నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున మన మీద దేవుడు ఆనందతైలమును కుమ్మరించుచున్నాడు. మనము ఆయన వాక్కును స్వీకరించుచుండగా, అట్టి ఆశీర్వాదమును పొందుకొనగలము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెఙ్కేలు 37:14 వ వచనమును మీ యొద్దకు తీసుకొని రాబడినది. ఆ వచనము, "నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాకు'' అని చెప్పబడిన ప్రకారము ఆయన తన ఆత్మను మీలో ఉంచి, మిమ్మును జీవింపజేయుచున్నాడు మరియు మీ దేశములో మిమ్మును నివసింపజేయుచున్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ యొక్క నూతనమైన కుమ్మరింపును మనము పొందబోవుచున్నాము. ఈ లేఖనము వ్రాయబడియున్న దినములలో జీవించుచున్న ప్రజల జీవితమును మనము చూచినట్లయితే, ఇది చాలా వాడబారినట్లుగా ఉండెను. కనుకనే, వారు మా జీవితములు వాడబారిపోయినదిగా ఉన్నది, మా నిరీక్షణ అంతయు మా నుండి తొలగిపోయినట్లుగా ఉన్నది, మా జీవితములో ఏదైన మంచి లేక మేలు జరుగుతుందా? అని తలంచుకొనుచున్నటువంటి పరిస్థితులలో, ' మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను,' అను ఈ లేఖనము ద్వారా దేవుడు వారితో మాట్లాడియున్నాడు.

ఒకవేళ నా ప్రియులారా, నేడు మీరు కూడా, ఆ రీతిగానే విలపించుచున్నారేమో? 'ప్రభువా, మా జీవితములో కొన్నిభాగములు ఎంతగానో ఎండిపోయినట్లుగా ఉన్నవి అని విలపించుచుండవచ్చును. మా జీవితములో భాగస్వామిని కనుగొనలేని విధంగా ఎండిపోయినట్లుగా ఉన్నది. ఇంకను మా కుటుంబ జీవితములో కూడా ఏ మాత్రము కూడా ఆనందమును కనుగొనలేకపోవుచున్నాము. మా జీవితము ఎంతో వాడబారిపోయినట్లుగా అనిపించుచున్నది. మా వ్యాపారములోను, మా చదువులలో, ఉద్యోగములలో ఎండిపోయినట్లుగా అనిపించుచున్నది. 'ప్రభువా, మాకు ఏ మేలు కనబడడము లేదు, ఎటువంటి ఆనందమును మేము పొందుకొనలేదు, మేమేమి చేయగలము? ప్రభువా, మాలో ఉన్న నిరీక్షణ కూడ తొలగిపోయినది అని చెప్పవచ్చును. అయితే, నా ప్రియ స్నేహితులారా, ఇటువంటి సందర్భములలో మన యొక్క మానవ మనస్సు ఏ విధమైన నిరీక్షణను సంగ్రహించుకోలేదు. కానీ, దేవుడు తన ఆత్మను మనలో కుమ్మరించుచుండగా, ఆయన మన మనస్సును నూతనపరుస్తాడు. దానిని దేవుని యందలి ఆనందముతో నింపబడునట్లుగా చేస్తా డు. ప్రభువు మన కొరకు ఏమి చేయబోవుచున్నాడు అని దానిని బట్టి, యోచించి మాట్లాడుతాము, అది మన భవిష్యత్తును తెరవజేయుచున్నది.

నా ప్రియులారా, అందుకే దేవుడు మనలను చూచి, "నేను మీలో నా ఆత్మను కుమ్మరించెదను, మీరు జీవించెదరు'' అని సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆ రీతిగా మనకు ప్రవచనము తెలియజేయుచున్నాడు. ఆత్మ మనలను జీవింపజేయడము. నిరీక్షణ రాహిత్యములో చచ్చిపోవడము కాదు, 'మిమ్మును మీ స్వదేశములో నివసింపజేస్తాను మరియు స్థిరపరుస్తాను' అని వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మీరు ఉన్న ప్రదేశములో నుండియు తొలగింపవేయబడుచున్నారేమో? ఇంకను, మీ ఉద్యోగ స్థలము నుండియు మరియు మీ జీవితములో ఆ భాగము తొలగించివేయబడుతుందని అనుకుంటున్నారేమో? ఇక అందులో నిరీక్షణ లేదని అనుకుంటున్నారేమో? లేదు నా ప్రియమైనవారలారా, 'మీరు ఉన్న స్థలములో మిమ్మును స్థిరపరుస్తాను, నేను అనుగ్రహించు భూభాగములో ఎంతో సంతోషముతో మిమ్మును స్థిరపరుస్తాను. మీ యొక్క వివాహము సజీవంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు కనుగొని, మీ వైవాహిక జీవితములో మీరు ప్రవేశిస్తారు' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మనము ఇట్టి ఆశీర్వాదములను స్వీకరిద్దామా? ఆలాగైతే, నేడే మీ జీవితమును దేవుని హస్తాలకు అప్పగించినట్లయితే, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితంలో నీ ఆనంద తైలమును కుమ్మరించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీ ఆత్మను మా మీద కుమ్మరించుము. అది మాలో నుంచి, ప్రతి ఎండిపోయిన భాగమును మార్చునట్లుగాను మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా మనస్సులను నీ యొక్క ఆత్మ సంపూర్ణ చేత నూతనపరచుము. ప్రభువా, నీ ఆత్మ మాలోనికి వచ్చునట్లుగాను, నీవు మా నిమిత్తము కలిగియున్న గొప్ప భవిష్యత్తును, నీవిచ్చు గొప్ప భవిష్యత్తును మా మనస్సు చూచునట్లుగా చేయుము. ప్రభువా, మా మనస్సులోను, మా జీవితములో ఉన్న మోడుబారిన తనము తొలగించుము. దేవా, మా కుటుంబములో సంతోషము, వ్యాపారములో అభివృద్ధి, మా ఉద్యోగములో సమాధానమును దయచేసి, మా స్వదేశములో మమ్మును స్థిరపరచుము. యేసయ్య, మా జీవితములోను మరియు మా శరీరములో బలమైన స్వస్థతను మాకు దయచేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి ఎండిపోయిన మరియు శూన్యమైన ప్రదేశంలో నీ జీవాన్ని ఊది, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. ప్రభువా, మాలోని ప్రతి నిరాశను తొలగించి, మా జీవితంలో నీ ఆనందం పొంగిపొర్లునట్లుగాను, మేము కోల్పోయినట్లుగా మరియు నిర్జీవంగా అనిపించే వాటిని పునరుద్ధరించుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.