నా అమూల్యమైన స్నేహితులారా, ఈనాడు దేవుడు తన యొక్క జ్ఞానముతో మిమ్మును దీవించాలని మీ పట్ల కోరుచున్నాడు. మానవుని జ్ఞానమునకు మరియు దేవుని జ్ఞానమునకు మధ్య ఒక వ్యత్యాసం ఉన్నది. మానవ జ్ఞానం కేవలం ప్రస్తుతము కొరకు మాత్రమే పనిచేయుచున్నది; కానీ దేవుని జ్ఞానం వర్తమానం కొరకు మాత్రమేకాక, భవిష్యత్తు కొరకు కూడా పనిచేయుచున్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 8:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఈ వచనమును చదివినట్లయితే, జ్ఞానము ఏమని చెబుతుందనగా? దేవుని ప్రేమించువారిని ఆయన ప్రేమిస్తాడు అని చెప్పబడియున్నది. కనుకనే, మీరు జ్ఞానమును ప్రేమించవలసినవారై యున్నారు. మీరు జ్ఞానము కొరకై వెదకవలసియున్నారు, అప్పుడు మీరు దేవుని జ్ఞానమును కలిగియుండెదరు. యేసు దేవుని యొక్క జ్ఞానమై యున్నారు. అందుకే బైబిల్ ఆ రీతిగా తెలియజేయుచున్నది, " మీరు ఆయనను ప్రేమించినట్లయితే, మీరు ఆయనను వెదకినట్లయితే, మీరు ఆయనను కనుగొందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు జ్ఞానమును కనుగొనెదరు. మీరు వర్తమానమునందును మరియు భవిష్యత్తునందును కూడా జీవించెదరు. ఇంకను మీ జీవితము భద్రపరచబడియున్నది. దేవుని జ్ఞానమైయున్న యేసు మీలోనికి వచ్చియున్నప్పుడు, మొట్టమొదటగా, మీరు మంచి జీవితమును కలిగియుండెదరు. అందుకే బైబిల్ నుండి యాకోబు 3:13వ వచనములో చూచినట్లయితే, "మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను'' అని చెప్పబడినట్లుగానే, జ్ఞానము అది మిమ్మును తెలివిగలిగినవారిగా చేయుచున్నది. మంచి జీవితమును మీరు ఆనందించునట్లుగా చేయుచున్నది. ప్రతిఒక్కరు మంచి జీవితమును జీవించాలని కోరుకుంటారు కదా! యేసు ద్వారా దేవుడు అనుగ్రహించు జ్ఞానమును బట్టి మీరు మంచి జీవితమును కలిగియుండవచ్చును. రెండవదిగా, జ్ఞానము భద్రతను అనుగ్రహించుచున్నది. కాబట్టి, బైబిల్ నుండి సామెతలు 4:6,7వ వచనములలో చూచినట్లయితే, "జ్ఞానమును విడువకయుండిన యెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము'' అని చెప్పబడియున్నట్లుగానే, జ్ఞానమును విడిచిపెట్టవద్దు అని వ్రాయబడియున్నది. ఆ జ్ఞానము మిమ్మును క్రీస్తులో భద్రపరుస్తుంది. కనుకనే, జ్ఞానమును ప్రేమించండి, ఆ జ్ఞానము మిమ్మును కాపాడుతుంది. ఇది ఎంత అద్భుతముగా ఉన్నది కదా! నా ప్రియులారా, మీరు దేవుని జ్ఞానమును కలిగియున్నప్పుడు, మానవుని యొక్క కుయుక్తి పన్నాగములు ఎట్టివైనను సరే, వాటన్నిటిని మీరు అధిగమించగలరు. అంతమాత్రమే కాదు, అపవాది యొక్క కుయుక్తులను మీరు అధిగమించగలరు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 10:13వ వచనములో చూచినట్లయితే, "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ శ్రమలన్నిటిలో నుండి మీరు తప్పించుకొను మార్గమును ఆయన మీకు అనుగ్రహించును. అటువంటి, తప్పించుకొను మార్గమును అర్థము చేసుకోవడము, ఆ రీతిగా తప్పించుకొనడము అనునది దేవుని యొక్క జ్ఞానమై యున్నది.

మూడవదిగా, మీరు జ్ఞానమును కలిగియున్నప్పుడు, దేవునికి ఇష్టమైన వారిగా ఆనందమును సమకూర్చెదరు. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 2:26వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది'' అని చెప్పబడినట్లుగానే, ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. కనుకనే, మీరు దేవుని జ్ఞానమును కలిగియున్నప్పుడు, మీరు దేవునికి మంచివారుగా ఉంటారు. తత్ఫలితముగా, దేవుడు మీకు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుడు ఈ కృపను మీకు దయచేయును గాక. నాల్గవదిగా, జ్ఞానము మీ జీవితములో పవిత్రతను తీసుకొని వచ్చును. అందుకే బైబిల్ నుండి యాకోబు 3:17వ వచనములో చూచినట్లయితే, " అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది'' ప్రకారముగా, పైనుండి అనగా, పరమ నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. మనమందరము పవిత్రముగా ఉండాలని మనము కోరుకుంటాము. అంతమాత్రమే కాదు, అందరు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటాము. అందరు లోపము లేనివారుగా ఉండాలని కోరుకుంటాము కదా! కనుకనే, మన స్వంత ఆత్మ మనతో, 'మనము లోపరహితులైనవారని మరియు మీరు లోపరహితమైన స్త్రీ' అని చెప్పాలి. మనము అటువంటి స్థాయిని పొందుకోవాలని ఆకాంక్షిస్తాము కదా! ఇందుకోసమై మనలను పవిత్రపరచుట కొరకు, దేవుని యొక్క జ్ఞానము మనకు ఎంతో అవసరమై యున్నది. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 1:30వ వచనములో చూచినట్లయితే, "అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను'' అని చెప్పబడినట్లుగానే, మీరు క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు మీరు దేవుని జ్ఞానమును అంగీకరించుదురు. ఆయనే మీకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనముగా ఉంటాడు. జ్ఞానము మిమ్మును యేసు ద్వారా పవిత్రముగా ఉంటుంది. ఐదవదిగా, జ్ఞానము మిమ్మును సమాధానముగాను, నిబ్బరముగా ఉంచుతుంది. అందుకే బైబిల్ నుండి సామెతలు 29:11వ వచనములో చూచినట్లయితే, "బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును'' ప్రకారము బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండ, సమాధానముగాను, నిబ్బరముగా ఉంటుంది. ఇది ఎంతటి అద్భుతము కదా! అందరు కూడా సమాధానముగాను, నిబ్బరముగా ఉండాలని కోరుకుంటారు. అదియే కదా, మనకు గొప్ప మర్యాదను అనుగ్రహించుచున్నది.

