నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 62:5వ వచనమును మీ కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును'' ప్రకారము ఈ వచనము ఏమని చెబుతుందనగా, మీరు విడవబడినవారుగా ఉండియున్నప్పుడు, లేక మీ స్వాస్థ్య స్థలమంతయు నిర్జనమైన సమయమును గురించి మాట్లాడబడెను. అయినప్పటికిని, ఆ సమయములలోనే దేవుడు మీ యందు ఆనందించుచున్నాడు అనియు, ఇంకను ఆయన సమస్తమును మీకు మరల అనుగ్రహించుననియు చెప్పబడియున్నది. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.

అవును, నా ప్రియులారా, మనము కోల్పోయినవన్నియు దేవుడు మరల మనకు అనుగ్రహించుచున్నాడు. నేడు మనము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి అనుగ్రహించు దేవుని మనము కలిగియున్నాము. బైబిల్‌లో యోబు యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథము ఈలాగున చెబుతుంది, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు, అతడు కోల్పోయిన సమస్తమును దేవుడు అతనికి రెండింతలుగా తిరిగి అనుగ్రహించినట్లుగా అక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆలాగుననే, నా ప్రియులారా, ప్రభువు నేడు మీకును అదేవిధముగా జరిగించును గాక.

నా ప్రియులారా, నేడు సమస్తమును మీ జీవితములో ఆశీర్వాదకరముగా ఉండును గాక. మీరు ఇతరుల కొరకు చేయు కార్యములను వర్థిల్లింపజేయును గాక. ఎందుకనగా, సకల ఆశీర్వాదములకు కర్తయైన దేవుడు మీలో ఉండి ఉన్నాడు. కనుకనే, ఆయనకు ఇప్పుడే వందనములు చెల్లించండి. సకల ఆశీర్వాదములను కలిగియున్న దేవుడు నాలోను మరియు నాతోను కూడా ఉన్నాడు అని ఆయనతో చెప్పండి. యేసు యొక్క సంపూర్ణతను బట్టి కృప వెంబడి కృపను మనము స్వీకరించుచున్నాము. మరొక అనువాదములో చూచినట్లయితే, 'ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము' అని చెప్పబడియున్నది. అందుచేతనే, బైబిల్‌లో కీర్తనలు 115:14వ వచనములో చూచినట్లయితే, "యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును'' అని చెప్పబడినట్లుగానే, నిశ్చయముగా ఆయన మీకును మరియు మీ బిడ్డలకును ఆలాగున జరిగించును గాక.

రూర్కెలా నుండి సహోదరి అనిమా యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. ఆమె ఇలాగున తెలియజేసియున్నారు, 'నేను బాల్యము నుండి ఒక సాధారణమైన విధ్యార్థిగానే ఉన్నాను. ఆ సమయములో మా తల్లిదండ్రులు నన్ను యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకములో సభ్యురాలినిగా చేర్పించారు. దేవుడు నా విద్యాభ్యాసమును ఆశీర్వదించియున్నాడు. నేను 10 మరియు 12వ తరగతులలో మొదటి దశలో ఉత్తీర్ణురాలైయ్యాను. ఉన్నతమైన విద్య కొరకు నేను వెళ్లియున్నప్పుడు, దేవుడు నా పట్ల కృపాసహితముగా ఉండి యున్నాడు. రూర్కెలా ప్రార్థనా గోపురములో నేను యూటర్న్ కార్యక్రమమునకు పాల్గొన్నప్పుడు, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఉద్యోగ ఆశీర్వాద పధకములో నేను నా పేరును నమోదు చేసుకున్నాను. దేవుడు నాకు రెవిన్యూ విభాగములో ప్రభుత్వ శాఖలో ఉద్యోగమును అనుగ్రహించియున్నాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా! దేవుడు నేడు మీ జీవితమును నిర్మాణము చేయును. నా ప్రియులారా, నేడు మీ జీవితములో ఉన్న నిర్జనమైన స్థితిని ఆయన తొలగించివేస్తాడు. ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదములతో మిమ్మును స్థిరపరచును. కనుకనే, నేడు మీ హృదయఈమును కలవరపడనీయకండి. ప్రభువు మీ యందు ఆనందించువాడై యున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క మార్పులేని ప్రేమకు మరియు విఫలం కాని వాగ్దానాలకు ధన్యవాదాలు. నిర్జనమైన సమయాలలో కూడా, నీవు మమ్మును గూర్చి ఆనందిస్తావు మరియు మమ్మును ఎన్నటికిని విడిచిపెట్టకుండా కాపాడుము. ప్రభువా, నీవు పునరుద్ధరించే దేవుడవు కనుకనే, నీవు కోల్పోయినవన్నియు తిరిగి అనుగ్రహించి మరియు మా జీవితములో ఉన్న ప్రతి దుఃఖాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవా, యోబు పట్ల నీవు చేసినట్లుగానే, నీవు మా కొరకు జరిగిస్తావని నమ్ముతూ మేము నీ వాక్యాన్ని పట్టుకొని జీవించునట్లుగా నీ కృపను దయచేయుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును వృద్ధి పొందించునట్లుగా చేయుము మరియు ఇతరుల కొరకు మేము చేయుచున్న ప్రతిదానిని నీ కృపతో విస్తరింపజేయాలి. యేసయ్యా, నీవు సకల ఆశీర్వాదాలతో నింపబడునట్లుగా చేయుము. దేవా, మేము నీ యొక్క కృప వెంబడి కృపను పొందుకొనునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీవు మా జీవితాన్ని నిర్మిస్తావు మరియు నీ పరిపూర్ణ ప్రణాళికలో మమ్మును స్థిరపరుస్తావు అనే వాగ్దానములో మేము విశ్రాంతి పొందుకొనునట్లుగా కృపను దయచేయుము. దేవా, పదోన్నతి వెంబడి పదోన్నతిని మాకు దయచేయుము. ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా మా కుటుంబ సభ్యుల కొరకు సమస్తమును సంపూర్ణముగా చేయునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము మరియు మా కుటుంబ సభ్యులు కోల్పోయిన సమస్తమును తిరిగి పొందుకొనునట్లుగాను మరియు మా కుటుంబ సభ్యులందరు మంచి ఆరోగ్యమును మరియు స్వస్థతను పొందుకునే కృపను నేడు నీవు మాకు దయచేయుము. దేవా, మా జీవితములో అద్భుతములు ఇప్పుడే జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.