నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 22:14వ వచనమును మనము తీసుకొనబడినది. ఆ వచనము, "అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును'' ప్రకారము అవును, మీ ఆశీర్వాదములన్నియు ప్రభువు సమకూర్చుచున్నాడు. ఇంకను మీరు వేటికొరకై వేచియున్నారో వాటన్నిటిని ప్రభువే సమకూర్చనైయున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన సమకూర్పుతో పాటు ఆయన మిమ్మును గొప్పగా ఘనపరచబోవుచున్నాడు. మీరు ఎక్కడైతే, అవమానము నొందియున్నారో, అదే స్థలములో ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. ఏ స్థలములోనైతే, ప్రభువు మిమ్మును ఎగతాళి చేసి, నవ్వుల పాలు చేసియున్నారో, అదే స్థలములోనే దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు.

నా ప్రియులారా, నేడు, మీరు, 'అంతా నాకు వ్యతిరేకముగానే జరుగుతుంది అని అనుకుంటున్నారేమో?' మరి కొన్నిసార్లు మనము కొంతమంది వ్యక్తులను ఎంతగానో నమ్ముతాము. కానీ, వారు మోసము చేసి మనలను విడిచిపెడతారు. అంతా కూడా మీకు వ్యతిరేకముగా మీకు జరుగుతుందని మీరు భావించుచుండవచ్చును. అయితే, అదే వ్యక్తుల ముందు మీరు ఘనపరచబడే విధముగా, ప్రభువు మిమ్మును ఆశీర్వాదములతో సమకూర్చి మిమ్మును దీవిస్తాడు. నేను పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఒకానొక ఉపాధ్యాయురాలు యొద్దకు వెళ్లి, 'మేడమ్, ఈ యొక్క కార్యాలయములో ఈ వ్యక్తి నన్ను ఎప్పుడు చూచి నవ్వుతూ ఉంటాడు. ఈ యొక్క కార్యాలయములో ఈ వ్యక్తి నేను చేయుచున్న ఏ పనికి కూడా సహకరించడం లేదు. అది నన్ను ఎంతగానో బాధించుచున్నది' అని చెప్పాను.

అప్పుడు నా ఉపాధ్యాయురాలు నాకు ఒక విషయమును జ్ఞాపకము చేశారు. నీ జీవితము రైలు బండి వంటిది. ఆ రైలు బండిలో మనము ప్రయాణిస్తున్నప్పుడు, ఒక్కొక్క సేష్టన్ వద్ద ఆగినప్పుడు, ఒక్కొక్క వ్యక్తి దిగుతూ, ఎక్కుతుంటారు. వారు నిన్ను ఆపి వేయడానికి మరియు క్రిందకు త్రోసివేయడానికి ప్రయత్నిస్తుండవచ్చును. అయితే, నీవు నీ యొక్క చివరి గమ్యమును చేరుకొనేంత వరకు ప్రభువు నీకు అన్నిటిని సమకూరుస్తూ ఉంటాడని నీవు జ్ఞాపకము ఉంచుకోవాలి. ప్రజలు నిన్ను అదే స్థితిలో ఉంచివేయడానికి మరియు అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చును. నీ యొక్క ఎదుగుదలకు వ్యతిరేకముగా వారు ప్రయత్నించవచ్చును మరియు ఉన్నత శిఖరములకు చేరుకొనకుండా ఉండుటకు ప్రయత్నించవచ్చును. అయితే, దేవుని యొక్క సమకూర్పు వలన అందరికంటె నీవు ఉన్నత శిఖరములకు చేరుకొనగలవు. ఆయన నిన్ను సమకూరుస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఇది పది మరియు పదిహేను సంవత్సరముల అనంతరము నా ఉపాధ్యాయురాలు చెప్పిన ఈ కధను నేను ఇప్పుడు కూడా జ్ఞాపకము చేసుకుంటుంటాను. నీ జీవితము చివరి వరకు వారు రాకపోవచ్చును. వారు నిన్ను అణిచివేయడానికి ప్రయత్నించవచ్చును. కానీ, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ సమకూర్పు దేవుని యొక్క పర్వతము నుండి వస్తుంది. అదే ఉన్నత ఆశీర్వాదము, అది యేసు నొద్ద నుండి మాత్రమే వస్తుంది. కనుకనే, ఈ ఆశీర్వాదము యేసు యొద్ద నుండి మనము నేడు పొందుకుందామా? కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు తన పర్వతము నుండి తన ఆశీర్వాదములన్నిటిని మీకు సమస్తమును కలుగజేయును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమా నమ్మకమైన మా పరలోమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, ప్రజలు మమ్మును అణిచివేయుచున్నందున మా హృదయము విరిగిపోయిన స్థితిలో ఉన్నది, ప్రజలు మమ్మును చూచి ఎగతాళి చేస్తున్నందుకై మేము దుఃఖముతో ఉన్నాము. దేవా, నీ ఆదరణ మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము కార్చిన కన్నీటినంతటిని చూడుము, మా హృదయము బ్రద్ధలైన సమయమును చూడుము. దేవా, నీ సమకూర్పు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, ఎక్కడైతే, కొదువ ఉన్నదో, అక్కడే నీ సమకూర్పును మరియు సమృద్ధిని కలుగజేయుము. ప్రభువా, మమ్మును అణిచివేయుచున్న ప్రజల యెదుట నీ బిడ్డలైన మేము ఘనపరచునట్లుగా కృపను దయచేయుము. యేసయ్యా, మా శత్రువుల యెదుట మేము ఘనపరచునట్లుగా చేయుము. దేవా, మమ్మును ఉన్నత శిఖములకు నడిపించుము. ప్రియమైనప్రభువా, నీవు మా యెహోవా యీరేగాను, మా పోషకునిగా మేము నిన్ను విశ్వసించుచున్నాము. దేవా, మేము గాయపడిన మరియు అణచివేయబడిన స్థలమును నీవు చూస్తున్నావు. కనుకనే ప్రభువా, దయచేసి అదే స్థలంలో మాకు, నీవు యెహోవా యీరేగా ఉండి మాకు సహాయం చేసి, మమ్మును ఘరపరచుము. దేవా, ప్రజలు మమ్మును ఆపడానికి ప్రయత్నించినప్పుడు మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, నీవు మా కొరకు ప్రణాళిక వేసిన అత్యున్నత గమ్యస్థానానికి మమ్మును తీసుకొని వెళ్లుము. దేవా, నీ యొక్క పరిశుద్ధ పర్వతం నుండి మేము నీ యొక్క దైవీక సమకూర్పును పొందుకొని, సమృద్ధియైన ఆశీర్వాదములతో నింపబడునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.