నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 50:4 వ వచనమును నేడు తీసుకొనబడినది. ఆ వచనము, "అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు'' అని చెప్పబడియున్నది. మరియొక అనువాదములో, "దేవుడు జ్ఞానముగలవాని యొక్క నాలుకను, భాషను నాకు దయచేసియున్నాడు మరియు అది జ్ఞానముగల స్త్రీ యొక్క భాషగా ఉంటుంది'' అని వ్రాయబడియున్నది. నా ప్రియులారా, దేవుడు ఒక వాక్కును కలిగియున్నాడు. "అలసినవానిని'' మరియు బాధించు వారిని, వారి యొక బాధలలో నుండి బయటకు తీసుకొని వచ్చి, వారిని 'ఊరడించు' నిమిత్తమే. అట్టి శ్రమ, ఆతురత అలసటలో ఉన్నవారిని ఊరడించు నిమిత్తము బయటకు తీసుకొని వచ్చి, వారికి వాక్కును అందించే సాధనము కావాలి. అందుకోసమే ఆయన శిష్యునికిచ్చిన తగిన నోటిని మనకు దయచేయుచున్నాడు. అది జ్ఞానముగల భాష. ఏమిటి ఆ యొక్క శిష్యునికి తగిన నోరు? అలసినవారిని, వారి శ్రమలలో నుండి బయటకు తీసుకొనిరావడము కొరకై దేవుడు మనకు అనుగ్రహించు మాటలతో కూడిన భాషయై యున్నది. అందుచేతనే, యేసు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్లక మునుపే, తన శిష్యులతో ఈ రీతిగా చెప్పియున్నాడు. మార్కు 16:17వ వచనములో చూచినట్లయితే, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను'' ప్రకారం మీరు దేవుని యందు విశ్వాసముంచినప్పుడు, నూతనమైన భాషలు మాట్లాడుదురు. యేసునందు ఉన్న ప్రతి విశ్వాసియు కూడా నూతన భాషలు మాట్లాడునట్లుగా చేయబడ్డారు. ఎందుకు క్రొత్త భాషలు? ఎందుకంటే, ప్రార్థించినప్పుడల్లా పాత భాషలను మరల మరల మాట్లాడుతుంటాము, 'ఓ దేవా, నేను ఎప్పుడు, బాధలను అనుభవించుచున్నాను, నీవు నన్ను చూడుము, ప్రతిరోజు అదియే ప్రార్థన. ఇంకను 'ప్రభువా, నా భర్తచేత అణిచివేతకు గురియగుచున్నాను. ఆ స్త్రీ వైపు చూడండి, ఆమె వర్థిల్లుతుంది. నేను ఏమో బాధపడుచున్నాను, ఎంతకాలము ప్రభువా?' అటువంటి ప్రార్థనలే మన యొద్ద నుండి సమర్పించబడతాయి. దేవుని యొద్ద నుండి జవాబులు రావడములేదు. మనము కేవలము ఎప్పుడు, శ్రమలను మరియు బాధలను, సమస్యలను గూర్చియే మాట్లాడుచుంటాము. అయితే, దేవుడు తన ప్రణాళికను మీ జీవితములోనికి తీసుకొనిరావడము కొరకు మీ నోటి భాషను వినియోగించుకోవాలని కోరుచున్నాడు. ఆయన ప్రణాళిక ఎప్పుడు మేలుకరముగానే ఉంటుంది. అది మేలు కొరకే ఉంటుంది. కనుకనే మీరు క్రొత్త భాష మాట్లాడవలసి ఉంటుంది. చక్కగా సూచించబడియున్న భాష, పరిశుద్ధాత్మచేత సూచించబడిన భాష. అందుకోసమే దేవుడు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. మీరు పరిశుద్ధాత్మ యొక్క వాక్కును మాట్లాడుతారు. అది క్రొత్త భాష.
