నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును తన పరిపూర్ణమైన శాంతితో నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. అప్పుడప్పుడు వచ్చే శాంతి కాదు, అది తాత్కాలికమైన శాంతి కాదు. కానీ, అది పరిపూర్ణమైన శాంతిని మీకనుగ్రహించుచున్నాడు. అది నిత్యమైన శాంతి. ఎందుకనగా, ఆయన నిత్యుడైన తండ్రియై యున్నాడు. ఆయన సమాధానకర్తయై యున్నాడు. కనుకనే,అన్ని విషయములలో మీరు పరిపూర్ణమైన శాంతిని కలిగియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 26:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, మీ మనస్సు ఆయన మీద ఆనుకొనియున్నప్పుడు, ఆయన మిమ్మును పూర్ణశాంతిగలవారినిగా కాపాడుతాడు. మరొక అనువాదములో చూచినట్లయితే, 'మేము నీ యందు నిరీక్షణ కలిగియున్నప్పుడు, నీవు లోపరహితమైన పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించెదవని'చెప్పబడియున్నది. కనుకనే, మీరు, 'ప్రభువా, మేమియు చేయలేము, నీవే మా కొరకు సమస్తమును చేయగలవు' అని చెప్పినప్పుడు, ఆయన మీకు పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, అటుతర్వాత, మీ కళ్ల ముందు జరుగుచున్నవి మీకు కనబడనప్పటికిని, దేవుడే మాకు సమస్తమును జరిగిస్తాడు అని మీరు విశ్వసించియున్నప్పుడు, దేవుడు మీ వెకాల పనిచేస్తాడు అన్న నిరీక్షణతో మీరు ఉన్నప్పుడు, దేవుడు తన కార్యములను నిర్వర్తించడము కోసమై, మర్మయుక్తమైన విధానములో పనిచేయుచుంటారు. అవును, మీకు ఇప్పుడు అది అర్థము కాకపోవచ్చును. మీరు దానిని చూడలేకుండా పోవచ్చును. కానీ, మీరు ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు, ఆయన మీ కొరకై పనిచేస్తాడు. సమస్తమును సమాధానకరముగా ఉంటాయి. మీకు సమాధానకరముగా సమస్తమును కూడా జరిగించబడతాయి.

మొదటిగా, ఆయన మీకు దేవుని శాంతిని అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి యోబు 25:2వ వచనములో చూచినట్లయితే, "అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై యున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన ఉన్నత స్థలములలో పరసంబంధమైన స్థలములలో శాంతిని ఉత్పత్తిని చేయువాడై యున్నాడు. ఆయన పరమందు ఆసీనుడై మీ కొరకు శాంతిని సంసిద్ధము చేయుచున్నాడు. ఆ సమాధానమును మోసుకుంటూ, మన కొరకు ఈ లోకమునకు సమాధానకర్తగా వచ్చియున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 14:27వ వచనములో చూచినట్లయితే, " శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు తన శాంతిని అనుగ్రహించుచున్నాడు. కనుకనే, ఆయన మిమ్మును చూచి, 'నా బిడ్డా, నీ శాంతిని మీకిచ్చెదను, నా శాంతి మీ జీవితములో ఉన్న ప్రతివిధమైన బాధను, భయమును, విచారమును మరియు సమస్యలన్నిటిని పూర్తిగా నాశనము చేయుచున్నది. ఈ లోకము మీకు భయమును తీసుకొని వచ్చినప్పటికిని, నేను పరలోకము నుండి నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, అటువంటి దేవుడు ఇచ్చు శాంతిని ఇప్పుడే మీరు పొందుకొనండి.

నా ప్రియులారా, ఈ యొక్క శాంతి యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారా మనకు లభించుచున్నది. ఆయన మనకు దేవునితో సమాధానమును అనుగ్రహించియున్నాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:20వ వచనములో చూచినట్లయితే, "ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని యు తండ్రి అభీష్టమాయెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన త్యాగపూరితముగా సిలువలో మన కొరకు చిందించిన రక్తము ద్వారా మన జీవితములో శాంతిని తీసుకొని రావడము కొరకు క్రయధనముగా వెల చెల్లించియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, యేసుయందు నిరీక్షణను ఉంచండి. మీ జీవితమును యేసునకు సమర్పించండి. ఆయన యొక్క బిడ్డలుగా యేసు కొరకు జీవించండి. ఆయన రక్తము ద్వారా మీ పాపములను కడిగివేసి, మిమ్మును దేవునికి బిడ్డలుగా చేయుచున్నాడు. మీరు దేవుని శాంతిని ఆనందించెదరు. దేవుడు మీ కొరకు సమస్తమును జరిగించువాడై యున్నాడు.

