నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఇంకను మీకు యేసు ద్వారా దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను సువార్త 14:12వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో యేసు, "నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని సెలవిచ్చియున్న ప్రకారముగా ఆయన యందు విశ్వాసముంచువారు ఆయన కంటె గొప్ప కార్యములు జరిగిస్తారు అని తెలియజేయుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీ నిమిత్తము యేసు కలిగియున్న ప్రేమను చూడండి. ఆయన ప్రేమను మనమందరము విశ్వసించుచున్నాము కనుకనే, ఆయన ఎటువంటి అద్భుతమైన కార్యములను కూడా జరిగించగలడు. కనుకనే, దేవుడు అద్భుతములను జరిగించగలడు అని మనము నమ్ముచున్నాము. అయితే, యేసు ఇక్కడ, "నా బిడ్డలారా, నా నామములో మీరును కూడా అద్భుతములను జరిగించునట్లుగా నేను మిమ్మును చేయుదును, నేను చేయుచున్న వాటికంటె మీరు ఇంకను గొప్ప అద్భుత కార్యములను జరిగించెదరు' అని చెబుతున్నాడు. దేవుడు అద్భుత కార్యములను చేయువాడై యున్నాడు. ఆలాగుననే, ఆయన తన అద్భుత కార్యములను చేయు శక్తి ద్వారా మిమ్మును తన అద్భుత కార్యములను జరిగించునట్లుగా తగిన సాధనముల వలె మిమ్మును సంసిద్ధము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యోబు 5:9వ వచనములో చూచినట్లయితే, "ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన గొప్ప అద్భుత కార్యములను జరిగించు దేవుడై యున్నాడని వ్రాయబడియున్నది. అవును, ఆయన అద్భుత కార్యములను జరిగించు దేవుడు. అదియుగాక, మన పట్ల మనము ఊహించలేని విధంగా అద్భుత కార్యములను జరిగిస్తాడు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 34:10వ వచనమును చూచినట్లయితే, "అందుకు ఆయన-ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమ నున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు; నేను నీ యెడల చేయబోవునది భయంకరమైనది'' అని వాగ్దానము చేయుచున్నాడు. మొదటిగా, ఆయన అద్భుత కార్యములను జరిగించు దేవుడై యున్నాడు. రెండదిగా, ఆయన మీ నిమిత్తము అద్భుత కార్యములను జరిగించును అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి.
అవును, నా ప్రియులారా, దేవుడు భయంకరమైన అద్భుత కార్యములను మీ పట్ల జరిగించుచున్నాడు. ఆయన మహా అద్భుతమైన ఆశ్చర్యకార్యములను జరిగిస్తాడు. ఆయన మీ నిమిత్తము అద్భుతములను జరిగించబోవుచున్నాడు. అందుచేతనే, మనము యేసుని చెంత ప్రార్థించుదాము. కనుకనే, ఆయన, " నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును '' అని అంటున్నాడు. అవును, నా ప్రియులారా, మీరు ఆయన నామమున ఏది అడిగినప్పటికిని సరే, నిశ్చయముగా, ఆయన మీ పట్ల అద్భుత కార్యములను జరిగిస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 4:17 వచనములో చూచినట్లయితే, "తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.'' ఆలాగుననే, నేడు మీరు కూడా ఆయన యందు విశ్వాసముంచినప్పుడు, ఆయన మీ కొరకు అద్భుతములను జరిగించునని తెలియజేయబడుచున్నది. యేసు ప్రభువు మీ కొరకు అద్భుతములను జరిగిస్తాడు అని మీరు విశ్వసించినప్పుడు, ఆయన మీ కొరకు అద్భుతములను జరిగిస్తాడు. అందుకే బైబిల్‌లో, "...ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు ఈ లోకములో ఉన్నప్పుడు, మాటలోనూ, క్రియలలో అత్యంత బలవంతుడుగా ఉండెను. కనుకనే, యేసు, " నేను అద్భుత కార్యములను చేయగలము అని మీరు విశ్వసించినట్లయితే, మీకు సమస్తమూ సాధ్యమే'' అని సెలవిచ్చుచున్నాడు. అవును, మీరు విశ్వసించినప్పుడు, మీరు మాత్రమే అద్భుతములను కలిగియుండడము కాదు గానీ. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 3:16వ వచనములో చూచినట్లయితే, " ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను'' అని చెప్పబడిన ప్రకారముగా మీరు విశ్వాసముంచినప్పుడు, మీరు ఇతరుల కొరకు అద్భుతములను తీసుకొని వచ్చెదరు. అలాగుననే, ఆయన శిష్యులైన యోహాను మరియు పేతురు అను వారు దేవాలయమునకు వెళ్లుచుండగా, ఒక కుంటివానిని చూచి, అతడు బిక్షమెత్తుకొనుచుండెను. అయితే, వారు అతనిని చూచి, "అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి, వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను'' అని చెప్పబడిన ప్రకారము అతడు స్వస్థతను పొందుకున్నాడు. ఆలాగుననే, అపొస్తలుల కార్యములు 19:11-12వ వచనములలో చూచినట్లయితే, " మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను'' అని చెప్పబడిన ప్రకారముగానే దేవుడు పౌలు హస్తముల ద్వారా అత్యంత ప్రచంఢమైన అద్భుత కార్యములను జరిగించియున్నాడు. అతని చేతి గుడ్డలైనను, రూమాలు కూడా తాకిన ప్రజలు స్వస్థపరచబడియున్నారు. దురాత్మలు ప్రజలను విడిచిపెట్టి వెళ్లిపోయాయి. నా ప్రియులారా, అద్భుతముల కొరకు శక్తిగల యేసు నామమును మనము ప్రకటించుచుండగా, ఇతరులకు అద్భుతములను జరిగించుటకు దేవుడు మిమ్మును మరియు మమ్మును వినియోగించుకొనవలెనని కోరుచున్నాడు.