రెండవదిగా, మనం కొత్త భాషలలో మాట్లాడగలిగేలా మరియు పరలోకం నుండి మాటలు మాట్లాడగలిగేలా దేవుడు మనలను పరిశుద్ధాత్మతో నింపుతాడు. బైబిల్ నుండి యెషయా 28:11-12వ వచనములలో చూచినట్లయితే, ప్రభువు మిమ్మును తన భాషలతో మాట్లాడింపజేస్తాడు. ఆ వచనములు, "నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును'' అని చెప్పబడిన ప్రకారము తెలియబడని భాష ద్వారా మరియు నత్తివారి పెదవుల ద్వారాను ఆయనే మీ నోటి మాటల ద్వారా మాట్లాడతాడు. ఈ రోజున ఆయన మీ నోటి మాటల ద్వారా మాట్లాడుచుండగా, మీరు మీ ఆత్మలో విశ్రాంతిని పొందుతారు. అది అలసివారికి ఊరడింపును ఇస్తుంది. ఆ రీతిగానే, దేవుని కృప ద్వారా నేను ప్రజలను పేరు పెట్టి పిలువగలుగుచున్నాను. బహిరంగ సభలలోను, టెలివిజన్ ద్వారాను, ఆలాగుననే, వ్యక్తిగతంగా ప్రార్థించుచున్నప్పుడు ప్రభువు నా కన్నులను తెరువజేస్తాడు. ఆధ్యాత్మిక నేత్రములు. నాకు ఎదురుగా ఉన్న ప్రజల యొక్క మొఱ్ఱకు జవాబును తీసుకొని రావడము కొరకు, దేవుని కార్యము నా హృదయమును నింపివేయుచున్నది, 'నేను ప్రభువునకు మొఱ్ఱపెడతాను.' జవాబు కొరకు నా ప్రార్థన మీద నిరీక్షణ కలిగినవారుగా ఈ ప్రజలు ఇక్కడకు ఈ రీతిగా వస్తారు. నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పైకి లేవనెత్తబడతాడు, ' నేను ఈ అద్భుతాన్ని వారికి చేస్తానని వారికి చెప్పమని నాకు చెబుతాడు. కొన్నిసార్లు, ఈ పాపము నుంచి వారిని ఒప్పుకోమని చెప్పు, నేను వారిని బంధకముల నుండి విడిపిస్తానని నాతో చెబుతాడు. కొంతమంది ప్రజలు ఎల్లవేళల, పాపము నుండి పశ్చాత్తాపపడాలి, పాపమును ఒప్పుకో, అప్పుడే మీరు ఆశీర్వాదములను కలిగియుంటారు అని చెబుతాడు.' కానీ, కొన్నిసార్లు, వారి భవిష్యత్తును గురించిన దేవుడు కలిగియున్న ఆశీర్వాదములను ఏవియు కూడా వారికి తెలియజేయడు. కనుకనే, ప్రజలు కొన్నిసార్లు కేవలము శిక్షావిధి మాటలతోనే తిరిగి వెళ్లిపోతుంటారు. కానీ, దేవుడు అలసినవారిని ఊరడించి, స్థిరపరచేవాడై యున్నాడు. ఆయన మనలను పశ్చాత్తాపపడేలా చేస్తాడు. ఆలాగుననే, ఆశీర్వాదాలను పంటగా కోయునట్లు చేస్తాడు. దేవుని సేవకుడు ఈ రెండింటిని కూడా ప్రజల యొద్దకు తీసుకొని రావలసియున్నది. అందుచేతనే, దేవుని యొక్క భాషను, దైవ సేవకుడు మాటలాడవలసి యున్నది. ఈ రోజు ఇతర ప్రజలకు ఆశీర్వాదముగా ఉండుట కొరకై, దేవుని యొద్ద మొఱ్ఱపెట్టండి.
నా ప్రియులారా, నేడు ఈ వరము కొరకు దేవుని యొద్ద మొఱ్ఱపెట్టండి. మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ కొరకు ఆయనకు మొఱ్ఱపెట్టండి. తద్వారా, మీరు ఇతర ప్రజల కొరకు ఆశీర్వాదకరముగా ఉండవచ్చును. కనుకనే, క్రొత్త భాషలతో మాట్లాడే ఇట్టి కృప కొరకు దేవుని యొద్ద మొఱ్ఱపెట్టండి. అప్పుడు మీరు మీ కొరకు దేవుని ప్రణాళికలను తెలుసుకుంటారు. మీరు దైవ ప్రణాళికను అలసినవారిని ఊరడించునట్లుగా తీసుకొని వస్తారు. మీరు దేవుని యొక్క వాక్కును మాట్లాడుతారు, అందరు మిమ్మును ప్రేమిస్తారు, మీలో యేసును చూచెదరు. అందరు మిమ్మును అంటిపెట్టుకొని ఉంటారు. నా ప్రియులారా, నేడు దేవుడు మీకు ఈ క్రొత్త భాషను అనుగ్రహించును గాక.
