నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మనకు గొప్ప విజయమును అనుగ్రహించు ట కొరకే ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 85:8వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడైన యెహో వా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తుల తోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక'' అని చెప్పబడినట్లుగానే, ఆయన తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించునని వాగ్దానము చేయుచున్నాడు. ఈ వచనములో మనము చూచినట్లయితే, 'ఆయన తన భక్తులతో శుభవచనమును సెలవిచ్చును' అని వ్రాయబడియున్నది. అవును, మన సమస్యల మధ్యలో దేవుడు మనకు స్పష్టతను మరియు సమాధానమును కూడా అనుగ్రహించుచున్నాడు. ఆయన సమాధానకరమైన యోచనలు మన యొద్దకు వచ్చుచున్నవి. ఇది లేకపోయినట్లయితే, మనము భయకంపితమైన విధానములలో అంతమైపోతాము. కానీ, మన సమస్యల నుండి మనము బయటకు రావడానికి మానవ మార్గములను మరియు అక్రమ మార్గములను మనము చూచెదము. భయకంపితమైన విధానములోను, మరి ఇంకను భయంకరమైన మరియు ఇబ్బందికరమైన పరిస్థితులలోనికి మనము నెట్టివేయబడుచున్నాము. ప్రభువు ఆ రీతిగానే, మనము అంతము కావాలని మన పట్ల కోరుకోవడము లేదు. కానీ, నిరంతరాయముగా ఆయన ప్రణాళికలోనే కొనసాగవలెనని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఆయన మనకు తన యొక్క శాంతిని మరియు సమాధానమును ఈ రోజు అనుగ్రహించుచున్నాడు. ఆ శాంతిలో నుండి మనకు తన జ్ఞానమును అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

కారుణ్యలో మా పట్ల ఈలాగుననే జరిగియున్నది. ఔన్నత్యమునకు సంబంధించిన గుర్తింపును ఇవ్వడము కొరకు ఒక బృందమును వారు కారుణ్యకు పంపించబడినప్పుడు, పరిశీలన కొరకు వారు కారుణ్యకు వచ్చినప్పుడు, వారు అక్కడకు వచ్చి, ఇక్కడ ఏమున్నది? ఏమి జరుగుతుంది? అస్సలు మీరు ఇక్కడ ఏమి కలిగియున్నారు? అన్నట్లుగా చాలా విరోధ భావముతో ప్రశ్నించారు. నిజంగా మాకు నాణ్యత ఉన్నదో?లేదో? అన్నట్లుగా వారు మాకు అన్నివైపుల నుండి ఒత్తిడిని కలిగించియున్నారు. వారు ఎంతగానో ఉద్యమమిచ్చుచూ ఉండియున్నప్పటికిని, మా యొక్క బృందం వారు ఎంతగానో సహనముతో వారికి సమర్పించవలసిన పత్రములన్నిటిని సమర్పించి యున్నారు. కారుణ్యకు సంబంధించిన వాస్తవములన్నిటిని కూడా వారికి మా బృందం వారు సమర్పించియున్నారు. చివరిలో వారు క్యాంపస్‌ను చూచి నిర్ఘాంతపోయారు. ఆ యొక్క ఫలితములను మరియు నాణ్యతను చూచి ఆశ్చర్యపోయారు. అంతమాత్రమే కాదు, వారు చాలా ఉన్నతముగా మాట్లాడియున్నారు. మేము గొప్ప ఔన్యతముగల స్థాయిని ఆశించుచున్నప్పుడు, మమ్మును పరీక్షించుట కొరకు మరొక బృందమును, ఇంకొక కమీషన్‌ను పంపిస్తామన్న వార్తను మాకు తెలియజేసియున్నారు. చాలా కొంతమందికి మాత్రమే ఇటువంటి అనుభవములు ఎదుర్కొంటుంటారు. వారు, మొదటిసారి సరైన క్రమమును మేము పాటించలేదు గనుకనే, మేము మరల పరిశీలన చేయబోవుచున్నాము అని అన్నారు. మీరు ఇంకను అనేక నెలలు వేచియుండాలని చెప్పారు. ఆలాగుననే, మరల ఇంకొక బృందము వస్తుంది అని మాకు తెలియజేసియున్నారు. అప్పుడు ప్రభువు, 'మీరు ఓర్పుతోను మరియు సహనముతోను మిమ్మును భద్రము చేసుకొనవలెను, ఇంకను నా యొక్క సమాధానముతో మీరు ప్రార్థన చేయండి' అని సెలవిచ్చియున్నాడు. కనుకనే, మేము ఉపవాసము ఉండి ఒక బృందముగా ప్రార్థించియున్నాము. తద్వారా, ప్రభువు మాతో ప్రత్యక్షంగా, పవిత్రంగా మాడ్లాడియున్నాడు. కారుణ్య కోసము ఆయన కలిగియున్న భవిష్యత్తును గురించి ఆయన మాతో మాట్లాడియున్నాడు. మేము ఏ విధంగా ఉండవలెను, మేము ఏమి చేయవలెనని మాతో మాట్లాడియున్నాడు. మేము ఎంతగానో ఆనందించి, ఆ కార్యమును బట్టి ప్రార్థించియున్నాము. అప్పుడు ఒక గొప్ప సమాధానము మమ్మును నింపినది.

