నా ప్రియమైన స్నేహితులారా, నేటి దినమున ప్రభువు యొక్క ఆశీర్వాదమును కలిగియుండడము ఎంతో ఆశీర్వాదము. నేడు మనము కలిసి ఈ ఆశీర్వాదమును పొందుకుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ప్రసంగి 2:26వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగువానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది'' అని చెప్పబడిన ప్రకారముగా, మనము ఆయనను సంతోషపరచినప్పుడు, దేవుడు ఎంతగానో దానిని ఆనందించుచున్నాడు. అంతమాత్రమే కాదు, గొప్ప కార్యములు చేయుటకు ఆయన తన జ్ఞానమును, తన తెలివిని, ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. మనము ఆయనను సేవించుచుండగా, గొప్ప ఆనందమును మరియు సంతోషమును మన హృదయములో కలిగిస్తాడు. దేవుని ఆనందపరచినవారికి ఇట్టి ఆశీర్వాదము అనుగ్రహించబడుతుంది. వీటన్నిటితో కూడా, ఈ లోకము ఇవ్వలేని గాఢమైన ఆనందమును మరియు శాశ్వతమైన సంతోషమును ఆయన మన హృదయములలో కుమ్మరించుచున్నాడు. ఆయనను ఘనపరచే మార్గంలో నడుచువారికి పొందుకునే ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇదే.
నా ప్రియులారా, మనము ఆయనను ఎలాగున సంతోషపెట్టాలి? మీ మనస్సులో కూడా అదే ప్రశ్న ఉన్నదని నాకు తెలుసు. కనుకనే, దేవుని యొక్క వాక్యము మూడు కార్యములను గురించి చెబుతుంది. మొదటిగా, విశ్వాస ము ద్వారా మనము ఆయనను సంతోషపరచవచ్చును. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 11:6వ వచనములో చూచినట్లయితే, "విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చు వాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా'' అని చెప్పబడినట్లుగానే, విశ్వాసము ద్వారా దేవునికి సమీపస్థులము కావడము మరియు ఆయనకు ప్రార్థించే వారికి దేవుడు బహుమానము ఇస్తాడు అని విశ్వాసము ఉంచి, దేవుడు ఉన్నాడని యు, ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడనియు విశ్వసించవలెను. ఆ యొక్క విశ్వాసమును దేవుడు గొప్ప మోతాదులో ఘనపరుస్తాడు. కనుకనే, మనము ఆయన మీద సంపూర్ణ విశ్వాసమును కలిగియున్నప్పుడు, ఆయన మన ప్రార్థనలను ఆలకించి, మనకు జవాబిస్తాడని మనము నమ్మినప్పుడు, మన విశ్వాసం ఆయన హృదయమునకు ఆనందమును కలిగించుచున్నది.
రెండవదిగా, మనలో ఉన్నదానిని ప్రేమతో పంచుకోవడము ద్వారా, మనము విశ్వాసమును కలిగియుండాలి. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 13:16వ వచనములో చూచినట్లయితే, " ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి'' అని చెప్పబడినట్లుగానే, మేలు మరియు ఆతిధ్యము చేయుటకు నిర్లక్ష్యము చేయకండి. మీరు కలిగియున్నదానిని ఇతరులతో పంచుకోండి. అటువంటి త్యాగపూరితమైన అర్పణలు దేవునికి ఆనందకరములు. భౌతికముగా మేలు చేయడము మరియు మీకు కలిగినదానిని ఇతరులతో పంచుకోవడము. ఇంకను ఆధ్యాత్మికముగా మీలో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడము ద్వారా మేలు చేయడము. దేవుడు మీకు అనుగ్రహించిన వరములన్నియు త్యాగపూరితముగా వాటిని ఇతరుల కొరకు వినియోగించడము. అది దేవునిని ఆనందపరచుచున్నది.
