నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున మరియు ప్రేమగలిగిన నామమున మీకు శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:23వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. మనము బైబిల్ గ్రంథము నుండి ఈ వచనమును చదువుదాము. ఆ వచనము, " యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవునిని ప్రేమించాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, ఇది ఎంత గొప్ప దీవెనకరమైన ్రకైస్తవ జీవితము కదా!
మొట్టమొదటగా, మనము దేవుని మాటను గైకొనవలెను. అనగా, మీరు ఎంతగా వీలైతే, అంత అధికముగా మీరు దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి. మీరు ఆలాగున చేసినప్పుడు, తండ్రియైన దేవుడు మిమ్మును ప్రేమిస్తాడు. అందుకే యేసు, ఆ విధముగా దేవుని వాక్యమును చదివేవారి యొద్దకు, "మేము అనగా, తండ్రియును, కుమారుడును వచ్చి నివసించెదము '' అని సెలవిచ్చుచున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, తండ్రియైన దేవుడు మరియు కుమారుడైన దేవుడును కలిసి మీతో కూడా నివసించెదరు. అనగా, ఎంతగా వీలైతే, అంత అధికముగా దేవుని వాక్యమును మనము చదవాలి. అప్పుడు ఆయన మనతో కూడా నివసిస్తాడు.
నా ప్రియులారా, దేవుని వాక్యమును ప్రతిరోజు అంత అధికముగా చదవాలి. మీ యొక్క హృదయములోని ఆశలన్నిటిని, అవసరతలన్నిటిని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నిజమైన ్రకైస్తవునిగా మీరు మారాలి అంటే, ప్రతిరోజు మీరు నిర్దేషించబడిన ఒక ప్రత్యేకమైన సమయములో మీరు ప్రార్థించాలి మరియు మీరు వాక్యమును చదవాలి. ఉదయ కాలమున వేకువనే లేచి, ఆయన పాదముల చెంత వేచియుండాలి. స్నేహితులారా, ఈ దినములలో, అనేకమంది యౌవనస్థులు ఉదయము 10 గంటలు లేక 11 గంటల వరకు నిద్రిస్తుంటారు. కానీ, యేసయ్య చేసిన రీతిగానే మీరు కూడా చేయాలి. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 1:35వ వచనములో చూచినట్లయితే, " ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలు దేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను'' అని చెప్పబడినట్లుగానే, ప్రతి దినము ఉదయకాలముననే యేసయ్య తండ్రి వైపు చూచియున్నాడు.
అదేవిధముగా, మార్త సహోదరియైన మరియ దేవునితో ఎటువంటి సహవాసమును కలిగియున్నదో మనము చూడగలము. అందుకే బైబిల్ నుండి లూకా 10:42వ వచనములో చూచినట్లయితే, యేసుప్రభువు మరియను గురించి ఈ విధముగా చెబుతున్నాడు, "మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.'' ఆ ప్రకారముగానే, మనము కూడా ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనవలెను. ఇంకను బైబిల్ నుండి 10:39వ వచనములో చూచినట్లయితే, "ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను'' అని చెప్పబడినట్లుగానే, ఆమె దేవుని వాక్యమును వినుచుండెను, ఆయన పాదముల యొద్ద వేచియుండినది. కనుకనే, మీరు కూడా ఆలాగుననే చేసి, మీరు ఉత్తమమైనదానిని పొందుకొనండి.
నా ప్రియమైనవారలారా, నేడు మీ జీవితములో కూడా ఆశీర్వాదములను తీసుకొని వచ్చు రెండు విషయములు ఇవేనండి. ఇప్పుడు కూడా మన జీవితములను ప్రభువు పాదములకు సమర్పించుకుందాము. ప్రభువు వైపు చూద్దాము. మనము కూడా దేవుని వాక్యమును చదువుచూ, ఆయన పాదముల యొద్ద వేచియుండవలెను. నా ప్రియులారా, ఈ రెండు ఆశీర్వాదములను మీ జీవితములో మీకు ఇవ్వాలని ప్రభువును అడగండి. ఆలాగున చేసినట్లయితే, మీరు కూడా దేవుని వాక్యమును చదువుచూ, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన ద్వారా గడుపుతూ, మీ జీవితములను ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మన పరలోకపు తండ్రియైన దేవుడు మరియు కుమారుడైన యేసును మీతో కూడా వాసము చేయునట్లుగాను, మరియ వలె ఉత్తమమైనదానిని మీరు ఎన్నుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మరియవలె మిమ్మును ఘనపరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా అమూల్యమైన ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, ప్రతిరోజు నీ వాక్యమును చదివే కృపను, శక్తిని మాకు అనుగ్రహించుము. దేవా, మరియవలె ప్రార్థనలో నిన్ను హత్తుకొని ఉండే కృపను మాకు దయచేయుము. ప్రభువా, అటువంటి ఆధ్యాత్మిక జీవితమును మేము జీవించాలని కోరుచున్నాము, నేడే మాకు అటువంటి జీవితమును అనుగ్రహించుము. యేసయ్య, మేము నీతో అన్యోన్య సహవాసమును కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము నీతో సన్నిహితంగా నడవాలని మొరపెట్టుచున్న మా అవసరతలన్నిటిని తీర్చుము. ప్రభువా, మేము వీలైనంత ఎక్కువగా ప్రతిరోజు నీ వాక్యమును చదివే కృపను మాకు దయచేయుము. దేవా, నీ వాక్యమును అనుదినము వేకువనే ధ్యానించి, దాని ప్రకారం జీవించునట్లుగాను, ఆలాగుననే నడుచుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, ఇంకను మేము యేసు పాదముల చెంత కూర్చొని నీ స్వరమును వినుటకును, మరియ వలె, మేము ప్రార్థనలో నిన్ను హత్తుకొనునట్లుగా చేయుము. ప్రభువా, ఇటువంటి ఆధ్యాత్మిక జీవితమును మాకు అనుగ్రహించి, దీవించుము. ప్రభువా, మేము నీతో సన్నిహిత సహవాసమును కలిగి యుంటూ, ప్రతిరోజు నీ సన్నిధిని అనుభవించునట్లుగా సహాయము చేయుము. దేవా, మా జీవితములను నీ వాక్యము నాటబడునట్లుగాను, ప్రార్థన ద్వారా బలపరచబడునట్లుగా చేయుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


