నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:14 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను'' ప్రకారం దేవుడు మిమ్మును ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. అవును, మీరు వీటన్నిటిని మీద అత్యధికమైన విజయం సాధిస్తారు. కాబట్టి భయపడకండి. మీ జీవితం ఆనందంతో నింపబడి ఉంటుంది. మీ జీవితం విజయవంతమైన ఆశీర్వాదాలుగా నిండియున్న జీవితంగా ఉండబోవుచున్నది మరియు మీ జీవితం ఆశీర్వాదం యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉండబోవుచున్నది. నేను ఈ ఆశీర్వాదాన్ని యేసు నామంలో మీకు ప్రకటించుచున్నాను. ప్రభువులో ఈ ఆనందాన్ని మీరు ఎలా పొందుకుంటారు? బైబిల్ నుండి లూకా 15:7వ వచనమును చూచినట్లయితే, " అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును'' మరియు లూకా 15:10వ వచనములో ఇలా చెప్పబడియున్నది, "అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను'' ప్రకారం మీరు మీ పాపాల నిమిత్తము పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొందిన వారుగా యేసు వైపు తిరిగినప్పుడు, పరలోకంలో మిక్కిలి సంతోషము కలుగుతుంది. కనుకనే, అటువంటి గొప్ప ఆనందం మీ హృదయాన్ని నింపుతుంది. నా ప్రియులారా, ఈ రోజు, మీకు మరియు యేసుకు మధ్య ఏమున్నను సరే, ఆయన సన్నిధిలోనికి వచ్చి, 'యేసుప్రభువును క్షమించమని' అడగినప్పుడు, మీకు కుటుంబంలో లేదా ఎవరితోనైనా, ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే, వారితో సమాధానపడి, వారిని క్షమించండి. అప్పుడు యేసుక్రీస్తు, సెలవిచ్చినట్లుగానే, ఎవరైనా మీ ఆస్తులను అన్యాయంగా తీసుకున్నట్లయితే, దానిని వారికి మరల ఇవ్వండి. దేవుడు దానిని మీకు రెండింతలు తిరిగి ఇస్తాడు. ప్రజలు మీ యొద్ద నుండి ఏమి తీసుకున్నారో వాటిని వారి యొద్దనే విడిచిపెట్టి, తిరిగి మీ జీవితాన్ని ప్రభువులో నూతనంగా ప్రారంభించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్థిల్లింపజేస్తాడు.
ఒక వ్యక్తి ఒక టెలివిజన్ కంపెనీ నడుపుతున్న మరొక వ్యక్తిని మోసం చేశాడు మరియు ఆ వ్యక్తి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. నాకు వేరే మార్గం లేదు. అలాంటి పరిస్థితిలో, ఎవరో అతనిని నా తండ్రి డి.జి.యస్. దినకరన్‌గారి యొద్దకు తీసుకువచ్చారు. నా తండ్రి ప్రార్థించారు. అప్పుడు దేవుడు మా తండ్రిగారితో ఈలాగున తెలియజేసెను, " అతను కోల్పోయిన వాటిని విడిచిపెట్టమని అడుగు. వెళ్లి మరొక టెలివిజన్ కంపెనీని ప్రారంభించమని చెప్పు. నేను అతనిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాను '' అని తెలియజేసెను. వెంటనే, మా తండ్రిగారు ఆలాగుననే, అతనికి తెలియజేసినప్పుడు, అతను ్రకైస్తవుడు కాదు, కానీ, మా తండ్రి చెప్పిన మాటల ద్వారా ప్రభువైన యేసుకు విధేయత చూపాడు మరియు అతను ఒక నూతన టెలివిజన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు. దేవుడు దానిని ఎనిమిది రెట్లు ఆశీర్వదించాడు. తద్వారా, అతను ఎంతో ఐశ్వర్యవంతుడయ్యాడు. అతను ఒక బ్యాంకు డైరెక్టర్ అయ్యాడు మరియు అదే వ్యక్తి కారుణ్య సంస్థను నిర్మించడానికి, ఆ బ్యాంకు నుండి మొదటి ఋణమును పొందడానికి నా తండ్రికి సహాయం చేశాడు.
నా ప్రియమైన వారలారా, ఆలాగుననే, దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. ఆయనలో మీరు ఆనందాన్ని అనుభవించేలా చేస్తాడు మరియు మీరు పశ్చాత్తాపపడి దేవుని వాక్యాన్ని విని ఆయన మీ నుండి కోరుకునేది జరిగించినప్పుడు భూమి యొక్క ఉన్నతమైన స్థలములలో ప్రయాణించడానికి ఆయన మీకు కృపను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ ఆశీర్వాదం నేడు మీ మీద ఉండాలని నేను ప్రార్థించుచున్నాను మరియు దేవుడు మీ నష్టాలన్నిటి నుండి అధిగమించి విజయాన్ని పొందుకొనునట్లుగా చేయాలని నేను ప్రార్థించుచున్నాను. నా ప్రియులారా, నేడు మీరు కూడా దేవునికి మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ యందు ఆనందించి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఉన్నత స్థలమునకు ఎక్కించి, మీరు కోల్పోయిన దానిని మీకు రెండంతలుగా అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీతో పవిత్రమైన ఆనందాన్ని అనుభవించునట్లుగా చేస్తాననియు మరియు భూమి యొక్క ఉన్నత స్థలములపై విజయంతో ప్రయాణించునట్లుగా చేస్తానని నీవు చేసిన వాగ్దానానికై నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఇప్పుడు కూడా, ప్రభువైన యేసు, మా మరియు మా ప్రియుల యొక్క ప్రతి పాపాన్ని క్షమించమని మరియు మాకు మరియు నీకు మధ్య ఉన్న ప్రతి ఆటంకమును తొలగించమని మేము పశ్చాత్తాపపడిన హృదయంతో నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని పరలోక ఆనందంతో నింపుము. ప్రభువా, మా జీవితంలో నష్టాలు ఉన్న చోట, దయచేసి పునరుద్ధరణను తీసుకురమ్ము. దేవా, బాధ మరియు నొప్పి ఉన్న చోట, స్వస్థతను తీసుకురమ్ము. ప్రభువా, భయం ఉన్న చోట, ధైర్యం తీసుకురమ్ము. దేవా, మా జీవితం నీ యొక్క దైవీక ఆనందం, విజయం మరియు మీ సమృద్ధియైన ఆశీర్వాదాలతో నింపబడి ఉండునట్లుగా చేసి మమ్మును దీవించుమని సమస్తు స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.