నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:2వ వచనమును మన ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును...'' ప్రకారం ప్రభువు మీకు తోడుగా ఉండును గాక. మరియు కీర్తనలు 124:1-4 వ వచనములలో దావీదు రాజు ఈ విధంగా ప్రార్థించుచున్నాడు. ఆ వచనములు, "మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండని యెడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండని యెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి యుందురు. జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి యుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక '' ప్రకారముగా జలములు జీవితములోని బాధలను మరియు కష్టాలను సూచిస్తాయి. ఇక్కడ లోతైన జలములు అని చెప్పబడియున్నది. లోతైన జలములలో బడి వెళ్లినపుడపు, దేవుడు మీకు తోడై యున్నాడని వాగ్దానము చేయుచున్నాడు. బైబిల్‌లో, కీర్తనలు 18:16వ వచనమును చూచినట్లయితే, "ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను '' ప్రకారం దావీదు యొక్క శత్రువులు అతనిని నాశనము చేయాలని బెదిరించారు. తన జీవితమును కూడా తొలగించాలని ప్రయత్నించి, అతనిని బెదిరించారు. అదేవిధముగా, కీర్తనలు 18:18,19 వ వచనములలో చూచినట్లయితే, "ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.'' అవును, ఆపత్కాలమందు మనలను ఆదుకొను సహాయకుడు మన ప్రభువు మన పక్షమున ఉంటున్నాడు. వరద వలె మన శత్రువు ముంచుకొని మన మీదికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలను లేవనెత్తి పైకి చేర్చుతాడు. శత్రువు వరదలా వచ్చినప్పుడు, ప్రభువు ఆత్మ అతనికి వ్యతిరేకంగా ఒక ధ్వజాన్ని ఎత్తుతుంది.
ఆలాగుననే, సహోదరులు జాన్సన్ దినకరన్ యొక్క చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల నేను కోరుచున్నాను. అతనికి ముగ్గురు పిల్లలు కలరు. తన కొరకు ఒకటి మరియు తన సహోదరునికి మరొకటి అని రెండు గృహములను వారి తండ్రి నిర్మించి వారికిచ్చాడు. ఈ వ్యక్తి మరొక స్థలమునకు వెళ్లవలసి వచ్చి, ఒక పెద్ద న్యాయవాధికి తన యింటిని అద్దెకు ఇచ్చాడు. కొన్ని నెలలు అద్దె సరిగ్గా కట్టి, ఆ తర్వాత అద్దె సరిగ్గా కట్టకుండ మానేశాడు. అయితే, ఇతడు వెళ్లి, వారిని అద్దె కట్టనందుకు కారణము అడిగినప్పడు, వారు ఏమి సమాధానము ఇచ్చేవారు కాదు, అప్పుడు ఆ న్యాయవాధి అతనితో వాధించడం మొదలుపెట్టాడు. కాబట్టి, ఈ వ్యక్తి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, న్యాయవాధిపైన ఫిర్యాదు చేయడం జరిగినది. అయితే, ఈ న్యాయవాధి ఈ జాన్సన్‌కు వ్యతిరేకముగా మరొక ఫిర్యాదును చేయడము జరిగినది. ఈ వ్యక్తి నాపైన అనవసరమైన మాట్లాడకూడని మాటలను మాట్లాడుచున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఈ సహోదరుడు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వెళ్లాడు. ఈ విషయమును బట్టి అతడు ఎంతో వేదన పడ్డాడు, సరిగ్గా నిద్రపోలేక, తినలేకపోయాడు. దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వెళ్లి, అతని కొరకు ప్రార్థించమని ప్రార్థన యోధులను కోరుకున్నాడు. వారు అద్భుతమైన దేవుని వాగ్దానమును అతనికి ఇచ్చారు. "జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును విరోధముగా లేచునని'' చెప్పబడినట్లుగానే, ఆ సహోదరుని జీవితములో అదే జరిగినది. 'మీరు ఎటువంటి మహా జలముల గుండా వెళ్లుచున్నప్పటికిని కూడా ప్రభువు వాటన్నిటి నుండి మిమ్మును పైకి లేవనెత్తుతాడు. ఆయన తన హస్తమును చాచి, లోతైన జలములలో నుండి మిమ్మును పైకి లేవనెత్తుతాడు' అని ప్రార్థనా యోధులు చెప్పారు. ఖచ్ఛితంగా అదే విధముగా జరిగినది.
