నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు నాకు ప్రత్యేకమైన దినము. ఈ రోజు నా మొదటి బిడ్డ క్యేట్లిన్ అన్నా దినకరన్ జన్మదినము. నాకు తెలుసు, ఉదయకాలమున పెందలకడనే లేచి, నాకు పుట్టిన రోజు అని ఆ బిడ్డ చెప్పి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగియున్న క్యేట్లిను మాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనములు తెలియజేయుచున్నాను. క్యేట్లిన్ ఎల్లప్పుడు కూడా ప్రభువు కొరకు శ్రేష్టమైనది చేయాలని అనుకుంటుంది. ప్రజలందరిని నవ్వుతోను, ప్రేమతోను, శ్రద్ధతోను ఎంతగానో బాధత్య వహిస్తుంది. బిడ్డలు నిజముగా దేవుడు మాకు ఇచ్చిన బహుమానము అని చెప్పగలను. మనము ఆయనకు వందనములు చెల్లించుచూ, ఆయన యొద్ద నుండి మనము శ్రేష్టమైనది పొందుకుందాము. దయచేసి, మీ శుభములు ఛాట్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ, ఆమెకు తెలియజేయండి.
క్ఛటట్చజ్ఛ:

నా ప్రియులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 55:12వ వచనమును అనుగ్రహించుటకు ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆ వచనము, " మీరు సంతోషముగా బయలు వెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు...'' అని చెప్పబడినట్లుగానే, ఒక అమూల్యమైన బహుమానముగా దేవుడు ఈ వాగ్దానమును మనకు అనుగ్రహించియున్నాడు. ఈ రీతిగా మనము బయలు వెళ్లవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. దేవుని ఆనందముచేతను మరియు దైవీక సమాధానముచేతను మనము నడిపించబడాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఆయన మనలను చూచి, ఈలాగున అంటున్నాడు, 'నా బిడ్డలారా, ఏ మాత్రము రోధించకండి, ఏ మాత్రము కూడా విడిచిపెట్టకండి, నేను మీతో కూడా వచ్చుచున్నాను.' మీరు గమనించండి, ఒక బృందము ఎక్కడికైనను ప్రయాణము, యాత్ర అన్నట్టుగా బయలుదేరి వెళ్లుచున్నప్పుడు, ఆ యొక్క యాత్రను ప్రణాళిక బద్ధముగా నిర్వహించుచున్నవారు, చాలా ఒత్తిళ్లతోను మరియు ఆత్రుతను కలిగియుంటారు. ఎన్నో ప్రణాళికలు వారు సంసిద్ధము చేసినను, ఇవన్నియు కూడా జరుగుతాయా? అన్నట్టుగా ఉంటారు. ఆ ప్రాంతములో ఆహారము మంచి లభ్యమవుతుందా? ఆ యొక్క బస్సు సమయమునకు వస్తుందా? నేను ప్రణాళిక చేసినవన్నియు కూడా చక్కగా నిర్వహించబడతాయా? మా యొక్క బృందము దానిని ఆనందించగలుగుతారా? అని చింతించుచుండెను.

