నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 30:17వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ఇది దేవుని యొక్క వాగ్దానమై యున్నది. ఇది కేవలం ఆదరణను కలిగించు వాగ్దానము మాత్రమే కాదు, బాధలో ఉన్న ప్రతి హృదయానికి దేవుడు స్వయముగా ఇచ్చిన అద్భుతమైన వాగ్దాన వచనము ఇది.

నా ప్రియులారా, ఒకవేళ మీరు, 'నా దగ్గర ధనమేమియు లేదు. కానీ, నాకు స్వస్థత ఇప్పుడే కావలసినయున్నది. అయితే, నేను ఏమి చేయాలి? అని అంటుండవచ్చును. ఇప్పుడు, నా ఆరోగ్యమునంతటిని నేను కోల్పోయాను, ఆలాగే నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అనుకుంటున్నారేమో? నాకు సహాయము చేయువారు కూడా ఎవరు లేరు నేను ఏమి చేయాలి అని మీరు అంటున్నారా?' అయితే, ప్రభువు అంటున్నాడు, "నేను మీకు ఆర్యోగమును మరల కలుగజేయుదును. నా వైపు చూడము, నన్ను వెదకుము,'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఆయన మీరు చేయాలని ప్రభువు మీ యొద్ద ఆశించుచున్న చిన్న చిన్న విషయాలను మీరు చేయండి, మీ హృదయమంతటితో ప్రభువును వెదకండి, అద్భుత రీతిగా ప్రభువు మీకు సమస్తమును సమకూరుస్తాడు.

నా ప్రియులారా, అద్భుతంగా ప్రభువు మీకు సమస్తమును సమకూరుస్తాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 30:17 మరియు యిర్మీయా 33:6వ వచనములలో చూచినట్లయితే, ఆయన మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు అని చెప్పబడియున్నది. ఆ వచనమును చూడండి, " నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యసమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీకు ఆరోగ్యమును కలుగజేసి, మీ గాయములను మాన్పి, మీకు ఆరోగ్యమును, స్వస్థతను మరల అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, బైబిల్ గ్రంథములో అనేకమైన విషయములను ప్రభువు వాగ్దానము చేసియున్నాడు. కనుకనే, బైబిల్ గ్రంథమును చదివే అలవాటు మీకున్నదా? అది దేవుని వాక్యమును చదువుచున్నారా? మీరు ఎంతగా దేవుని వాక్యమును చదువుచున్నారు? బైబిల్ గ్రంథములో ప్రభువు ఇచ్చిన అనేక వాగ్దానములు కలవు. ఇది దేవుని యొక్క వాగ్దానమై యున్నది. బైబిల్ గ్రంథము మనకు ఇవ్వబడినది. బైబిల్ ఉన్న వాగ్దానములన్నియు దేవుడే స్వయంగా మాట్లాడిన మాటలుగా ఉన్నవి. అనేకమైన వాగ్దానములు మనకు ఇవ్వబడియున్నవి. మనము ఏమి చేయాలి? ప్రతి వాగ్దానము మన కొరకు అన్నట్టుగా మనము వాటిని మన స్వంతము చేసుకొనవలెను.

బైబిల్ నుండి యోహాను 11:40వ వచనమును చూచినట్లయితే, " నీ అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో అని అనెను'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని వాక్యములను నమ్మినప్పుడు, మీరు ఆయన మహిమను తప్పకుండా చూచెదరు. నా ప్రియులారా, దేవుని అద్భుతమైన సహవాసము విశ్వాసం ద్వారము తెరవజేయబడుచున్నది. మీ పరిస్థితి ఎంత అసాధ్యంగా అనిపించినప్పటికిని, ఆయన వాగ్దానము మీద మీరు విశ్వాసము కలిగి ఉండుట ద్వారా మీ జీవితంలో ఆయన మహిమ బయలుపరచబడుతుంది.

ఆలాగుననే, బైబిల్ నుండి మలాకీ 4:2వ వచనములో చూచినట్లయితే, " అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు'' అని చెప్పబడినట్లుగానే, ప్రియ స్నేహితులారా, ప్రభువుతో మీరు అన్యోన్యసహవాసమును కలిగియుండండి. ప్రార్థన ద్వారా ఎల్లప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండండి. బైబిల్ ద్వారా దేవుని యొక్క స్వరమును ఆలకించండి. ప్రభువు యెదుట భయభక్తులు కలిగియుండు జీవితమును మీరు కలిగి ఉండవలెను. అప్పుడు ప్రభువు మీకివ్వబడిన వాగ్దానములన్నిటిని తప్పకుండా నెరవేరుస్తాడు.

