నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువుతో ఉండి, ఆయన ఆశీర్వాదాలను పొందుకొనడము ఎంతో సంతోషముగా ఉన్నది. ఆయన ఆశీర్వాదాలను మనము కలిసి స్వీకరించనైయున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:148వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, ‘‘నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకొందును’’ అని చెప్పబడిన ప్రకారము ఈ కీర్తనకారుని యొక్క ఆకాంక్షను చూడండి. అతడు ఎంత మెళకువగా ఉండి, వాగ్దానములను ధ్యానించుటకు ఎదురు చూచుచున్నాడని చూడండి. ఆయన వాగ్దానములు అతి శ్రేష్టమైనవి. వేచి యుండుటకు యోగ్యమైనవి. మేము చిన్న బిడ్డలుగా ఉండియున్నప్పుడు, ఒక కుటుంబములో తమ బిడ్డలను విడిచిపెట్టి, తల్లిదండ్రులైన వారు ఒక ట్రిప్ కొరకు వెళ్లవలసి ఉండెను. బిడ్డలైతే, అమ్మనాన్న మేము మిమ్మును విడిచిపెట్టి ఉండలేము. కనుకనే, మేము మీతో కూడా వచ్చేస్తాము అని చెప్పారు. అయితే, ఆ తల్లిదండ్రులు మీకు పరీక్షలు ఉన్నాయి, మీరు బంధువులతో కూడానే ఉండి ఆ పరీక్షలు వ్రాయాలి అని తమ తల్లిదండ్రులు చెప్పారు. అయితే, సరే, మీరు మాకు బహుమానములు, బొమ్మలు తీసుకొని వచ్చినట్లయితే, మేము ఆలాగుననే బంధువులతో ఉండి పరీక్షలు వ్రాస్తాము అని వారు చెప్పారు. తల్లిదండ్రులు  సరే, అని చెప్పారు. ఆలాగైతే, మీరు ఖచ్చితముగా బొమ్మలు తీసుకొని వస్తామని మీరు మాకు వాగ్దానము చేస్తారా? సరే, సరే, మేము మీకు వాగ్దానము చేయుచున్నాము. మేము ఖచ్చితముగా తీసుకొని వస్తాము. మీరు వెళ్లి, చక్కగా చదువుకోండి అని చెప్పారు.

ఆలాగుననే, తల్లిదండ్రులు తిరిగి వచ్చిన మరుక్షణము ఈ బిడ్డలు ఆ తల్లిదండ్రులను చూడగానే, పరుగెత్తుకొని వారి యొద్దకు వెళ్లి, తమ కోసము ఏమి బొమ్మలు, ఏయే బహుమానములను కొనుక్కొని వచ్చారని వారు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి, వారు ఇచ్చిన మాటలను నిలుపుకున్నారు. బహుమానములన్నియు కొనుక్కొని తీసుకొని వచ్చారు అని వీరికి తెలియజేశారు. వాటిలో రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు మరియు చాక్లెట్లు, ఇంకను రకరకాల వస్త్రములన్నియు వారికి చూపించారు. ఒక బహుమానము కాదు, ఎన్నో బహుమానములు వారు తమ పిల్లలకు తీసుకొని వచ్చారు. అవును, ప్రభువు ఈ రీతిగా తన వాగ్దానములను మన కొరకు ఘనపరచువాడై యున్నాడు. ఆయన అత్యంత సమృద్ధిగా ఇచ్చువాడు. ఆయన మాటను నెరవేర్చుకొనేవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆలాగుననే, మా తాతగారి జీవితములో దేవుడు తన మాటను నెరవేర్చాడు. ప్రభువు మా తాతయ్యగారిని సంపూర్ణకాల సేవా పరిచర్య కొరకు పిలిచియున్నప్పుడు, బ్యాంకు ఉద్యోగిగా పనిచేయుచూ, సాయంకాలపు వేళలలో సేవా పరిచర్యను జరిగించేవారు. బ్యాంకు ఉద్యోగమును విడిచి, సంపూర్ణంగా సేవాపరిచర్యలోనికి రావడానికి మా తాతగారు వెనుకంజ వేయుచున్న సమయములో దేవుడు ఆయనను ఆ రీతిగా పిలిచియున్నాడు. ప్రభువు మా తాతగారిని పిలిచినప్పుడు, అతను తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా పరిచర్యలోనికి రావడానికి ఎంతగానో సంకోచించారు. 

