నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుడు మన మీద తన వెలుగును ప్రకాశింపజేయబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 27:1వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?'' అని చెప్పబడినట్లుగానే,ప్రభువు మనకు రక్షణను తీసుకొని వచ్చు వెలుగునై యున్నాడు. ఆ వెలుగు ద్వారా, మనకు రక్షణను తీసుకొని వచ్చుచున్నాడు. తన యొక్క అద్భుతమైన మహిమగల వెలుగుచేత ఆయన మనలను రక్షించును. కొన్ని ఫర్యాయములు అంధకారము ఆవరించును కదా! చిన్న బిడ్డలందరు నిద్రకు లైట్‌లన్నియు ఆపివేయు సమయము వచ్చినప్పుడు, వారు చీకటికి ఎంతగానో భయపడతారు. తల్లిగాని, తండ్రిగానీ వచ్చి, ఒక చిన్న లైట్ ఆన్ చేసినప్పుడు, వారు ఏ మాత్రము భయపకుండా ఉండిపోతారు. అప్పుడు మాత్రమే వారు నిద్రకు ఉపక్రమిస్తారు. అప్పుడు వారు సమాధానముతో నిద్రపోతారు. నా ప్రియ స్నేహితులారా, మన విషయములోను కూడా ఆలాగుననే జరుగుతుంది.

నా ప్రియులారా, మన జీవితములలో మనము వెలుగును చూచినప్పుడు, మనము అంధకారమునకు భయపడము. మనము వెలిగింపబడవలసిన వెలుగు ఆ యొక్క యేసు మాత్రమే. తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వెలుగు మనలో ప్రకాశించినప్పుడు, ఏదియు మనలను జయించలేదు అన్నట్టుగా, మనకు ఎంతో ధైర్యము అనిపిస్తుంది. అంతమాత్రమే కాదు, రక్షించే దేవుని హస్తము వచ్చి, మనలను రక్షించు చున్నది. మనకు కూడా ఆలాగుననే జరుగుతుంది. కనుకనే, ఆ వెలుగును మీ హృదయములో ఎప్పుడు ఆన్ చేసి ఉంచండి. మీరు ఆపత్కాలమందు ఉన్నప్పుడు, ఆయనకు మొఱ్ఱపెట్టండి. పరిశుద్ధ గ్రంధము ఏమని చెబుతుందంటే, మత్తయి సువార్త 10:28వ వచనములో చూచినట్లయితే, " మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి'' అని చెప్పబడినట్లుగానే, మీ దేహమును చంపువానికి భయపడకుండా, మీ ఆత్మను చంపువానికి మీరు భయపడకండి. నా ప్రియ స్నేహితులారా, మనము మన ఆత్మ నిమిత్తము జీవించినప్పుడు మాత్రమే మనలో వెలుగు ప్రకాశిస్తుంది.

నా ప్రియులారా, మన ఆత్మ నిత్యత్వములో జీవించునట్లుగా, మనము నిత్యము జీవించువారముగా ఉంటాము. మన ఆత్మ మరణించినట్లయితే, మనకు నిత్యత్వము లేదన్నమాట. కనుకనే, మీరు ఇట్టి ఆలోచన విధానమును కలిగియున్నప్పుడు, మీ ఆత్మ జీవించవలెనని అనుకున్నప్పుడు, ఏ నరుడు మీ ఆత్మను తాకలేదు. ఏ అపవాది మీ ఆత్మను తాకలేదు. మీరు ఈ లోకములోను మరియు రాబోవు లోకములోను దేనికిని భయము చెందరు. ఏ భయము మిమ్మును తాకజాలదు. మీరు ఆయన చిత్తమును జరిగించుచున్నప్పుడు, దేవుడు మిమ్మును భద్రపరుస్తాడు అని తెలుసుకుంటారు. ఈ లోకములోను కూడా ఆయన తన చిత్తమును జరిగించుటకు మిమ్మును కూడ భద్రపరుస్తాడు.

అవును, నా ప్రియులారా, ఈ రోజు అంధకారమునకు మరియు మనుష్యుని యొక్క బెదురుకు భయపడుచున్నారా? ఇంకను మీ సమస్యలు మిమ్మును మ్రింగివేస్తాయనియు మరియు రోగము మిమ్మును మ్రింగివేయునని భయపడుచున్నారా? మంచి భవిష్యత్తును కలిగి యుంటామా? అన్న భయము మీలో ఉన్న అంధకారమునకు సంబంధించిన భయమును చూచి, అంధకారము మీ జీవితమును అధిగమించకుండా, ఆయన వెలుగును మీలోనికి ఆహ్వానించండి. అవును, మనము భయపడవలసినది ఆయనయందు మాత్రమే. తద్వారా, మన ఆత్మ నిత్యత్వము వరకు జీవిస్తూ ఉంటుంది. మీరు కేవలము ఆయనకు మాత్రమే భయపడినప్పుడు, ఆయన రక్షించడానికి మీ యొద్దకు దిగివస్తాడు. అప్పుడు ఆయన మిమ్మును రక్షిస్తాడు అని మీరు ఎరిగియుంటారు. మీ హృదయము సమాధానముగా ఉంటుంది. ఇక మీ సమస్యలు మిమ్మును అధిగమిస్తాయి అను విచారము మీలో ఉండదు. ఒకవేళ నా స్నేహితులారా, ఇప్పుడు మీరు కొంత అంధకారముగుండా వెళ్లుచున్నారు అని అనుకోండి, దేవుని వెలుగు మీ జీవితాలలో ప్రకాశించి, రక్షించాలని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు వెలుగుగాను, రక్షణగాను ఉండి, మీరు అనేకులకు వెలుగుగా ఉండునట్లుగా మిమ్మును ప్రకాశింపజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
రక్షణకర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము ఈ రోజు అంధకారమునకు మరియు మనుష్యుల యొక్క బెదురుకు భయపడుచున్నాము, మా సమస్యలు మమ్మును మ్రింగివేస్తాయని మరియు రోగము మమ్మును మ్రింగివేయునని భయపడుచున్నాము, మంచి భవిష్యత్తును కలిగి యుంటామా అన్న భయము మరియు మాలో ఉన్న అంధకారమునకు సంబంధించిన భయము మా జీవితమును అధిగమించకుండా, నీ వెలుగును మాలోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, మాలో నీ వెలుగు వచ్చుట ద్వారా మేము బహుగా ప్రకాశించునట్లుగాజేయుము. ప్రభువా, నీ యొక్క దైవీకమైన వెలుగుచేత మా ఆత్మలను రక్షించి, మా ఆత్మలను మరియు హృదయములను నీ యొక్క వెలుగుతో నింపుము. దేవా, మనుష్యుల భయము నుండియు, సమస్యల భయము నుండి నీ వెలుగుచేతను మరియు నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మును విడిపించి, మా జీవితములో అద్భుతములను జరిగించుము. ప్రియ ప్రభువా, మేము అనారోగ్యం, ప్రతికూల పరిస్థితులు మరియు భయమును ఎదుర్కొన్నప్పుడు నీ దివ్యమైన వెలుగును మా మీద ప్రకాశింపజేసి, మా జీవితంలోని ప్రతి భయమును, చీకటిని తొలగించి, నీవే మాకు వెలుగుగాను, రక్షణగాను ఉంటూ, నిన్ను విశ్వసించడానికి మాకు ధైర్యమును ఇచ్చి, మా ఆత్మను కాపాడి, నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.