నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 26:12వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు" అని చెప్పబడినట్లుగానే, ఈ వచనములో, దేవుని ప్రజలు పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది. వారు దేవునికి సమస్త మహిమను చెల్లించియున్నారు. అవును, 'మాకు సమాధానమును ఇచ్చినటువంటి దేవుడవు నీవే' అని వారు పాడియున్నారు. ఆ మునుపటి వచనమైన యెషయా 26:11లో చూచినట్లయితే, "యెహోవా, నీ హస్తమెత్తబడియున్నది గాని జనులు దాని చూడనొల్లరు జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును" అని వ్రాయబడిన ప్రకారము పశ్చాత్తాపము లేనటువంటి శత్రువులను గురించి వారు ఈ విధంగా పాడియున్నారు. దేవుడు తన ప్రజలకు చేసిన అద్భుతములన్నిటిని చూచిన తర్వాత కూడా శత్రువులు దేవుని వైపు తిరగలేదు. అందుకనే, అటువంటి ప్రార్థనను వారు చేసియున్నారు. అయితే, దేవుడు తన ప్రజల కొరకు తానే యుద్ధములన్నిటిని పోరాడెను. దేవుడు వారి కొరకు సమాధానమును స్థిరపరచెను. అవును, నా ప్రియులారా, మనము యుద్ధములను ఎదుర్కొన్న ప్రతిసారి కూడా ప్రభువే మన యుద్ధములన్నిటిని పోరాడుతాడు అని నమ్మాలి. అంతమాత్రమే కాదు, అన్నిటిని ప్రభువు హస్తములకు సమర్పించుకోవాలి. 'ప్రభువా, నీవే మా పక్షమున ఉండి పోరాడుము' అని ధైర్యముగా చెప్పాలి. అప్పుడు ఆయన మన కొరకు సమస్తమును చక్కగా జరిగిస్తాడు.
ప్రభువు ఎలా పోరాడవలెనని ఎరిగియున్నాడు? ఆ విధంగానే, దావీదు భక్తుడు కూడా ప్రార్థించియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 57:2 వ వచనములో చూచినట్లయితే, " మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱపెట్టుచున్నాను" అని చెప్పబడినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, ఆయనే మిమ్మును రక్షించువాడు. కనుకనే, మీ యుద్దములను మీరు పోరాడనవసరము లేదు. 'దేవా, నీవే మా కార్యములన్నిటిని సఫలము చేయబోవుచున్నావు' అని ఆయనకు మీరు వందనములు చెల్లించవలెను. బైబిల్‌లో మార్త, మరియ, చనిపోయిన తన సహోదరుడైన లాజరును గురించి విలపించుచున్నప్పుడు, యేసయ్య అక్కడకు వారి యొద్దకు వెళ్లాడు. ఇంకను ఆయన, వారితో కూడా కూర్చుని విలపించాడు. అయితే, లాజరును యేసయ్య, తిరిగి సజీవంగా లేపియున్నాడు. సాతాను మరియ, మార్తల యొక్క జీవితములను కూడా అంతము చేయాలని తలంచెను. ఇంకను వారి జీవితములలోనికి అంధకారము తీసుకొని రావలెనని భావించాడు. కానీ, యేసయ్య, ఈ కుటుంబమును ఎంతగానో ప్రేమించుచున్నాడు కనుకనే, అపవాది యేసుక్రీస్తును కూడా నలుగగొట్టవలెనని తలంచెను. అయితే, యేసుప్రభువు వారి మధ్యలోనికి వచ్చియున్నాడు. మార్త, మరియలను చూచి, ఆయన బాధపడి, విలపించినప్పటికిని, యేసయ్య, లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్లి, ఆయన మరల లాజరును బ్రతికింపజేసియున్నాడు. శత్రువు వారి జీవితాలలోనికి చీకటిని, దుఃఖమును, నాశనమును తీసుకురావాలనియు మరియు యేసును అణచివేయాలని కూడా కోరుకొనెను. అయితే, మార్త, మరియలకు కూడా యేసయ్య, సమాధానమును తీసుకొనివచ్చాడు.
