నా ప్రియ స్నేహితులారా, మనం ఇలాగున ఉన్న ఒక చక్కటి ప్రార్థనలోనికి లోతుగా మునిగి పోవుచున్నాము. అందుకే కీర్తనాకారుడు ఈలాగున ప్రార్థించాడు, "ప్రభువును గూర్చిన నా ధ్యానము నీకు ఇంపుగా నుండును గాక'' అని చెప్పబడినట్లుగానే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 104:34వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యెహోవా యందు సంతోషించెదను'' ప్రకారము మరో మాటలో చెప్పాలంటే, ఆయన ఇలాగున అంటున్నాడు, " నేను ప్రభువునందు ఆనందించుచున్నాను మరియు ఆ ధ్యానం ప్రభువునకు ప్రీతికరమైనది'' అని చెప్పుచున్నాడు. అవును, నా ప్రియులారా, ప్రభువైన యేసు మీరు ఆందోళన చెందాలని కోరుకోవడం లేదు. కానీ, అందుకు బదులుగా ఆయన ఇలాగున అంటున్నాడు, "చింతించకు నా ప్రియ బిడ్డలారా, చింతించడం ద్వారా, మీలో నెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? ఎందుకు మీరు చింతించుచున్నారు? '' కనుకనే, మీ భారములను ప్రభువు మీద మోపండి. ఎందుకంటే, ప్రభువైన యేసు, మీరు చింతించకూడదని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. ఇది యేసు క్రీస్తు యొక్క హృదయమై యున్నది: "నా పిల్లలు చింతించకూడదు. ఎల్లప్పుడు, నేను మంచి దేవుడను అనియు, నేను వారి రక్షకుడనియు, నేను వారితో ఉన్న దేవుడనియు మరియు నేను అభిషిక్తుడనియు, నేను నా పిల్లలకు సమృద్ధిని కలిగిస్తాను'' అని చెబుతు," నా పిల్లలు నా యందు ఆనందించాలి. నా పిల్లలు దీనిని గ్రహించాలి'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నేడు మీరు దేనిని గురించి చింతించకండి.

నా ప్రియులారా, ఈ ప్రేమగల ప్రభువైన యేసును మీరు గుర్తించి, ఆయన యందు మీరు ఆనందించినప్పుడు, ఆయనను ధ్యానించడం ఆయన దృష్టిలో ఇంపుగా మారుతుంది. కనుకనే, నేడు మీరు దీనిని ఎలా చేయగలరు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 49:3 వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " నా హృదయధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై యుండును '' ప్రకారము మీరు దేవుని మంచితనాన్ని ధ్యానించి ఆనందించినప్పుడు, అది మీకు వివేకమును కలిగిస్తుంది మరియు మీరు ఏ మార్గంలో వెళ్ళాలో మీకు చూపుతుంది. మీరు ఆయన యందు ఆనందించుచు,ప్రభువును స్తుతించినప్పుడు మీలోనికి పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మును పైకి లేవనెత్తి, ఆయన మిమ్మల్ని దేవుని ఉద్దేశములోనికి నడిపిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 19:14 వ వచనములో చూచినట్లయితే, " యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక'' ప్రకారము మీరు ప్రభువును గూర్చి ధ్యానించి, ఆయన యందు ఆనందించినప్పుడు, మీ నోటి మాటలు ఇంపుగా బయలుపరచబడతాయి మరియు దేవుడు మీ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. అనేకసార్లు మనం, 'నాకు ఎలాగున ప్రార్థించాలో తెలియదు' అని అంటుంటాము. అయితే, మనం మన ఫిర్యాదులను, సణుగుడులను, మూలుగులను కుమ్మరిస్తాము. ఇంకను మనం దేవుని ప్రశ్నిస్తాము. కానీ, మనం ఆయన మంచితనాన్ని ధ్యానించి, ఆయనయందు ఆనందించినప్పుడు, దేవుని ప్రణాళికను మోయు మాటలు మన నోటిలోనికి వస్తాయి మరియు ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు.

