పరిశుద్ధతలో నడవడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము అనేకులకు వెలుగుగా ఉండునట్లుగా, మమ్మును నీ వెలుగుగా మార్చి, నీయొక్క జీవము మమ్మును నింపుము. యేసయ్యా, మేము స్వస్థతను పొందుట కొరకు నీవు సిలువలో మా నిమిత్తము గాయాలను పొందినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీవు పొందిన గాయముల ద్వారా మా శరీరమునకు స్వస్థతను మరియు మా హృదయమునకు నెమ్మదిని కలుగజేయుము. దేవా, నీ కుమారుడైన యేసు పొందిన గాయముల ద్వారా మాలో ఉన్న ప్రతి గాయమును స్వస్థపరచి, చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న మమ్మును మరియు మా ప్రియులను నీ స్వస్థతా శక్తి తాకి బలపరచుము. ప్రభువా, మా యొక్క కష్టతరమైన దినములు ఆనందకరమైన దినములుగా మార్చుము. దేవా, నీ వాక్యము ద్వారా మమ్మును వెలిగించి, మేము బ్రతుకుకాలమంతయు వెలిగింపబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