అయితే, ప్రభువు ఆయనగారికి ఆ సందర్భములో దైవీకమైన అనుభూతిని అనుగ్రహించాడు. ప్రభువు ముఖాముఖిగా ఏమని అడిగారంటే, ‘నేను వెళ్లు చోటనెల్లను నేను నీతో కూడా వస్తానంటే, నీవు నాకు సేవ చేస్తావా?’ అని అడిగాడు. అందుకు మా తాతయ్యగారు, ‘అవును, అలాగే ప్రభువా, నేను చేస్తాను ’ అని చెప్పారు. కనుకనే, ప్రభువు ఒక గ్రంథపు చుట్టను తీసుకొని, దాని మీద, ‘దినకరన్ అను నీవు వెళ్లు ప్రతి చోటనెల్లను యేసు అను నేను వస్తాను’ అని వ్రాసి, దాని మీద ఆయన పేరును సంతకము చేసియున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, ఈ  రోజు వరకు ప్రభువు తరముల వెంబడి తరములు ఆ వాగ్దానమును నెరవేర్చుచువస్తున్నాడు. ఈ కారణము చేతనే, ఈ సేవా పరిచర్యలో ఎన్నో అద్భుతకార్యములు జరుగుచున్నవి. ఆయన మమ్మును తన సన్నిధిలోను మరియు సమీపముగా ఉంచుకొనియున్నాడు. ఆయన సేవ కొరకై ద్వారములు తెరచియున్నాడు. మేము నిలిచియున్నప్పుడల్లా కూడా మా పక్షమున యేసు తనను తాను బయలుపరచుకుంటున్నాడు. ఎందుకంటే, ఆయన నమ్మదగినవానిగా ఉన్నాడు. దేవుని తన యొక్క వాక్యములో నుండి ప్రతిరోజు మీకు బయలుపరచుచున్న వాగ్దానములను ఆయన నెరవేర్చుచున్నాడు. ఆయన వాగ్దానముల కొరకై ఆయన ఆశ కలిగియుండే విధానము కొరకై మనము ఆయనను అడుగుదామా?  ఆలాగుననే, ప్రతి రోజు ఆయన మనతో వచ్చునట్లుగా కోరుకుందామా? ప్రతిరోజు మనము ఆయన వాక్యమును మనము ధ్యానించి, దేవుని దీవెనలను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు వాగ్దానములను నెరవేర్చు దేవుడవు. దేవా, నీ యొక్క వాగ్దానములు శక్తివంతమైనవి. ప్రభువా,నీవిచ్చు ప్రతి వాగ్దానము మా జీవితమును మార్చునట్లుగా చేయుము. దేవా, నీవు అత్యంత సమృద్ధిగా మమ్మును ఆశీర్వదించగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ వాగ్దానములను ఆలకించుటకు ఆపేక్షగల హృదయమును మాకు అనుగ్రహించుము. దేవా, పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదవడానికి, దానిని అంగీకరించడానికి మాకు అటువంటి జీవితమును దయచేయుము. ప్రభువా, మేము నీ వాక్యమును ధ్యానించుటకు కూర్చున్నప్పుడు, మా కన్నులను మరియు చెవులను తెరవజేయుము మరియు నీ వాగ్దానముల యొక్క మర్మములను మాకు బయలుపరచి, నీవు వ్యక్తిగతంగా మాతో మాట్లాడుము. దేవా, నీ యొక్క బలమైన హస్తముతో మమ్మును నీ వాగ్దానముల ద్వారా బలపరచి, నీ వాగ్దానములను మా జీవితములో నెరవేరునట్లుగా కృపను చూపించుము. ప్రభువా, నీవు నీ వాక్యం ద్వారా మమ్మును నడిపించుచున్నప్పుడు నీ సన్నిధిని మేము అనుభూతి చెందునట్లుగా కృపనిమ్ము.  దేవా, మా జీవితంలో నీవు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరునట్లుగాను, మేము ప్రతిరోజు నీ వాగ్దానాల కొరకు ఆకాంక్ష మరియు నిరీక్షణతో ఎదురు చూచునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, ఈ రోజు మేము నీ నుండి ఆ వాగ్దానమును పొందుకొనే హృదయాన్ని మాకు ఇమ్ము. దేవా, మేము నీకు నమ్మకంగా మరియు యథార్థంగాను జీవించుటకు సహాయము చేయుము. ప్రభువా, ప్రతిరోజు నీ వాగ్దానముల కొరకు ఎదురు చూచునట్లుగాను, అటువంటి ఆకాంక్షగల హృదయమును మేము అంగీకరించుటకు కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.