నా ప్రియ స్నేహితులారా, మార్త మరియలు అనుభూతి చెందినటువంటి అదే దుఃఖమును ఒకవేళ మీరు కూడా అనుభవించుచుండవచ్చును. అయితే, యేసయ్య మీ పక్షమున కార్యమును సఫలము చేస్తాడు. ఆయన మీకు ఆదరణను కలుగజేస్తాడు. ఆయనే మీ పక్షమున ఉండి మీ యుద్ధములో పోరాడుతాడు. ఆలాగుననే, నా జీవితములో నేను ఎంతో దుఃఖమును ఎదుర్కొనియున్నాను. నా కుటుంబములో నాకు ఎంతో ప్రియులనుగా ఉన్న వారిని నేను కోల్పోయాను. అయితే, ప్రభువు తన ఆత్మతో నన్ను నింపియున్నాడు. లక్షలాది మంది కన్నీటిని ఈ రోజు తుడిచివేయుటకు ప్రభువు నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఇంకను అనేకమందికి దీవెనకరముగా, ప్రభువు ఈ రోజు నన్ను తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. నేడు ప్రభువు నా జీవితమును మరల కట్టియున్నాడు. రెండంతల దీవెనలతో ప్రభువు నన్ను ఆశీర్వదించియున్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, మీ కొరకు కూడా సమస్త కార్యములను సఫలపరుస్తాడు. మీ జీవితములో సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగును. కనుకనే, ఈ రోజు మీరు మీ పోరాటాల మధ్యలో ఒంటరిగా విలపించుచున్నారేమో? అయితే, మీరు ఆదరించబడతారు. అందుకే, 'దుఃఖపడు వారందరు ధన్యులు' అని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగానే, మీ కుటుంబములో ఒకవేళ పోరాటములు ఉండవచ్చును, మీ కుటుంబములో విభజనలు మరియు మనస్పర్థలు కలుగుచుండవచ్చును. అందును బట్టి మీ కుటుంబములో మీరు సమాధానమును కోల్పోయి ఉండవచ్చును? అయితే, ప్రభువు ఈ రోజు మీ కుటుంబములో సమాధానమును స్థిరపరచబోవుచున్నాడు. నేడు ప్రతి కుటుంబముపై సమాధానమును నేను ప్రకటించుచున్నాను. నా ప్రియులారా, ప్రభువు వాగ్దానము చేసిన రీతిగానే, నిశ్చయముగా, ఆయన జరిగిస్తాడు. ఇక విభజనలు ఉండనే ఉండవు, ఇక పోరాటాలు ఉండవు మరియు ఇక ఎన్నటికిని దుఃఖము మీ కుటుంబములో ఉండదు. ప్రభువు మీ పక్షమున పోరాడతాడు. ప్రభువు మీ శత్రువుల యెదుట మిమ్మును లేవనెత్తుతాడు. మీ మధ్యలో ఆయనే సమాధానమును స్థిరపరుస్తాడు. ప్రభువు మీ పక్షమున నిలబడతాడు, మీ శత్రువులకు విరోధంగా తన హస్తాన్ని మీమీదికి పంపించి, మిమ్మును సమాధానపరుస్తాడు. అప్పుడు, 'మీరు, ప్రభువు మా కొరకు సమస్తమును నెరవేర్చియున్నాడు'' అని ప్రకటిస్తారు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనము. ప్రియమైన తండ్రీ, నీ వాగ్దానము చొప్పున మా జీవితములో ఉన్న విభజనలు, దుఃఖమును మరియు మనస్పర్థలన్నిటిని తొలగించుము. ప్రభువా, మా కుటుంబములో గొడవలు ఉండకుండా చేయుము. దేవా, మా కుటుంబమునకు ఐక్యత మరియు సమాధానమును అనుగ్రహించి, మా దుఃఖమును సంతోషముగా మార్చుము. యేసయ్యా, నీ యొక్క ప్రేమను మా కుటుంబములోను మరియు మా ప్రియులైన వారి మీద కుమ్మరించుము. దేవా, విడిపోయిన మా కుటుంబములలో ఇక ఎన్నటికిని విభజన ఉండకుండా, మరల మమ్మును నీ యొక్క ప్రేమ ద్వారా ఐక్యపరచుము. ప్రభువా, మా పక్షమున పోరాడి, మా జీవితంలోకి సమాధానమును వచ్చునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి పోరాటమును, ప్రతి భారమును, ప్రతి దుఃఖమును నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, మా పక్షమున నిలువబడి, మా కొరకు సమస్తమును జరిగించుము. దేవా, మేము బలహీనంగా ఉన్నప్పుడు, మాకు బలముగా ఉండి, మేము కలవరపడినప్పుడు, మాకు సమాధానముగా ఉండి, మా జీవితం నుండి, మా కుటుంబం నుండి ప్రతి విభజనను, బాధను, అశాంతిని తొలగించుము. దేవా, మేము కోల్పోయిన దానిని మరల రెండంతలుగా తిరిగి మాకు అనుగ్రహించుము. ప్రభువా, సమస్తమును నీ ఆధీనములోనే ఉందనే నీ యొక్క గొప్ప ఆదరణను మాకిచ్చి, భరోసాతో మమ్మును నింపుము. దేవా, మా కొరకు నీవు సమస్తమును నెరవేర్చగలవు అని చెప్పడానికి మా జీవితం ఒక సాక్ష్యంగా మారునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