చివరిగా, ఈ సందేశము చదువుచున్న చిన్నబిడ్డలందరితో కూడా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:20వ వచనము ద్వారా ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది'' అని చెప్పబడినట్లుగానే, పిల్లలారా మరియు యౌవనులారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది దేవునిని ఆనందపరచుచున్నది. నా ప్రియులారా, ఇది చాలా కష్టమైన పరిస్థితులలో కూడా విధేయత చూపుటలో పరిశుద్ధాత్ముడు నాకు సహాయము చేశాడు. అవును, మన తల్లిదండ్రుల అధికారమునకు లోబడుట అనునది మనకు చాలా కష్టతరముగా ఉంటుంది. మనము మన స్వంత జీవితమును జీవించుదాము అని అనుకుంటాము. అయితే, పరిశుద్ధాత్ముడు విధేయత చూపడానికి నాకు సహాయము చేశాడు. తద్వారా, దేవుడు నాకు బహుమానము ఇవ్వాలని కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నాకు సహాయము చేశాడు. నా ప్రియమైనవారలారా, ఆయన మీకును ఆలాగున చేయడానికి సహాయము చేస్తాడు. ఇట్టి కార్యముల ద్వారా ప్రభువును ఆనందపరచుటకు సమర్పించుకుందాము. అప్పుడు, దేవుని యొద్ద నుండి తెలివిని, జ్ఞానమును మరియు ఆనందమును పొందుకుందాము. అవును, తమ తల్లిదండ్రులకు విధేయత చూపాలని, ప్రభువును సంతోషపెట్టాలని కోరుకొనుచున్న ప్రతి బిడ్డకూ అదే పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. కనుకనే, మీరు చింతించకండి.
నేడు, నా ప్రియులారా, మీ విశ్వాసం, ప్రేమ, ఔదార్యమును మరియు విధేయత ద్వారా దేవునికి ఇష్టమైన జీవితమును గడపడానికి మీరు నిర్ణయించుకొనండి. మీరు ఆలాగున జీవించినప్పుడు, ఆయన మీకు జ్ఞానం, తెలివియు మరియు శాశ్వతమైన ఆనందమును అనుగ్రహించి, ఆయన మహిమ కొరకు మీ జీవితములను ఫలించునట్లుగా చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము నిన్ను ఆనందపరచుటకు వాగ్దానము చేసియుండగా, మేము నీ యందు నిరీక్షణ కలిగియుండుటకు సంపూర్ణమైన విశ్వాసమును మాకు అనుగ్రహించుము. దేవా, మేము ఎన్నటికిని నీ నుండి దూరము కాకుండా, మేము ఎల్లవేళల నీ యందు మాత్రమే నిరీక్షణను కలిగియుండునట్లుగా మాకు కృపనిమ్ము. ఆలాగే దేవా, మేము నీ పరిశుద్ధాత్మచేత నింపబడి, ఇతరులకు మేలు చేయుటకు మరియు నీవు మాకిచ్చిన వరములను ఇతరులతో పంచుకొనుటకు మాకు కృపను దయచేయుము. ప్రభువా, నీ బలమైన శక్తిని ఇతరులతో పంచుకొనుటకు నీవు మాకు సహాయము చేసి, నీవు మాకిచ్చిన తలాంతులను ఇతరులకు పంచుటకు కృపనిమ్ము. దేవా, మేము నిన్ను సంతోషపరచడానికి మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మా పిల్లలకు తల్లిదండ్రుల పట్ల విధేయత చూపగల హృదయమును అనుగ్రహించుము. దేవా, నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మరియు నీ మార్గములలో నుండి ఎన్నడును తొలగిపోకుండా ఉండుటకు మరియు హృదయమును అచంచలమైన విశ్వాసంతో నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి విషయంలో నిన్ను ఘనపరచడానికి మమ్మును నీ యొక్క విశ్వాసముతో బలపరచుము. దేవా, మా మార్గంలో ఉన్న ప్రతి ఆటంకమును తొలగించి, నీ పట్ల మేము కలిగియున్న విశ్వాసమునకు ప్రతిఫలమును దదయచేయుము. ప్రభువా, నీ మహిమ కొరకు మా జీవితము పలించునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములు మా మీద నిలిచియుండునట్లుగాను మరియు మేము చేయుచున్న ప్రతి మంచి పనిలో మమ్మును వర్థిల్లజేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


