నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మన జీవితములో భిన్నమైన కార్యమును జరిగించబోవుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 2:17వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును'' అని చెప్పబడినట్లుగానే, మనము నిత్యము నిలిచియుండాలంటే, దేవుని చిత్తమును జరిగించవలెనని మన పట్ల కోరుచున్నాడు. ఇదియే సత్యమై యున్నది. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 2:26వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది'' అని చెప్పబడినట్లుగానే, దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి సమస్తమును ఆయన దయచేయుచున్నాడు. కానీ, పాపాత్మునికంటే దేవుడు తనను సంతోషపెట్టు ప్రతి వారికి ఈ ఐశ్వర్యమును, సంపదలన్నింటిని సమృద్ధిగా ఇస్తాడు.
నా ప్రియులారా, అందుకే, "లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి'' అని ఈ వాక్యములో తెలియజేసినట్లుగానే, పాపాత్మునికి దుష్టమార్గము ద్వారా ఆయన సమస్తమైన ఐశ్వర్యమును అనుగ్రహించుచున్నాడు. ఇంకను గొప్ప మహిమైశ్వర్యమును కూడా ఇచ్చుచున్నాడు. అది అతను దుర్మార్గపు మార్గముల ద్వారా విస్తారమైన ధనమును కూడగట్టుకుని, గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును. కానీ, అవన్నియు ఒక్క క్షణములోనే కోల్పోవచ్చును. ఎందుకనగా, అపవాది వానిని జయించనివ్వడు. ఆలాగుననే, మనము విజయం సాధించడము లేదా సంతోషముగా ఉండటం సాతానుకు ఇష్టము ఉండదు. కనుకనే, సాతాను మనలను క్రిందికి నెట్టివేసి సమస్తమును మన యొద్ద ఉన్నదానిని నాశనమును చేసి, మన నుండి తాను స్వాధీనపరచుకొనుటకు ప్రయత్నిస్తాడు.
అయితే, నా ప్రియులారా, అందుకే బైబిల్ నుండి ప్రసంగి 2:26వ వచనమును చూచినట్లయితే, "ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగువానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవునికి ఇష్టులైన వారికి ఆయన జ్ఞానమును, తెలివితేటలను, సంతోషమును అనుగ్రహిస్తాడు. కానీ, దేవుని చిత్తమును నెరవేర్చువారు ఆయనకు ఇష్టులుగా ఉన్నటువంటి వారు నిరంతరము జీవిస్తారని 1 యోహాను 2:17వ వచనములో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ జీవన మార్గమును ఎన్నుకుందాము. అనగా, ఈ లోకములో మనము దేవుని చిత్తానుసారముగా జీవించుదాము, ఆయన ఉద్దేశములను నెరవేరుస్తూ, ఆయనకు ఆనందమును కలిగించే జీవితమును గడుపుదాము. కనుకనే, నేటి నుండి మనము దేవునికిష్టులుగా జీవించుదాము.
అదేవిధముగా బైబిల్లో యేసు ప్రభువు, ఒక ధనవంతుడు మరియు లాజరును గురించిన ఒక ఉపమానము తెలియజేసియున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
కానీ, వారిద్దరూ మరణించి కొనిపోబడ్డారు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి, 'తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను-నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను.' అందుకు అబ్రాహాము - 'కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావని చెప్పి,' అబ్రాహాము, అతని జీవితకాలంలో జరిగిన సంఘటనను ధనవంతునికి గుర్తు చేశాడు. లాజరు అతని ఇంటి గుమ్మము దగ్గర పడియున్నప్పటికిని, అతను ఎప్పుడు కూడా లాజరును పట్టించుకోలేదు. ఇంకను అబ్రాహాము ఇలాగున ధనవంతునితో తెలియజేసెను,'అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. '
అవును, నా ప్రియ స్నేహితులారా, మనము దేవుని చిత్తానుసారముగా జీవించుచూ, ఆయనకు ఇష్టులుగా జీవించవలెను. ఆలాగున కాకుండా, ఈ లోకమును మరియు దానికి సంబంధించిన తాత్కాలిక కోరికలకు మాత్రమే పరిమితము అయిపోతాము. అయితే, ఈ లోకము, దానిలోని కోరికలు గతించిపోవును. కానీ, దేవుని చిత్తమును జరిగించు మీరు నిరంతరం జీవించెదరు. అటువంటి వారు ఈ లోకంలోనే దేవుని ఆనందమును, ఆశీర్వాదము లను అనుభవించగలరు. చివరిగా, ఆయనతో కలిసి నిత్యజీవములోనికి ప్రవేశించగలరు. కనుకనే, నా ప్రియులారా, నేడు దేవుని చిత్తమును జరిగించువారికి చేయబడిన వాగ్దానమునకు నిత్యత్త్వమే బహుమానము. ఈ లోకములోని తాత్కకాలిక కోరికల కొరకు, సుఖభోగముల కొరకు జీవించుటకు బదులుగా, ఈ బహుమానమును పొందుట కొరకు మనము ప్రయత్నించుదాము. ఈ రోజు వాగ్దానము నుండి ఇటువంటి ఆశీర్వాదమును పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరముగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, దయచేసి మాకు పరలోకమునకు వెళ్లుటకు మార్గమును తెరువుము. ప్రభువా, మేము ఎన్నడును పరలోకమును మరియు నిత్యజీవమును కోల్పోయి నరకంలో బాధపడకుండా ఉండునట్లుగా మేము నీ యొక్క చిత్తానుసారముగా నడుచుకొను కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము ఎల్లప్పుడు నీకు ఇష్టమైన జీవితమును జీవించుటకును మరియు నీదృష్టికి మంచివారముగా ఉంటూ, నీ యొక్క జ్ఞానమును తెలివిని ఆనందమును మేము పొందుకొను కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, ఒకవేళ మేము నీ దృష్టికి పాపాత్ములముగా ఉన్నట్లయితే, ఇప్పుడే, నీ యొక్క రక్తముతో మమ్మును కడిగి, పరిశుద్ధులనుగాను, నీతిమంతులనుగా చేసి, మమ్మును నీ నిత్యరాజ్యమునకు వారసులనుగా చేయుము. తండ్రీ, నీ చిత్తమును నెరవేర్చుటకు మరియు మేము నీ ఆజ్ఞలకు విధేయులగుటకు మాకు నేర్పించుము. దేవా, మేము నీ స్వరమును ఆలకించడానికి మరియు మేము ఏమి చేయాలని మా పట్ల కోరుచున్నావో దానిని మేము గ్రహించి, నీతో నడవడానికి మరియు నీ చిత్తమును సంతోషంతో జరిగించడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


