నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:24వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును'' ప్రకారం మీరు మేలు చేయుట నిమిత్తము మీ శాయశక్తులా ప్రయత్నించినప్పటికిని, ఎన్నిసార్లు మీ హృదయంలో అలసిపోయినట్లు అనిపించిందా? మీరు నీతిమంతులుగా జీవించి ఉండవచ్చును, ధారాళంగా ఇవ్వబడి ఉండవచ్చును, ఉచితంగా క్షమించబడి ఉండవచ్చును మరియు మీ కుటుంబం కోసం, మీ పని స్థలం కొరకు లేదా ప్రభువు పరిచర్య కొరకు విరామము లేకుండా పనిచేసి ఉండవచ్చును. అయినప్పటికని, మీ ప్రయత్నాలకు ఎదురు చూచినవిధంగా ప్రతిఫలం లభించనప్పుడు, మీ ఆత్మ అలసిపోతుంది, అంతా శూన్యంగా ఉంటుంది మరియు నిరాశ చెందుతుండవచ్చును. దేవుడు మీ బాధను మరియు అలసటను అర్థము చేసుకొనగలడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 11:28వ వచనములో మిమ్మును తన యొద్దకు రమ్మని పిలుచుచున్నాడు, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని మిమ్మును తన యొద్దకు ఆహ్వానించుచున్నాడు. నా ప్రియులారా, మీరు మీ కుటుంబం, పని, బాధ్యతలన్నింటిని మీరే ఒంటరిగా మోసినట్లయితే, అది మోయలేని బరువుగా ఉంటూ, ఎంతో భారంగా మారుతుంది. అయితే, మీరు ఆ భారాలన్నింటిని యేసుని దగ్గరకు తీసుకెళ్లినప్పుడు,భారము మోయుచున్న మీకు ఆయన విశ్రాంతిని మరియు సమాధానాన్ని ఇస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

అదేవిధముగా నా ప్రియులారా, బైబిల్ నుండి మత్తయి 11:29-30వ వచనములో చూచినట్లయితే, ప్రభువు మరల ఈలాగున చెప్పుచున్నాడు, "నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి'' ప్రకారం సమస్య ఏమనగా, అనేకసార్లు మన స్వంత సమస్యల అను కాడిని, మన కుటుంబ పోరాటాలను లేదా మన ఉద్యోగములో ఉన్న ఒత్తిళ్లను మనమే మన మీద మోసుకుంటాము. అందుకే మన బలం తగ్గిపోతుంది మరియు మన ఆత్మ భరించలేనంతగా నలిగిపోతుంది. కానీ, ప్రభువు తన తేలికైన మరియు సుళువైన కాడితో ఆ బరువైన భారాలను మార్చుకోమని మనలను తన యొద్దకు ఆహ్వానించుచున్నాడు. ఆయన కాడి ఏమిటి? అది ఆయన చిత్తప్రకారము ప్రతిదానిని చేయుట మాత్రమే. ఇంకను ఆయన నామములో ఇతరులను ప్రేమించుట, ఆయన నామములో ఇతరుల క్షమించుట, ఆయన నామములో ఇతరుల కొరకు ప్రార్థించుట మరియు ఆయన సాక్షిగా సేవ చేయుటయే ఆయన కాడిగి ఉన్నది. నా ప్రియులారా, మనం ఇలాగున చేసినప్పుడు, ఆయన సన్నిధి మనలను నింపుతుంది, ఆయన సమాధానము మనలను బలపరుస్తుంది మరియు మన బాధ్యతలు ఇకపై అత్యధికమైన బరువుగా మనకు అనిపించవు. బదులుగా, ప్రభువు తానే మన భారములను మోస్తాడు మరియు ప్రతి భారాన్ని తేలికగా మరియు సుళువుగాను చేస్తాడు. కనుకనే, మీరు దేనిని బట్టి చింతించకండి. మీ భారమును ఆయన మీద మోపండి, ఆయనే మిమ్మును ఆదుకుంటాడు.


నా ప్రియులారా, నేడు ప్రభువు మీకు విశ్రాంతిని మాత్రమే కాకుండా తిరిగి నింపుతానని కూడా మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. మీ ప్రార్థనలకు జవాబు దొరకకపోవడం వలన, నెరవేరని కలలు లేదా ఆశీర్వాదాలలో కలుగుచున్న ఆలస్యము కారణంగా మీ ప్రాణము క్షీణించుచున్నట్లయితే, దేవుడు మిమ్మును మరల పునరుద్ధరించి, అలసియున్న మీ ప్రాణమును ఉత్తేజపరస్తానని సెలవిచ్చుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి యోహాను 16:20వ వచనము చూచినట్లయితే, 'యేసు మీ దుఃఖము సంతోషంగా మారుతుందని' వాగ్దానం చేయుచున్నాడు. ఆలాగుననే, 1 కొరింథీయులకు 6:17వ వచనం ప్రకారం మీరు మీ ఆత్మను ఆయనతో ఒకటిగా చేసినప్పుడు మీరు ఏకాత్మ అవుతారు. ఇంకను మీరు ఏకాత్మగా మారినప్పుడు యోహాను 7:38వ వచనము ప్రకారం మీలో నుండి జీవజల నదులు పారును. ఆలాగుననే, మీరు ప్రార్థనలో, సేవా పరిచర్యలో మరియు ఆయన ప్రేమను పంచుకోవడంలో దేవునితో భాగస్థులుగా మారినప్పుడు, ఆయన ఆనందం మీ జీవితంలో పొంగిపొర్లుతుంది. మీకు శూన్యంగా ఉన్న ప్రతి ప్రాంతం నేటి నుండి సమృద్ధితో నింపబడుతుంది. ఇంకను మీ యొక్క ప్రతి దుఃఖం సంతోషముగా మారుతుంది. ప్రతి కొరత దైవిక ఏర్పాటుతోను, సదుపాయముతో నింపబడుతుంది. నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " అలసియున్న మీ ప్రాణమును నేను సంతృప్తిపరుస్తాను. నేను మిమ్మును తిరిగి నింపుతాను. నేను మీకు విశ్రాంతి మరియు వర్థిల్లతను దయచేస్తాను'' అని అంటున్నాడు. కనుకనే, ఒకవేళ నేడు మీరు మీ యొక్క జీవితములో మీ సమస్త భారములను మీరే మోయుచు, మీరు అలసియున్నట్లయితే, దేవుడు నేటి వాగ్దానము అలసియున్న మీ ప్రాణమును తృప్తిపరచి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, అలసిపోయిన మా ప్రాణమును తృప్తిపరచడానికి నీవు ఇచ్చిన వాగ్దానము కొరకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క విశ్రాంతితో మమ్మును నింపుము. ప్రభువా, మేము మా భారములను నీ మీద మోపి, నీ యొక్క సుళువైన, తేలికైనా నీ కాడిని మేము మోయుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా హృదయం మరియు మా జీవితములో ప్రతి భారాన్ని మా నుండి తొలగించుము. దేవా, మేము ఎడారిగాను మరియు అలసిపోయినట్లుగా భావించే మా జీవితంలోని ప్రతి ప్రాంతమును నీ యొక్క సమృద్ధితో నింపుము. యేసయ్యా, మా దుఃఖము సంతోషముగా మారునట్లుగా నీవు మాకు సహాయము చేయుము. దేవా, మా ఆత్మ నీతో కలిసి ఏకాత్మగా ఉండునట్లుగా కృపనిమ్ము. ప్రభువా, మేము నిన్ను ఆనందంతో సేవించునట్లుగాను మరియు మా ద్వారా జీవజల నదులు ప్రవహించునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.