నా ప్రియులారా, ఈ రోజు, ఆయన వాగ్దానములను విశ్వాసంతో పొందుకొనండి: " నేను నీ ఆరోగ్యమును మరల కలుగజేసెదను, మీ గాయములను లను మాన్పుతాను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీ గాయములు శారీరకమైనవి, భావోద్వేగపరమైనవి, ఆర్థికపరమైనవి, లేదా ఆధ్యాత్మికమైనవి కూడా ఏవైనా సరే, మీ జీవితంలోని ప్రతి విచ్ఛిన్నమైన భాగమును పునరుద్ధరించే శక్తి ప్రభువునకు కలదు. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే ప్రభువు వైపు చూస్తూ, ప్రభువును మీరు అడగండి, ఆయనను విశ్వసించి, ఆయన వాక్యమునందు భయభక్తులు కలిగి ఉంటూ, మీరు కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మీరు ఇప్పుడే ప్రభువును అడగండి, ఆయన ఇప్పుడే మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన ఆశీర్వాదములన్నిటిని బట్టి, ఆయకు వందనములు చెల్లించినప్పుడు, ప్రభువు దిగివచ్చి తన సన్నిధితో మిమ్మును నింపుతాడు. అంతమాత్రమే కాదు, మీ జీవితములో ఉన్న అనవసరమైన వాటన్నిటిని మీ నుండి తొలగించి, మీకు సమస్తమును సమృద్ధిగా సమకూరుస్తాడు. మీ యొక్క ప్రతి అవసరతలన్నిటిని ఆయన నూరు శాతము అద్భుత రీతిగా మీకు అనుగ్రహించి, మిమ్మును దీవిస్తాడు. ఆయన జరిగించు అద్భుతమైన పునరుద్ధరణను, స్వస్థతను అనుభవించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ సన్నిధానమునకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా ఆరోగ్యాన్ని పునరుద్ధరించి, మా గాయములన్నిటిని నీవు బాగు చేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా పూర్ణ హృదయంతో నిన్ను వెదకడానికి మరియు నీ యొక్క మార్పు లేని వాక్యము యందు నమ్మకము ఉంచడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో ప్రతి పరిస్థితిలోనూ నీ యొక్క మహిమను మేము చూచునట్లుగా మా యొక్క విశ్వాసమును బలపరచుము. దేవా, మా జీవితం నుండి ప్రతి అనారోగ్యం, బాధను, భయం, ఒంటరితనం, నిరాశ మరియు భారములన్నిటిని తొలగించి, నీ యొక్క దైవీకమైన సమాధానముతోను, ఆనందముతోను, బలముతోను మమ్మును నింపుము. ప్రభువా, ప్రార్థన ద్వారా నీతో సన్నిహితంగా నడుచునట్లుగాను, ప్రతిరోజూ నీ వాక్యమును ధ్యానించునట్లుగాను, నీకు ప్రీతికరమైన పరిశుద్ధమైన జీవితమును గడుపుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ యొక్క సన్నిధి ప్రభావముతో మా మీదికి దిగివచ్చి, మమ్మును నీ సన్నిధితో నింపుము. దేవా, నీ యొక్క సమృద్ధి దీవెనలతో మమ్మును నింపి, ఆశీర్వదించుము. ప్రభువా, మా జీవితములోని ప్రతికూల అంశములన్నిటిని కూడా తొలగించి వేసి, మా జీవితములో మాకు కావలసిన ఆరోగ్యమును, సమస్తమును ఇప్పుడే అనుగ్రహించుము. దేవా, మా జీవితంలోని ప్రతి విచ్ఛిన్నమైన భాగమును బాగుచేసి, నీవు అద్భుతమైన రీతిలో మా అవసరతలన్నిటిని తీర్చుము. దేవా, మా కుటుంబమును ఆశీర్వదించి, నీ సన్నిధితో మమ్మును చుట్టుముట్టి, నీ యొక్క స్వస్థపరచు శక్తి మా జీవితంలోని ప్రతి భాగములోనికి ప్రవహించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.