అందుకే బైబిల్ నుండి యెహోషువ 1:8వ వచనములో చూచినట్లయితే, "ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు'' అని చెప్పబడిన ప్రకారము దివారాత్రము మీరు దేవుని గూర్చి ధ్యానించినప్పుడు, మీ మార్గము వర్థిల్లుతుంది. ఆ తరువాత, యెహోషువ 1:9వ వచనములో తెలియజేయబడినట్లుగానే, "నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తారు, మీరు బలమును పొందుకొని, ధైర్యవంతులవుతారు మరియు మీరు ఎక్కడికి వెళ్లినా దేవుడు మీతో కూడా ఉంటాడు. కనుకనే, బైబిల్ నుండి ఆదికాండము 24:63వ వచనములో చూచినట్లయితే, " సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను'' ప్రకారముగా, ఇస్సాకు తనకు ఒక భార్య కొరకు ఎదురు చూసినప్పుడు, ఇస్సాకు తన జీవితము పట్ల దేవుని యొక్క ప్రణాళిలను తలంచుకొనుచూ, ప్రార్థించు చున్నప్పుడు, తనకు తగిన భార్యను దేవుడు సమకూర్చుతాడని ఆనందించుచుండెను. ఆలాగుననే, దేవుడు ఇస్సాకు తగిన భార్యను చూపించెను. అవును, నా ప్రియులారా, దేవుని మంచితనాన్ని ధ్యానము చేయుచూ, ఆయన యందు ఆనందించండి మరియు ఆయన వాక్యాన్ని క్రమము తప్పకుండా చదువుటలో మీరు సంతోషించినప్పుడు, దేవుని వాక్యం మీ నోటి నుండి బయలు వెడలుతుంది, మీ ప్రార్థన వృద్ధిపొందుతుంది మరియు మీ ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి వస్తుంది. అంతమాత్రమే కాదు, మీ హృదయం మండుతుంది, మరియు మీరు మీ నాలుకతో మాట్లాడతారు, అందుకే బైబిల్ నుండి కీర్తనలు 39:3వ వచనములో చూచినట్లయితే, " నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంటపుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని'' అని చెప్పబడినట్లుగానే, మీరు ప్రభువు ముందు ధ్యానం చేయుచున్నప్పుడు, మీకు తప్పకుండా జవాబు వస్తుంది. కనుకనే, మీరు ఆయనయందు ఆనందించినప్పుడు, ఆయనను గూర్చి, ధ్యానించినప్పుడు, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా ప్రార్థన మరియు నీ యొక్క వాగ్దానముల యందు ధ్యానం చేయుట ద్వారా ఎల్లప్పుడూ నీకు ఇంపుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా చింతలన్నింటిని నీ పాదాల మీద మోపుచున్నాము. దేవా, నీవు మంచితనమును గలవాడవనియు, నీవు మా రక్షకుడవు, మా ప్రదాతవనియు మరియు ఆపత్కాలములలో మాకు ఎల్లప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ వాక్యమును దివారాత్రములు ధ్యానించి, నీ సత్యంలో విశ్రాంతి తీసుకోవడానికి మాకు నేర్పించుము. దేవా, మమ్మును సరైన మార్గంలో నడిపించడానికి నీవు నమ్మదగినవాడవనియు, మేము నీ యందు నమ్మికయుంచుచున్నాము. ప్రభువా, మా హృదయం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆనందించునట్లుగా చేయుము. పరిశుద్ధాత్మా, మా మనస్సును నీ మంచితనం యొక్క తలంపులతో నింపుము మరియు మా నోటి ద్వారా నిన్ను సంతోషపరచే మాటలతో నింపుము. దేవా, మా ప్రార్థనలు నీకు ఫిర్యాదు చేయునట్లుగాను లేదా నీకు భయపడు హృదయం నుండి కాకుండా, మా ప్రార్థనలు నీకు అంగీకారముగాను మరియు కృతజ్ఞతగల హృదయం నుండి బయలుపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, మా ప్రార్థన నీవు విన్నందుకై నీకు వందనాలు, మాకు సమీపముగా ఉన్నందుకు మరియు నీ పరిపూర్ణతలో నుండి మాకు జవాబు ఇచ్చినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.