నా ప్రియమైనవారలారా, నేడు మీకు ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహించవలెనని ప్రభువు మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. మిమ్మును ఆశీర్వదించుట లో ఆయన మీ పట్ల ఎంతో ఆనందించుచున్నాడు. కాబట్టి, భయపడకండి. మీ జీవితకాలమంతము పేదరికంలో గడపవలసి వస్తుందేమోనని ఆందోళన పొందనవసరము లేదు. ఇప్పుడు మీరు కలిగియున్నదానికంటే వెయ్యిరెట్లు అధికంగా మిమ్మును వృద్ధిపరచడానికి ప్రభువు శక్తిమంతుడుగా ఉన్నాడని, ఆయన ఈ మాట ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్పగా, ఈనాటికి కూడా ఆయన దానిని నెరవేర్చుచున్నాడు. వారు ఊహించలేనంతగా ఉన్నత స్థాయికి లేవనెత్తబడి, అత్యధికంగా వృద్ధి పొందుచున్నారు. అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును కూడా ఉన్నత స్థాయికి నేడు లేవనెత్తబోవుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ పిల్లలను కూడా ఆశీర్వదించి ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 రాజులు 3:13వ వచనములో చూచినట్లయితే, ప్రభువు సొలొమోనుతో ఇలాగున తెలియజేసియున్నాడు, "మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు'' అని సెలవియ్యబడినట్లుగానే, ప్రభువు ఈ రోజు కూడా మీకు ఇటువంటి ఆశీర్వాదమును అనుగ్రహించుచున్నాడు.
నా ప్రియులారా, ఈ ఐశ్వర్యము మరియు ఘనత ఎలాగున లభిస్తాయి? అందుకే బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనములో చూచినట్లయితే, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆశీర్వాదము మీకు ఐశ్వర్యమును కలుగజేయుచున్నది. ఇంకను బైబిల్ నుండి ఆదికాండము 26:12-13వ వచనములలో మనము చదివినట్లయితే, "ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను'' అని చెప్పబడినట్లుగానే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అవును, నా ప్రియులారా, యెహోవా మిమ్మును ఆశీర్వదించినప్పుడు, మీరు నూరంతల పంటను అనుభవించెదరు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:18 వ వచనమును చూచినట్లయితే, "కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయన గా, తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించు కొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే'' అని చెప్పబడినట్లుగానే, భాగ్యము సంపాదించుకొనుటకు ఆయన మీకు శక్తిని, బలమునిస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు, ఆ ఆశీర్వాదము మీ మీదకు నేడు దిగివచ్చుచున్నది. దేవుడు సొలొమోనుకు జ్ఞానమును ఇచ్చి, అతను గొప్పగా వర్ధిల్లునట్లుగా సహాయము చేసియున్నాడు. అదేవిధంగా, నా ప్రియులారా, మీరు వర్ధిల్లునట్లుగా ఆయన మీకు జ్ఞానమును, బలమును ఇవ్వగలడు, సరైన మార్గములను తెరచి, మిమ్మును సరైన మార్గములో నడిపించగలడు. ఇంక ను, దీనితో కూడా ఘనతయు మరియు కీర్తియు కూడా మీకు లభించును.
ఏ మార్గమున ఈ ఆశీర్వాదమును పొందుకొనగలము? అందుకే బైబిల్ నుండి సామెతలు 3:9-10వ వచనములలో చూచినట్లయితే, ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును'' అని చెప్పబడినట్లుగానే, మీ ఆస్తితోను, మీ పంటలో ప్రథమ ఫలములతోను యెహోవాను ఘనపరచుము. బైబిల్ నుండి మత్తయి 6:21వ వచనములో చూచినట్లయితే, "నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును'' అన్న వచనము ప్రకారము మీ ధనము మీద మనస్సు ఉంచకుండా, మీరు ప్రభువునకు ఇవ్వండి. నా ప్రియులారా, మనము మొదట ప్రభువు పనికి ఇవ్వవలెను. అందుకే బైబిల్ నుండి మలాకీ 3:10వ వచనములో చూచినట్లయితే, "నా మందిరములో ఆహారముండు నట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' ప్రకారము, పరిచర్య కొరకు మనము కానుకలను ఇచ్చినప్పుడు, మనము సేవ చేసినప్పుడు, ప్రభువును గుర్తెరగని ప్రజలు ఆయనను గుర్తెరిగి, ఆయన మందిరములో భాగస్థులగుటకు సహాయపడినప్పుడు ప్రభువు మీకు సమృద్ధిని, క్షేమమును, పరిపూర్ణత ను మరియు ఆనందమును అనుగ్రహించుచున్నాడు.
రెండవదిగా, నిరుపేదల సంరక్షణ కొరకు మనము ఇవ్వవలెను. అందుకే బైబిల్ నుండి యెషయా 58:7-8వ వచనములో చూచినట్లయితే, "నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' ప్రకారము అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడానికి మనము ఇచ్చుటకు నేర్చుకుందాము. ఆలాగుననే, వస్త్రములు లేనివారికి వస్త్రములు, గృహము లేనివారికి ఇల్లులు మరియు కనీస అవసరతలు లేనివారికి వస్తు రూపంలో సహాయము అందించుదాము. మనము పేదల పట్ల శ్రద్ధ వహించి, అవసరములో ఉన్న పిల్లలను ఆదుకున్నప్పుడు, మనకు స్వస్థత మరియు క్షేమము శీఘ్రముగా లభించును. అప్పుడు మన వెలుగు మధ్యాహ్నమువలె ప్రకాశించును. మరియు నీతి మనకు ముందుగా వెళ్తుతుంది. మన జీవితమంతయు వెలుగుతో నిండిపోతుంది మరియు సమృద్ధి అత్యధికముగా విస్తరించునట్లుగా దేవుడు కృపను అనుగ్రహించుచున్నాడు.
మూడవదిగా, దేవుని సేవకుల యొక్క వ్యక్తిగత అవసరతలను తీర్చడానికి మనము వారికి కానుకలు ఇవ్వవలెను. ఇందును బట్టి, మనము బైబిల్ నుండి కీర్తనలు 16:2-3వ వచనములలో చదువగలము, "నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు'' అని చెప్పబడినట్లుగానే, తన మంచితనం ప్రభువునకు ప్రయోజనం చేకూర్చదని, కానీ తాను పరిశుద్ధులయందును, దేవునికి ఘనతను తీసుకొని వచ్చుప్రజలయందును ఆనందిస్తాడని కీర్తనకారుడు తెలియజేయుచున్నాడు. కనుకనే, మనము కూడా అటువంటి వారికి ఇవ్వవలెను. మనము ప్రవక్తలకు మరియు పరిచారకులకు సహాయపడవలెను. నా ప్రియులారా, మనము ఈ విధంగా ఇచ్చి, సహాయపడునంతకాలము ప్రభువు మనలను సమృద్ధిగా మనలను ఆశీర్వదిస్తాడు. ప్రభువు మీకు కూడా ఈ కృపను అనుగ్రహించును గాక.
