నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక'' అని చెప్పబడిన ప్రకారము నేటి నుండి దేవుడు మీకు కృపయు మరియు సమాధానమును అనుగ్రహించును గాక. అవును, ఎఫెసీయులకు 1:2వ వచనం ప్రకారం కృప ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చుచున్నది మరియు బైబిల్ నుండి యోబు 25:2 వచనములో చూచినట్లయితే, " అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' అని చెప్పబడిన ప్రకారం దేవుడు పరలోకం నుండి సమాధానమును మనకు అనుగ్రహించుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఉన్నత స్థలములలో నుండి కృపయు మరియు సమాధానము ఇవి రెండు కూడా మీకు ఇవ్వబడుచున్నవి. మనకు కృప ఎలాగున వచ్చుచున్నది? మరియు కృప ఎక్కడి నుండి వచ్చుచున్నది? అందుకే బైబిల్ నుండి రోమీయులకు 6:23వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము'' అని తెలియజేయబడుచున్నది. దేవుని కృప మన పాపములను క్షమించి, యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్యజీవమును అనుగ్రహించబడుచున్నది.

రెండవదిగా, కృప మన బలహీనతలలో మనకు సహాయము చేయుచున్నది. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:9వ వచనములో చూచినట్లయితే, " అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును'' అని చెప్పబడిన ప్రకారము శరీర సంబంధంగా మనం బలహీనులమని మొరపెట్టుకున్నప్పుడు, తద్వారా మన శరీరములో మనకు ఒక ముల్లు గుచ్చుకుంటున్నప్పుడు, దేవుడు తన కృపను పంపుచున్నాడనియు మరియు ఆ కృప మనలను బలపరచుచున్నదనియు ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. ఇంకను మన బలహీనతల నుండి మనలను బయటకు తీసుకురావడానికి తన శక్తిని విడుదల చేయుచున్నది. ఒకవేళ, అది ఆధ్యాత్మిక బలహీనత కావచ్చును, మానసిక బలహీనత కావచ్చును, పాపపు సుఖభోగేచ్ఛల వలన కలుగుచున్న బలహీనత కావచ్చును, అనారోగ్యం వలన కలిగే బలహీనత కావచ్చును లేదా మనకు తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడం వలన కలిగే బలహీనత కావచ్చును. అయితే, దేవుని కృప మనలోనికి వచ్చి మనలను బలపరుచుచున్నది. అటువంటి కృప మన కొరకు తన్ను తాను అప్పగించుకొని, తన శరీరము మీద బలహీనతలను అనుభవించిన యేసు నుండి మనకు వచ్చుచున్నది. కాబట్టి భయపడకండి.

మూడవదిగా, బైబిల్ నుండి యోహాను 1:16 వ వచనమును చూచినట్లయితే, "ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి'' ప్రకారము యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణత నుండి మనం మన అవసరతలన్నియు తీర్చబడడానికి కృప వెంబడి కృపను, ఒకదాని వెంబడి ఒకటిగా పొందుకుంటాము. రెండవదిగా, కృపతో పాటు సమాధానమును కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే బైబిల్ నుండి యోహాను 14:27 వచనములో మనము చూచినట్లయితే, "శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి'' అని సెలవిచ్చిన ప్రకారం, యేసు యొక్క శాంతి ఈ రోజు మీ వద్దకు వచ్చుచున్నది. ఆ శాంతి మీ జీవితములో ఉన్న ప్రతి దుఃఖాన్ని తొలగించి మరియు విచారమును కొట్టివేయబడుచున్నది మరియు మీరు దేవుని శాంతితో నింపబడినప్పుడు, మీరు ప్రార్థనలో ప్రార్థించే ప్రతి ప్రార్థనా విన్నపమునకు జవాబు దొరుకుతుంది. బైబిల్ నుండి కొలొస్సయులకు 1:20 వ వచనములోచూచినట్లయితే, " ఆయన సిలువ రక్తముచేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలె ననియు తండ్రి అభీష్టమాయెను'' అని చెప్పబడిన ప్రకారము ఈ సమాధానము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు లభించుచున్నది. అందునిమిత్తమే, మనలను క్షమించుట కొరకు ప్రభువైన యేసు తన రక్తమును చిందించెను. అదియుగాక, మన జీవితములో శ్రేష్టమైన యీవులను మనకు అనుగ్రహించుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి హెబ్రీయులకు 12:24 వ వచనములో మనకు ఏమని తెలియజేయుచున్నదనగా, "క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు'' ప్రకారము ఆయన రక్తం శ్రేష్ఠమైన మాటలను పలుకుతుంది మరియు మీకు అవసరమైనవన్నియు అనుగ్రహించి, మీ జీవితాన్ని శాంతి సమాధానముతో నింపుతుంది. దేవుడు మీకు ఈ కృపను మరియు సమాధానాన్ని అనుగ్రహించును గాక. యేసులో ఈ రెండూ కలవు. కనుకనే, ఇప్పుడే ఆయనను మీ జీవితములోనికి అంగీకరించి, మిమ్మును మీరు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, ఈ రోజు మా బలహీనతలో మరియు మా అవసరతలలో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మా పాపములను క్షమించిన నీ యొక్క కృపావరానికి వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మా బలహీనతలను బట్టి మేము నిస్సహాయంగా తలంచినప్పుడు, మమ్మును బలపరచే కృప కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మా శరీరంలోను, మనస్సులోరు లేదా ఆత్మలో మేము బలహీనంగా భావించే ప్రతి రంగంలోకి నీవు నీ యొక్క బలాన్ని కుమ్మరించాలని మేము ఇప్పుడు ప్రార్థించుచున్నాము. ప్రభువా, కృప వెంబడి కృప మా జీవితంలోని ప్రతి భాగములోను వ్యాపించునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క పరిపూర్ణ శాంతి సమాధానము మా జీవితంలోని ప్రతి దుఃఖాన్ని తొలగించి, మాలో ప్రతి విచారమును కొట్టివేసి, మమ్మును నీ యొక్క కృపతోను మరియు సమాధానముతోను నింపుము. దేవా, ఈ రోజు నీ రక్తం మా జీవితములో శ్రేష్టమైనది పలుకునట్లుగా చేయుము. ప్రభువైన యేసు, మేము ఇప్పుడు నీ యొక్క కృపను మరియు సమాధానమును పొందుకొనుటన్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.