ఆరవదిగా, జ్ఞానము గృహమును, యింటిని నిర్మాణము చేయుచున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 24:3వ వచనములో చూచినట్లయితే, "జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును'' అని చెప్ఫబడినట్లుగానే, జ్ఞానము యింటిని నిర్మాణము చేయుచున్నది. దేవుడు మీకు ఇచ్చు జ్ఞానము ద్వారా మీ గృహము నిర్మాణము చేయబడుతుంది. చివరిగా, జ్ఞానము ఐశ్వర్యమును తీసుకొని వస్తుంది. అందుకే బైబిల్ నుండి 1 రాజుల గ్రంథము 10:23వ వచనములో చూచినట్లయితే, "ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడైయుండెను'' అని వ్రాయబడినట్లుగానే, సొలొమోను సంపదయందును, జ్ఞానము యందును, ఐశ్వర్యవంతుడైయుండెను. నా ప్రియులారా, దేవుని జ్ఞానము ద్వారా మీరు సంపదను సంపాదించుకొనునట్లుగా ఆయన చేయుచున్నాడు. దేవుడు అట్టి జ్ఞానముచేత నింపబడినవారిగా మిమ్మును తీర్చి దిద్ధియున్నప్పుడు, అటువంటి వారిని చూచునట్లుగా లోకమంతయు మీ యొద్దకు వచ్చునట్లుగా జరుగుతుంది. ఇంకను బైబిల్ నుండి 1 రాజులు 10:24వ వచనములో చూచినట్లయితే, " అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి'' ప్రకారము దేవుని జ్ఞానము చేత అతనిని అందరు చూడగోరారు. సొలొమోను జరిగినట్లుగానే, మీకును కూడా ఆలాగుననే, జరుగుతుంది. కనుకనే, నా ప్రియులారా, దేవుడు మీకు అనుగ్రహించు జ్ఞానము ద్వారా మిమ్మును గొప్పవారినిగా చేయుచున్నాడు. కనుకనే, జ్ఞానమును ప్రేమించండి మరియు జ్ఞానమును వెదకండి. ఆ యొక్క జ్ఞానము యేసుక్రీస్తుయై యున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు మేము అన్నిటికంటే ఎక్కువగా నీ జ్ఞానాన్ని కోరుకుంటున్నాము. యేసయ్య, నీ నుండి వచ్చు జ్ఞానంతో మా హృదయాన్ని నింపుము. దేవా, వర్తమానం మరియు భవిష్యత్తు కొరకు మా నిర్ణయాలను నడిపించుము. ప్రభువా, నీ జ్ఞానం ప్రతి తప్పుడు మార్గం నుండి మమ్మును కాపాడి భద్రపరచుము. దేవా, మా జీవితమును పవిత్రంగా, శాంతియుతంగా మరియు నీకు ప్రీతికరంగా ఉండునట్లుగా మార్చుము. ప్రభువా, మా ఇంటిని కట్టి, మా చేతుల పనిని స్థిరపరచుము. దేవా, నీ మార్గములలో నడవడానికి మాకు అవగాహనను అనుగ్రహించుము. తండ్రీ, నీ యొక్క దైవీకమైన ఆశీర్వాదములు, అనుగ్రహం మరియు స్థిరత్వంలోకి మమ్మును నడిపించు. ప్రభువా, నీ దైవీకమైన జ్ఞానంతో మా భవిష్యత్తును భద్రపరచుము. తండ్రీ, మా యొక్క ప్రాణ ఆత్మ దేహములలో నీవు ప్రవేశించి, నీ యొక్క జ్ఞానము చేత మమ్మును నింపుము. యేసయ్యా, నీవే మాకు దేవుని యొక్క జ్ఞానమై యున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితములో సమస్త ఆశీర్వాదములన్నిటిని అనుగ్రహించుము. ప్రభువా, నేటి నుండి నీ యొక్క జ్ఞానముచేత మా జీవితములో సమస్తమును వర్థిల్లునట్లుగా చేయుము. దేవా, నీ జ్ఞానముచేత మేము పవిత్రముగాను, వర్ధిల్లతతోను, సంపూర్ణ శాంతితోను నింపబడునట్లుగా మమ్మును భద్రపరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.