మధ్యలో ఆ యొక్క యాత్రలో బృంద సభ్యులుగా వెళ్లుచున్న వారిలో ఎంతో సంతోషముగా ఉంటారు. వారందరు పాటలు పాడుచు ప్రయణిస్తుంటారు. అందరు ఈ నాయకుని ఎందుకు ఆందోళనపడుతుంటావు? అని అడుగుతుంటారు? నిజమే కదా, ఈ యాత్రలో వెంబడించు వారందరు ఆనందిస్తుంటారు కదా! కనుకనే, దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ జీవితములో నూతన కార్యమును ప్రారంభిస్తున్నప్పటికిని, ఒకవేళ మీరు నూతనమైన ప్రాజెక్టును ప్రారంభించుచున్నారేమో? విద్య నిమిత్తమై మీరు ఒంటరిగా విదేశాలకు వెళ్లుచున్నారేమో? లేకపోయినట్లయితే, మీ పరిచర్యలో ఎక్కడైనను, ఒక నూతనమైన కార్యమును ప్రారంభించుచున్నారేమో? లేక కుటుంబ సమేతముగా మీరు ఒక ప్రాంతములో పనిచేయవలసి ఉన్నదేమో? నా ప్రియులారా, ప్రభువు, 'మీ నూతన అధ్యాయమును లేక మీ నూతన ప్రారంభమును నా చేతికి ఇవ్వండి, నేను దీనిని ప్రణాళిక చేస్తాను, నేను సర్వలోకమునకు రూప నిర్మాణకర్తనై యున్నాను, నేను ప్రణాళిక చేసి, మీకు శ్రేష్టమైన దానిని మీకిచ్చెదను. విచారించకండి, కేవలము మీరు నన్ను వెంబడించండి. నేను మీ కొరకు కార్యములను లోపరహితముగా జరిగించెదను, నా సంతోషముతోను, నా యొక్క సమాధానముతో మీరు బయలు వెళ్లండి అని సెలవిచ్చుచున్నాడు.' కనుకనే, మీరు సమాధానముతో ఉండండి. కాబట్టి, చింతించకండి. మీరు ఒంటరిగా మీ భారమును మోయకండి. ఆనందంతో ఆయనను వెంబడించండి మరియు ఆయన సమాధానం మిమ్మును నడిపించనివ్వండి. ఆయన తగిన కాలంలో సమస్తమును చక్కగానూ, తన సంకల్పం ప్రకారం సంపూర్ణంగానూ జరిగిస్తాడు.

అవును, నా ప్రియులారా, మన విచారములను మరియు చింతలను, భయమును, ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా దేవుని చిత్తమునకు అప్పగించెదము. మనం ఆయనను సంపూర్ణంగా విశ్వసించినప్పుడు, ఆయన ఆనందం మనకు బలమును ఇచ్చుచున్నది మరియు ఆయన సమాధానం మనలను నడిపించుచున్నది. నా ప్రియులారా, ప్రభువు, 'ఈ బాధ్యత ఇప్పుడు నాది; నా మహిమ కొరకు మేము దీనిని నెరవేరుస్తాను' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన మార్గములను తెరచుచున్నాడు, మీకు కావలసిన వాటన్నిటిని మీకు సమకూరుస్తాడు, ప్రజల దృష్టిలో మీకు అనుకూలతను కల్పిస్తాడు మరియు మీ జీవితము మీద తన అపారమైన కృపను కుమ్మరిస్తాడు. మీరు ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు, మీరు ఆయన రాజ్యం కొరకు గొప్ప కార్యములను జరిగిస్తారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మమ్మును ఆనందంతో నడిపించి, సంపూర్ణ సమాధానముతో నడిపించే దేవునికి వందనములు. ప్రభువైన యేసయ్యా, మా జీవితములను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. దేవా, ఈ రోజు, మా జీవితంలోని ప్రతి కొత్త అధ్యాయాన్ని నీ ప్రేమగల చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని, ఆందోళనను, గందరగోళమును మరియు భారమును తొలగించి, మాకు సమాధానమును అనుగ్రహించుము. దేవా, నీ యొక్క ప్రణాళికలను విశ్వసించడానికి మరియు సందేహించకుండా, నీ యొక్క నడిపింపును వెంబడించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా యెదుట ద్వారాలను తెరువుము. ప్రభువా, మేము వెళ్లుచున్న ప్రతిచోటా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క మహిమైశ్వర్యము బట్టి మా అవసరతలన్నియు తీర్చుము. యేసయ్యా, నీ యొక్క సమాధానముతోను, కృపతోను మమ్మును నింపుము. దేవా, మా యొక్క హృదయమును, మనస్సును నీ యొక్క దైవీకమైన సమాధానముతో కాపాడుము. ప్రభువా, మా జీవితమును నీ మహిమ కొరకు వాడబడునట్లుగాను మరియు నీ ప్రణాళికను విశ్వాసంగా నెరవేర్చడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.