నా ప్రియులారా, అవును, యేసు జరిగించుచున్న ఈ అద్భుత కార్యముల ద్వారా యేసు ప్రేమను మీరు కనుగొనెదరు. యేసు ద్వారా, ప్రజలు జీవితములో నిరీక్షణను కనుగొంటారు. ఈ రోజు మానవులు లోకములో ఇతర ప్రజలకు పరిష్కారములను తీసుకొని రాలేరు గనుకనే, నిరీక్షణ లేనివారుగా ప్రజలు ఉన్నారు. నా ప్రియులారా, మీకు దేవుడు ఎంతో అవసరము. అయితే, యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారా ప్రతి ఒక్కరి కొరకు విలువ పెట్టి, క్రయధనముగా తన ప్రాణమును ఆయన సిలువలో చెల్లించియున్నాడు. కనుకనే, మీ యొక్క శ్రమ, రోగము, పాపము మరియు బాధ నుంచి ఆయన మీకు విడుదలను అనుగ్రహించగలడు. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 16:17వ వచనములో చూచినట్లయితే, " నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు'' అని యేసు సెలవిచ్చినట్లుగానే, యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఈ అద్భుత కార్యములు, ఈ సూచక క్రియలు వెనువెంటనే జరుగునని తెలియజేయబడియున్నది. అవును, యేసు నామమున వారు ప్రకటించుచుండగా, దురాత్మలు, దయ్యములు ప్రజలను విడిచిపెట్టి, పారిపోవడము జరుగుచుండెను. ప్రజలు వారి యొక్క పాత పాపములను విడిచిపెట్టి, నూతన భాషలతో మాట్లాడువారుగా బయటకు వచ్చియున్నారు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, ఆ రీతిగా వారు స్వస్థపరచబడెదరు అని యేసు సెలవిచ్చెను. ఇందునిమిత్తము దేవునికి మీరు మరియు నేను కావాలి. ఇతరులు ఏమంటునన్ను, సరే, మనము పట్టించుకొనకుండా, యేసు సెలవిచ్చినదానిని గురించి జాగ్రత్త వహించుదుము. ఇంకను ఈ లోకములో నిరీక్ష ణ లేని, ప్రజల కొరకై యేసు నామమును తీసుకొని వారి యొద్దకు వెళ్లుదము. యేసు నామమును గురించి వారి యొద్ద ప్రకటించినప్పుడు, వారి యొక్క శ్రమ, రోగము, పాపము నుండి మరియు దురాత్మల ఒత్తిడి నుండి విడుదలను వారు పొందుకొని, అద్భుత కార్యములను అనుభవించెదరు. కనుకనే, నా ప్రియులారా, నేడు ఈ కృప కొరకు దేవునికి మీరు మొఱ్ఱపెట్టండి. యేసు నామమున భరించుటకు ఆయన చేతులలో ఒక సాధనముగా వాడబడడము కొరకై ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, నిశ్చయముగా, దేవుడు మీ ద్వారా భయంకరమైన కార్యములను జరిగించి, నేటి వాగ్దానము నుండి మిమ్మును బలపరచి, దీవించును గాక.
ప్రార్థన:
విశ్వాసమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, బ్రద్ధలైన మా హృదయాలను నీ యొద్దకు తీసుకొని వచ్చుటకు, ప్రజలకు అద్భుతములను జరిగించుటకు ఒక సా«ధనముగా నీవు మమ్మును వాడుకొనుము. యేసయ్య, నీ నామము ద్వారా మమ్మును ఘనపరచుము. ప్రియమైన ప్రభువైన యేసూ, నీవు అద్భుతాలు చేయగల దేవుడవని మేము నమ్ముచున్నాము. దేవా, మేము నీ యందు సంపూర్ణంగా నమ్మి, సందేహంలో కాకుండా విశ్వాసంతో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మహిమ కొరకు మా జీవితంలో మరియు మా జీవితం ద్వారా అద్భుతములు జరిగించుము. యేసయ్యా, స్వస్థత, నిరీక్షణ మరియు విడుదల తీసుకురావ డానికి మమ్మును ఒక సాధనముగా నీ కొరకు వాడబడు ఒక మంచి పాత్రగా మమ్మును తీర్చిదిద్దుము. యేసయ్యా, నీ యొక్క శిష్యుల వలె మమ్మును కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా నీ యొక్క శక్తి, జ్ఞానము మరియు ధైర్యముతో మమ్మును నింపుము. దేవా, నీ స్వరానికి మేము విధేయత చూపి, విశ్వాసంతో పరిచర్యలోను మరియు జీవితములోను మరియు అన్ని విషయములలోను మేము ముందడుగు వేయడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా ద్వారా అనేకులు నీ ప్రేమను అనుభవించునట్లుగా మాకు అటువంటి కృపను మరియు గొప్ప ధన్యతను దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