ఇక్కడ శ్రీమతి మనోరమ్మగారి యొక్క అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఆమెకు ఇద్దరు బిడ్డలు. ఆమె కుమార్తెకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్య ఉండేది. ఆరు నెలల వయస్సు ఉండగానే, అప్పటి నుంచి కాలేయము సమస్య ఉండేది. తరచుగా, రక్త మార్పడి చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్య దినములను కోల్పోతుంది. సరిగ్గా భోజనము చేయలేకపోతుంది, నిద్రపోలేకపోతుంది. ఇక ఆమె అన్నిటిని మానేసింది. ఆమెను చూచిన తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖముతోను, విచారముతోను, భయముతోను నింపబడ్డారు. 18 సంవత్సరములు ఆ రీతిగా గడిచిపోయినవి. ఆమె బాధ ఆలాగుననే, కొనసాగుతూనే ఉంది. ఆమె తరగతిలో తాను ఉత్తీర్థురాలైనది. ఆ సమయములోనే, యేసు పిలుచుచున్నాడు మహా సభలు బిలాష్‌పూర్‌లో నిర్వహించబడటము జరిగియున్నది. వారు అక్కడికి వచ్చియుండగా, వందలు వేలమంది ఉండియున్న ఆ కూటములో నేను ఆమెను పేరును పెట్టి " రక్షణా,'' అని పిలిచియున్నాను. ఇంకను, నేను ' రక్షణా, నీ కాలేయములో నీకు సమస్య ఉన్నది. యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, వెంటనే, దేవుని యొక్క శక్తి ఆమె మీదికి దిగివచ్చినది. తద్వారా, ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడియున్నది. ఆమె తను వ్రాయబోవుచున్న పరీక్షల నిమిత్తము చాలా బాగుగా సిద్ధపడియుండెను. ఈ రోజు ఆమె ఆరోగ్యకరమైన ఒక ఆడబిడ్డగా ఉండెను. ప్రభుత్వములో చేర్పించడానికి ఎదురు చూస్తున్నారు. నా ప్రియమైన స్నేహితులారా, ఆలాగే, వారు యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పధకములోను మరియు వారి బిడ్డలు కూడా యౌవన భాగస్థుల పధకములో సభ్యులుగా చేర్పించబడియున్నారు. దీనికంతటికి వారికి కావలసినది దేవుని యొద్ద నుండి ఒక్క వాక్కు మాత్రమే. ఆలాగుననే, దేవుడు మిమ్మును కూడా అటువంటి వాక్కును తీసుకొని వచ్చువారినిగా చేయుచున్నాడు. అనేకమంది అలసిన కుటుంబాలకు ఊరడింపు చేయునట్లుగా మిమ్మును కూడా నేడు మారుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క జ్ఞానం, కనికరము మరియు నీ ఆత్మతో నిండిన చక్కగా బోధించబడిన నాలుకను మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము ఇకపై మా బాధను గురించి కాదు, నీ ఉద్దేశ్యం గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాము. దేవా, అలసిపోయిన వారిని నిలబెట్టుటకును, బాధించుచున్నవారికి నిరీక్షణను కలిగించే మరియు నీ హృదయాన్ని ప్రతిబింబించే మాటలను మేము మాట్లాడటకు మాకు నేర్పించుము. ప్రభువా, నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఫిర్యాదుతో కాకుండా, నీ యొక్క దైవీక ప్రణాళికతో కొత్త భాషలు మాట్లాడటానికి మాకు సహాయం చేయుము. దేవా, ఇతరుల అవసరాలను చూడటానికి మా ఆధ్యాత్మిక దృష్టిని మరియు నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి మా చెవులను తెరుము. దేవా, నీ కనికరము మా ద్వారా ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, అవసరంలో ఉన్నవారికి జీవం, స్వస్థత మరియు నడిపింపును తీసుకురావడానికి మమ్మును ఒక సాధనంగా మార్చుము. దేవా, ప్రజలు మాలో యేసును చూచునట్లుగాను, మా నుండి నీ సత్యాన్ని వినునట్లుగాను మరియు నీ ప్రేమ వైపు ఆకర్షితులగునట్లుగా కృపను చూపుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.