సహోదరుడు జాన్సన్‌కు విరోధముగా ఫిర్యాదు చేసి, కేసు పెట్టినటువంటి న్యాయవాధి మీదికి ప్రజలు లేచారు. అందును బట్టి, ఆ న్యాయవాది ఆ యింటిలో నుండి ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయాడు. అతడు ఆ యింటికి పూర్తి అద్దె ఇవ్వడం జరిగినది. ఈ సహోదరునికి కట్టవలసిన అద్దెయంతయు అతనికి తిరిగి చెల్లించి, ఆ న్యాయవాది వెళ్లిపోయాడు. అది దేవుని హస్తము కాదా! తద్వారా సహోదరులు జాన్సన్ ఎంతగానో ఆనందించాడు. ప్రార్థన గోపురమునకు వచ్చి, ప్రభువునకు వందనాలు చెల్లించాడు. నా ప్రియులారా, ప్రభువు సహోదరులు జాన్సన్‌ను లోతైన మహా జలముల నుండి బయటకు తీసుకొని వచ్చాడు. అవును, ప్రభువు సహోదరులు జాన్సన్‌తో ఉండెను. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు నేడు మీతో కూడా మరియు మీ పక్షమున ఉన్నాడు. కనుకనే, మీరు ఎటువంటి మహాజలముల గుండా వెళ్లుచున్నను, సరే మిమ్మును పైకి లేవనెత్తుతాడు. మీకు విరోధముగా లేచు శత్రువుల పక్షమున పోరాడి, మిమ్మును వారి నుండి విడిపిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితంలోని లోతైన జలములలో కూడా నీ యొక్క నిత్యమైన సన్నిధికి వందనాలు. దేవా, కష్టాలు వరదలా పైకి లేచినప్పుడు, నీవు మాకు దృఢమైన సహాయముగా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము నిరాశతో ఆవరించబడినప్పుడు కూడా, మమ్మును రక్షించడానికి నీవు మా చేతి పట్టుకొని పైకి లేవనెత్తుము. దేవా, నీవే మా ఆశ్రయం, మా బలం, కష్టాల్లో మా ప్రస్తుత సహాయకుడవు. కనుకనే, నీవు దావీదుతో ఉన్నట్లుగానే, మా బాధలో మాతో కూడా మరియు మా పక్షమున ఉండి, మా శత్రువులు మాపైకి లేచి భయంతో మమ్మును ముంచెత్తినప్పుడు నీ చేయి చాచి, మమ్మును అగాథ జలములలో నుండి పైకి లేవనెత్తుము. దేవా, నీ యొక్క ఆనందం విశాలమైన మరియు నిర్జలమైన దేశానికి మమ్మును తోడుకొని రమ్ము, అక్కడ మా బలహీనతలో కూడా నాపై నీకున్న ఆనందంలో మేము నీ యందు నమ్మకం ఉంచునట్లుగా చేయుము. యేసయ్యా, అగాధ జలములు మా మీదికి దూసుకువచ్చినప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును ఎత్తిపట్టుకొనుము. దేవా, ప్రతి తుఫానులోనూ, నీవు నేనే అవుతావని నీ వాగ్దానాన్ని మేము హత్తుకుంటున్నాము. ప్రభువా, మా జీవితములో కోర్టుకేసు నుండి విడుదల దయచేయుము. దేవా, మమ్మును శ్రమ పెట్టుచున్నట్టువంటి వారు మాకు దూరముగా వెళ్లిపోవునట్లుగా చేయుము. ప్రభువా, విడిపోయిన మా కుటుంబమును నీ యొక్క శక్తిచేత ఐక్యపరచి, మాకు సమాధానమును అనుగ్రహించుము. దేవా, మా గృహమును కట్టుము. దేవా, మాకు విరోధముగా లేచు శత్రువులను నీ యొక్క ఆత్మ చేత మమ్మును ఎత్తిపట్టుకొనుము, వారు వర్థిల్లకుండా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.