నా ప్రియ స్నేహితులారా, నేడు మీ నీతికి సంబంధించిన బహుమానమును గురించి మీతో మాట్లాడవలెనని మీ పట్ల కోరుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 5:12వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు'' అని చెప్పబడిన ప్రకారముగా, ఆయన నీతిమంతులను ఆశీర్వదించు దేవుడై యున్నాడు. ఆలాగుననే, నీతిగలవారిని ఆయన తన భద్రతచేత ఆవరించు దేవుడైయున్నాడు. నీతి అనునది ఎంత ప్రాముఖ్యమై యున్నది కదా, కనుకనే, మీరు భయపడకండి. దేవుడు మిమ్మును నీతిమంతులైన వారినిగా చేస్తాడు. మీ స్వంత ఆత్మ దృష్టిలోనే, మీరు నీతిమంతులుగా ఉండగలుగుతారు, మీ హృదయము మరియు మీ కుటుంబము, ఈ లోక ప్రజలు మీరు నీతిమంతులైన వారు అని చెబుతారు. మీరు నీతిమంతులైన వారనియు మరియు మీరు నీతిమంతులలో ఒకరిగా యున్నారని దేవుడు సెలవిచ్చుచున్నాడు. యేసుప్రభువు సిలువలో మీ నిమిత్తమైన చిందింపబడియున్న రక్తము ద్వారా మిమ్మును నీతిమంతులుగా కొనియున్నాడు. ఆయన రక్తము ద్వారా మీరు నీతిమంతులై యున్నారు. కనుకనే, మీకు మరియు మీ ఆత్మకు విలువను ఆపాదించుచున్నాడు. ఆయన మీ దేహములో నివసించుచున్నాడు. మీరు ఆయనకు నీతిమంతులైన పిల్లలని మరియు కుమారులు, ఇంకను కుమార్తెలు అని మిమ్మును గురించి ఆయన అతిశయించుచున్నాడు. నా ప్రియులారా, మీరైతే, దేవుని చేత నీతిమంతులైన బిడ్డలనియు మీరు పిలువబడాలనియు ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఈ కృప ఇప్పుడే మీ మీదికి దిగివచ్చును గాక.
బైబిల్ నుండి దేవుని వాక్యములో నీతిమంతులైన వారు దేవునితో కూడా నడిచిన విధానమును మనము చూడగలుగుతాము. లేక వారు నీతిమంతులుగా ఉండుటను బట్టి, వారితో దేవుడు నడిచినట్లుగా మనము చూడగలుగుచున్నాము. అందుకే బైబిల్‌లో ఆదికాండము 6:9 వ వచనములో మనము నోవహును గురించి చదివినట్లయితే, ఈ వచనము ఏమని చెబుతుందనగా? ఇది నోవహు యొక్క మరియు నోవహు కుటుంబము యొక్క కథనముగా గురించి చెప్పబడియున్నది. నోవహు మాత్రమే కాదు, అతని యొక్క కుటుంబము అదేరీతిగా దేవునితో అనుసంధానమై యున్నది. నోవహు నీతిమంతుడైన వ్యక్తియై యున్నాడు. కనుకనే, లేఖనము ఆ రీతిగా చెబుతుంది, నోవహు నీతిమంతుడు మరియు అతడు నిందారహితుడు అని చెప్పబడియున్నది. తన కాలములో జీవించిన ప్రజల మధ్యలో నిందారహితుడు. దేవునితో కూడా నమ్మకస్థునిగా నడిచినవాడై యున్నాడు. ఇది నీతిమంతుని యొక్క చర్యగా ఉంటున్నది. అతడు నీతిమంతునిగా ఉండగా, అతడు దుష్టులైన ప్రజల మధ్యలో కూడా నిందారహితునిగా ఉండడాన్ని మనము చూడగలుగుచున్నాము. అవును, రోమా గౌరవర్న్‌గా ఉన్న పొంతిపిలాతు యెదుట యేసు నిలువబడినప్పుడు, 'యేసులో ఏ దోషము నాకు కనబడలేదు' అని ప్రజలకు తెలియజేసియున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును సైనికులు కలిసి ఆయనను సిలువ వేసినప్పుడు, ఆ యొక్క సైనికుడు కూడా, 'ఈయన నిజముగా నీతిమంతుడు' అని చెప్పియున్నాడు. అవును, ఆయన నీతిమంతుడు. ప్రజలందరి మధ్యలో ఆయన నిందారహితుడుగా యెంచబడ్డాడు. మొదటిగా, దేవునితో నమ్మకస్ధునిగా నడిచియున్నాడు. దేవునితో నమ్మకముగా నడుచుట అనగా ఏమిటి? దేవుడు చేయమని చెప్పిన సమస్తమును కూడా ఆయన చేసియున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ ఈ రోజు మీరు దేవుని స్వరమును వినలేకపోవచ్చును, ఆయనను మీరు ముఖాముఖిగా చూడలేకపోవచ్చును. కానీ, దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడు దేవుడై యున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయములో మాట్లాడువాడై యున్నాడు. కనుకనే, ఆలాగున చేయండి, దేవుడు ఏదైతే చేయమని చెప్పియున్నాడో, కేవలము దానిని మాత్రమే చేయండి. అప్పుడు నీరు మధురమైన ద్రాక్షారస పానీయముగా మార్చబడుతుంది. మీరు మీ కుటుంబమునకు నీరు ఇచ్చినట్లుగానే ఉండవచ్చును. కానీ, వారు ఆ నీటిని పానము చేసినప్పుడు, అది మధురమైన ద్రాక్షరస పానీయముగా ఉంటుంది. మీ బిడ్డలకు మరియు మీ కుటుంబ సభ్యులకు, మీ ప్రియులకు ప్రతిదియు ఎంతో మధురముగా ఉండి, వారికి ఆనందమయముగా ఉండునట్లుగా ఉంటుంది. మీరు చేయు ప్రతి పనియు కూడా ఆశ్చర్యకరముగా ఉంటుంది. మీ యజమానులు మరియు మీతో కలిసి పనిచేయువారు మీతో కలిసి ఆనందించువారుగా ఉంటారు. అవును, దేవుడు తనతో నమ్మకస్థునిగా నడిచే అటువంటి కృపను మీకు అనుగ్రహించుచున్నాడు. మీరు నిందారహితులుగా ఉండెదరు. మీరు దేవునితో నడిచెదరు. మీ నీతి నిమిత్తమైన ఆశీర్వాదములు మీ మీదికి వచ్చును గాక.
రెండవదిగా, మీరు ఏ రీతిగా నీతిమంతులుగా ఉండగలరు? మీరు ప్రభువునందు నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే మీరు నీతిమంతులుగా ఉండగలరు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 15:6 వ వచనములో చూచినట్లయితే, "అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను'' అని చెప్పబడినట్లుగానే, అబ్రాహాము దేవుని నమ్మెను గనుకనే, అతడు నీతిగా ఎంచబడెను. ఒకనాటికి దేవుడు తనకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాడు అని అతడు నమ్మెను. దేవుడు అతనికి దానిని నీతిగా యెంచియున్నాడు. కనుకనే, అబ్రాహాము వంద సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు అతడు బిడ్డను పొందుకున్నాడు. అవును, నీతి దేవుడు మీ జీవితములో అనుగ్రహించియున్న వాగ్దానములను మీకు నెరవేర్పులోనికి తీసుకొని వస్తుంది. మీ జీవితములో కూడా అది నెరవేర్చబడుతుంది. మూడవదిగా, 1 సమూయేలు 26:23వ వచనము ప్రకారము మీరు బీదలైన వారికి నీతి న్యాయము జరిగించినప్పుడు మీరు నీతిమంతులుగా ఉండెదరు. నాల్గవదిగా, కీర్తనలు 7:17వ వచనము ప్రకారముగా దేవుని మంచితనమంతటిని బట్టి, మీరు దేవునికి వందనములు