నాల్గవదిగా, నా ప్రియులారా, మీరు మీ సమయమును మరియు మీ పరిచర్యలో వచ్చు ఫలములను కూడా ప్రభువునకు సమర్పించుకొనవలెను. తద్వారా మీరు ఆయనకు వ్యక్తిగతంగా సేవ చేయగలరు. ఇందుకు ప్రతిఫలముగా మనము బైబిల్ నుండి యెషయా 30:20-21వ వచనములలో చూచినట్లయితే, "ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీకు ఈ కృపను అనుగ్రహించును గాక. అప్పుడు మీరు నడవవలసిన మార్గము మీకు బోధించబడుతుంది మరియు మీరు వేయుచున్న ప్రతి అడుగులోను మీరు నడుచునట్లుగా మీకు బోధించబడుతుంది, మీరు సంరక్షింపబడుదురు. మా ఇంట్లో మరియు మా కుటుంబములో, యేసు పిలుచుచున్నాడు పరిచర్య మరియు కారుణ్య ద్వారా, మేము ఈ ఆశీర్వాదాన్ని అనుభవించియున్నాము. మేము యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో సేవ చే యుచున్నప్పుడు, ప్రభువు నాకు ప్రత్యక్షమై, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా వచ్చిన కానుకలలో పదివభాగమును ఇతర పరిచర్యలకు-అంటే సంఘములను కట్టడానికి మరియు ఆయన సేవకులకు సహాయపడుటకు ఇవ్వమని నాకు సెలవిచ్చియున్నాడు. మరి ముఖ్యంగా మా తండ్రిగారు పరలోకానికి కొనిపోబడిన తర్వాత, మేము దీనిని పూర్ణహృదయముతో చేయుటకు ప్రారంభించాము. మేము సీషాను కూడా ప్రారంభించి, పేదవారికి సేవ చేయుటకు మొదలు పెట్టాము. దేవుని కృప వలన మా అవసరతలన్నియు తీర్చబడ్డాయి. ఈనా డు, ప్రభువు ఎంతోమందికి అభివృద్ధిని, ఆశీర్వాదములను అనుగ్రహించియున్నాడు. ఈ పరిచర్యలన్నియు భారతదేశ ప్రజలు ఇచ్చు కానుకల ద్వారానే సేవలన్నియు నిర్వహించబడుచున్నవి. ఈ పరిచర్య సహాయపడునట్లుగా ప్రభువు అన్ని వర్గముల ప్రజల యొక్క హృదయములను తెరచియున్నాడు కనుకనే, వారు సమర్పించు కానుకలను దేవుడు ఆశీర్వదించియున్నాడు. ఇంకను అనేకమంది సేవకులకు మరియు అనేక పరిచర్యలకు పదియవంతు (దశమ భాగం) ఇవ్వబడుచున్నది. తద్వారా, వారు మా కొరకు ప్రార్థించుచున్నారు. తద్వారా, మా అవసరతలన్నియు తీర్చబడుచున్నవి. మేము అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ప్రభువు మాకు సమృద్ధిని అనుగ్రహించియున్నాడు. నా ప్రియులారా, నేడు మీరు కూడా అవసరతలో ఉన్నవారికి మరియు దేవుని పరిచర్యకు, సేవకులకు ధారాళముగా ఇచ్చినట్లయితే, ప్రభువు మీకు కూడా అటువంటి ఆశీర్వాదమును మరియు ఫలభరితమైన జీవితమును అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా నీ యొక్క శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. దేవా, మేము ఇతరులకు ఇచ్చి వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడే ఉదారమైన హృదయమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము ఇచ్చు ప్రతి కానుకలు విస్తరించి, అనేకులకు ఆశీర్వాదంగా మారునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీవు చెప్పినట్లుగా, ఇయ్యుడి, అప్పుడు మీకు నిండు కొలతతో, అణిచి, కుదిలించి దిగజారునట్లుగా ఇస్తానని చెప్పినట్లుగానే, మా జీవితములో ఆలాగున జరుగునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము నీ పిల్లలకు మరియు నీ సేవకు ఇచ్చుట ద్వారా నీవు మా పిల్లలను ఆశీర్వదించుము, వారు నీ యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములను అనుభవించునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబమును ప్రతి కొరత మరియు లోటును తీసివేసి, మాకు సమృద్ధిని దయచేయుము. ప్రభువా, మేము నీకు ధారాళముగా ఇచ్చు హృదయములను చేతులను ఇచ్చి, నీ రాజ్యము కొరకు విత్తు ప్రతిదానిని విస్తరించునట్లుగా చేయుము. దేవా, నీ కృప మరియు మహిమ మా కుటుంబము మీద నిలిచియుండునట్లుగాను మరియు మమ్మును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