అప్పుడు ఏమి జరిగింది? రెండవ కమిషన్ బృందము వారు రావడము జరిగినది. మరల వారు మాకు ఒత్తిడిని కలిగించియున్నారు. అయితే, మా బృందము వారి కొరకు ఎంతగానో సమాధానముతో నిర్వహించియున్నారు. ఇంకను కారుణ్యను గురించిన వాస్తవములన్నిటిని కూడా మా బృందము వారు, వారి ముందు ఉంచియున్నారు. ఆ విధంగానే, మాకు అత్యున్నతమైన ప్రమాణములలో ఎ++ అక్రిడేషన్ గ్రేడ్‌ను దేశములోనే అత్యున్నతమైన స్థాయిలో మాకు లభించినది. దేశములో అన్ని రంగములలోను దేవుడు మమ్మును ఘనపరచియున్నాడు. ఎందుకనగా, మా మాటలను మరియు మా హృదయములను సమాధానముతో కావలి కాచియుంచాడు. వారికి విరుద్ధముగా, వారికి అనవసరముగా ఒక్క మాటను కూడా మేము మాట్లాడకుండా మా నోటిని మరియు మమ్మును కాచియున్నాడు.

నా ప్రియులారా, మనము కూడా ఇటువంటి శాంతిని పొందుకుందాము. అయితే, మీ యొక్క ప్రతి స్థలములోను, సేవలోను, వ్యాపారములోను, కుటుంబములోను విజయము మీకు వచ్చును గాక. ఈ రోజు మీరు ఎలాంటి సవాలును ఎదుర్కొంటున్నను సరే, భయం, కోపం లేదా నిరాశ మీ హృదయమును ఏలనివ్వకండి. మీరు దేవుని సమాధానంలో నిలిచి ఉండండి. మీరు ఆయనపై నమ్మకం ఉంచి, ఆయన జ్ఞానమును వెంబడించి నడిచినప్పుడు, ఆయన మిమ్మును విజయమార్గములో నడిపిస్తాడు. నిరాశ సమయములలో మమ్మును నడిపింపజేసి, సరైన సమయంలో మాకు ఘనతను అనుగ్రహించిన అదే దేవుడు, నేడు మీ విషయములో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఆయన అనుగ్రహించు సమాధానమును దృఢంగా పటుకున్నప్పుడు ఆయన మీ జీవితములో న్యాయం, అనుకూలత మరియు అద్భుతమైన మార్పును మరియు విజయమును తీసుకు వచ్చుచున్న ఆయన హస్తమును మీ మీద ఉండుట మీరు చూచెదరు. నేటి వాగ్దానము నుండి మిమ్మును దేవుడు ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము నిన్ను సహనముతో సేవించునట్లుగా మాకు కృపనిమ్ము. దేవా, మేము ఎన్నో దాడులకు గురియైనప్పుడు కూడా మరియు మేము హింసింపబడుచున్నప్పటికిని కూడా, హింసాత్మకంగా అణిచివేయబడుచున్నప్పటికిని కూడా, మాకు అన్యాయము జరుగుచున్నప్పటికిని కూడా, ప్రభువా, వాటన్నిటిని ఎదుర్కొనుటకు మాకు సమాధానమును అనుగ్రహించుము. దేవా, నీ యొక్క సమాధానముతో మా హృదయములను నింపుము. యేసయ్యా, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికిని, నీవు మా పట్ల న్యాయమును జరిగిస్తావని, మేము సహనముతో నిన్ను సేవించుటకును మరియు నీ యందు నిరీక్షణ కలిగియుండుటకు మాకు నీ కృపను చూపుము. దేవా, నీలో మా హృదయమును సమాధానముతో కాపాడుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి విధమైన నిరాశ మరియు నిస్సహాయతను నీ శక్తి చేత తొలగించుము. దేవా, మా కన్నీటిని తుడిచివేసి, మాలో సమాధానము వర్థిల్లునట్లుగా చేయుము. ప్రభువా, నీ మార్గములను మాకు కనుపరచి, నీ పరిపూర్ణమైన ప్రణాళికలను నమ్మునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మేము వెళ్లుచున్న ప్రతి పరిస్థితిలోను నిన్ను ఘనపరచగలుగునట్లుగా మా మాటలను, ఆలోచనలను మరియు క్రియలను కాపాడుము. యేసయ్యా, నీ యొక్క శాంతి మాలో ఉన్న ప్రతి భారమును తొలగించి, మాలో ఉన్న ప్రతి గాయమును స్వస్థపరచుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.