చెల్లించినప్పుడు, మీరు నీతిమంతులుగా ఉండెదరు. ఐదవదిగా, కీర్తనలు 23:3వ వచనములో చెప్పబడినట్లుగానే, "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు'' అని వ్రాయబడినట్లుగానే, మీ ఆత్మ దేవుని యొక్క బిడ్డగా ఉంచబడు నిమిత్తము పునరుద్ధరించబడియున్నప్పుడు, దేవుని యెదుట మీరు నీతిమంతులుగా ఉండెదరు. ఇంకను సామెతలు 14:34వ వచనములో చూచినట్లయితే, "నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును'' అని వ్రాయబడినట్లుగానే, కనుకనే, మీ నీతి ఘనత కెక్కును. తదుపరి ఆశీర్వాదము ఏదనగా? బైబిల్ నుండి యెషయా 58:7-8 వచనములలో చెప్పబడినట్లుగానే, మీరు దీనులకును, మరియు వస్త్రములు లేనివారి కొరకు జాగ్రత్త వహించినప్పుడు, మీ నీతి మీకు ముందుగా నడుస్తుంది. చివరిగా, బైబిల్ నుండి మత్తయి 5:10వ వచనములో చూచినట్లయితే, మీరు యేసు నిమిత్తమై హింసించబడియున్నప్పుడు, మీరు నీతిగల వారుగా ఎంచబడెదరు. అవును, నా ప్రియులారా, ఈ రోజు మీరు యేసు నామమును బట్టి హింసించబడుచున్నారా? అయితే, దేవుని యెదుట మరియు మానవుల యెదుట మీరు నీతిమంతులైన వారు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మీతో కూడా నడుచుచున్నాడు, సకల ఆశీర్వాదములు మీ మీదికి వచ్చును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క కేడెముతోను మరియు నీ కృపతోను మమ్మును కప్పుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీ దృష్టిలో మమ్మును నీతిమంతులనుగా చేయుము మరియు మా హృదయాన్ని నీ చిత్తానికి అనుగుణంగా నడిపించుము. దేవా, నీ కృప మాకు ముందుగా వెళ్ళనట్లుగాను మరియు మా యొక్క ప్రతి వంకర మార్గమును సరాళం చేయునట్లుగా చేయుము. ప్రభువా, మా మనస్సును భయం నుండి మరియు మా హృదయాన్ని సందేహం నుండి కాపాడుము. దేవా, దృశ్యమైన మరియు అదృశ్యమైన సమయాలలో మమ్మును కప్పుము మరియు నీ సన్నిధి మాకు నమ్మకంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ఏ మానవుడు మూయలేని తలుపులను తెరువుము మరియు నీ దైవీక ఉద్దేశ్యంలోనికి మమ్మును నడిపించుము. యేసయ్యా, మేము నీ నిమిత్తము హింసబడునట్లుగాను, అది నీ దృష్టికి నీతిగా యెంచబడునట్లుగా చేయుము. దేవా, మేము మా పితురుల వలె నీ యెదుట నీతిగా నడుచుకొనుటకును మరియు నీ యందు నమ్మిక కలిగి ఉండుటకును మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదం మా జీవితంపై నిలిచి, అది ఇతరులకు పొంగి ప్రవహించునట్లుగా సహాయము చేయుము. దేవా, మేము ప్రతిదినం నీ ముందు యథార్థంగా, నిందారహితముగాను, నీతిగా నడుచుటకు మమ్మును బలపరచుము. ప్రభువా, నీ భద్రత మీద మరియు నీ నిత్యమైన ప్రేమ మీద మేము నమ్మకము కలిగియుండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ చెల్లించు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