రెండవదిగా, దేవుడు ఇచ్చు శాంతి మానవుని అవగాహన సామర్థ్యమునకు మించినది. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:6-7వ వచనములను చూచినట్లయితే, "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును '' అని చెప్పబడినట్లుగానే, దేవుని సమాధానము సమస్త జ్ఞానమునకు మించినదిగా ఉంటున్నది. ప్రతి ఆశీర్వాదము మీ యొద్దకు వచ్చుచున్నవి. కానీ, నాకు అర్థము కావడము లేదు అన్నట్టుగా మీరు భావించవచ్చును. మీరు సమాధానమును కలిగియుండడానికి దేవుడు పరలోకమందున్న ఇట్టి శాంతిని మీ కొరకు సంసిద్ధము చేయుచున్నాడు. అది పరలోకమందు నుండి ప్రత్యక్షపరచబడిన ఆశీర్వాదము. సిలువలో యేసు త్యాగము ద్వారా ఉత్పత్తి చేయబడియున్న ఆశీర్వాదము. అవి మీ యొద్దకు వచ్చుచున్నవి. అవి మీ యొక్క సమస్త జ్ఞానమునకు మించినవిగా ఉంటాయి.

నా ప్రియులారా, మీ యొక్క శ్రమలన్నిటి మధ్యలో ఇటువంటి శాంతి మీ యొద్దకు వచ్చినప్పుడు, సమస్యలు వస్తే రావచ్చును. కానీ, దుష్ట ప్రజలు మీ మధ్యలో అన్యాయమైన చెడు కార్యములను జరిగించవచ్చును. కానీ, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'నా శాంతి ప్రతివిధమైన సమస్యను జయించడానికి మీకు శక్తిని అనుగ్రహించుచున్నది. అది మీకు సమాధానకరమైన జీవితమును అనుగ్రహించుచున్నది.' అవును, నా స్నేహితులారా, ఆయన శాంతి మీ యొక్క ప్రతి శోధనను, ప్రతి కష్టాన్ని అధిగమించడానికి మిమ్మును బలపరచుచున్నది. భయానికి గురికాకుండా, దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొని మీరు విశ్వాసంతో నడిచెదరు. అంతమాత్రమే కాదు, ఆయన శాంతి మీ హృదయాన్ని కాపాడుతుంది, మీ మనస్సును భద్రంగా కాపాడుతుంది మరియు ఆయన సన్నిధితోను, ఆశీర్వాదములతోను నిండిన జీవితంలోనికి మిమ్మును నడిపిస్తుంది. కాబట్టి, ప్రియ స్నేహితులారా, యేసును సంపూర్ణంగా విశ్వసించండి, మీ మనస్సును ఆయనపై నిలిపి, మీ యొక్క ప్రతి భారమును ఆయన చేతులకు అప్పగించినప్పుడు, సమాధానకర్తయగు దేవుడు, ఈ లోకం ఇవ్వలేని మరియు తీసివేయలేని తన యొక్క నిత్యమైన శాంతితో ఈ రోజు మీ హృదయాన్ని నింపి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, మాకు నీ యొక్క శాంతిని అనుగ్రహించి, నీ యొక్క శాంతి చేత మా హృదయములోనికి ప్రవేశించుము. యేసయ్య, మేము నిన్ను ప్రేమించుచున్నాము. సమాధానకర్తవైన దేవా, మా హృదయములోను మరియు మా జీవితములోను నివసించుము. ప్రియమైన ప్రభువా, మా సమాధానకర్తయగు ప్రభువుగాను, శాశ్వతమైన తండ్రిగా నీవు ఉన్నందుకై నీకు వందనములు. యేసయ్యా, సమస్త జ్ఞానమునకు మించిన నీ పూర్ణ సమాధానముతో మా హృదయమును నింపుము. దేవా, నీవు జరిగించుచున్నావని మేము చూడలేనప్పుడు కూడా, నిన్ను పరిపూర్ణంగా నమ్ముటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో ఉన్న ప్రతి భయమును, ఆందోళనను, దుఃఖమును, గందరగోళమును, మరియు భారమును మా నుండి ఇప్పుడే తొలగించుము. దేవా, నీ పరలోక సమాధానము ప్రతిదినము మా హృదయమును, మనస్సును కాపాడునునట్లుగా చేయుము. యేసయ్య, నీ యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా, మా యొక్క సమస్త పాపముల నుండి మమ్మును శుద్ధులనుగా చేసి, నీకు అత్యంత సమీపముగా ఉండునట్లుగా మార్చుము. దేవా, నీ యొక్క వాగ్దానముల యందు మేము విశ్వాసముతో జీవించునట్లుగాను, మా యొక్క ప్రతి శోధనను, శ్రమను జయించుటకు మమ్మును బలపరచుము. ప్రభువా, మా కుటుంబములోను, మా పనిలోను మరియు మా భవిష్యత్తు మీద నీ యొక్క సమాధానము ఏలునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములను మేము అనుభవించునట్లుగా, ఎల్లప్పుడు నీ సన్నిధిలో నడుచుకొనునట్లుగాను మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.