నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవము. మన కొరకై ఈ రోజు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 90:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మీ చేతి పనిని స్థిరపరచాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, ఒక క్రొత్త పనిని ఆరంభించుచూ, మీరు చేపట్టుకొను వారి వలె ఉండవచ్చునేమో? లేక, ఒక ఉద్యోగములో గానీ, ఒక వ్యాపారములో గానీ, మీరు పనిచేయుచున్నారేమో? లేకపోయినట్లయితే, ఒక ప్రణాళిక మీద, ఒక సిద్ధాంత వ్యాసము మీద, అది ఎలా సాఫల్య పొందుతుందో? లేదో? అన్నట్టుగా మీరు ఉన్నారేమో? మనము ఇందులో విజయమును సాధిస్తామో? లేదో? అన్నట్టుగా, 'ప్రభువా, నేను సాఫల్యత పొందుతానా?' అని అంటున్నారేమో? ఈ రోజు కీర్తనలలో ఉన్న ప్రార్థన ప్రకారము దేవుని యొక్క ప్రసన్నతను మీ మీద ఉంచును గాక. మీ చేతి పనిని ఈ రోజు దేవుడు మీ కొరకై స్థిరపరచును గాక.
ఈలాగుననే, ఢిల్లీలో మా తండ్రిగారి యొక్క పరిచర్యలో ఈలాంటి అనుభవము వచ్చినది. ఢిల్లీ ప్రార్థనా గోపురమును మేము స్థాపించియున్నప్పుడు, ప్రభువు మా తండ్రిగారిని ఈలాగున అడిగియున్నాడు, 'ఈ ప్రార్థనా గోపురము నుండి దేశము కొరకు నిన్ను ప్రార్థించమని చెప్పియున్నాను కదా! నీవు ఎందుకు ఆలాగున జరిగించలేదు?' ఆయన ఈలాగున అన్నాడు, 'ఇప్పుడే, ఆ సమయము ఆసన్నమైనది. ఈ ప్రార్థనా గోపురమును దేశము యొక్క అధికార పీఠముల ప్రక్కకు బదలాయింపు చేయాలి. పార్లమెంటు ప్రక్కనే ఉండాలి, ప్రధాని యొక్క రాజభవమును ప్రక్కనే ఉండాలి' అని చెప్పాడు. ఆయన అక్షరాల ఆ స్థలమును మాకు చూపించాడు. అయినప్పటికిని, అక్షరాల అదే ప్రాంతమునకు వెళ్లి, ఆ స్థలమును మేము కనుగొనవలసి వచ్చినది. ఒక స్థలమును ఎక్కడ కొనుగోలు చేయగలము? ఒక స్థలమును ఎక్కడ అద్దెకు తీసుకొనగలము?
మేము దేశము కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థనా గోపురమును ఎలా స్థిరపరచగలము? అని అనుకుంటూ ఉన్నాము. అది ఒక నూతనమైన ప్రణాళిక, మేము ప్రజలను ఎక్కడ కనుగొనవలసియున్నది? ఇందుకు ఆర్థికము లేక పెట్టుబడి ఎక్కడ నుండి మాకు వస్తుంది? అని ఒక పెద్ద చింతగా ఆరంభించబడినది? అయినప్పటికిని, మా తండ్రిగారు విశ్వాసముతో మా బృందమంతటితో ముందుకు కొనసాగి వెళ్లియున్నారు. మహా అద్భుతముగా, పరిశుద్ధాత్ముడు ఆ స్థలమునకు తీసుకొని రావడానికి ఆయన మమ్మును ఆ స్థలమునకు నడిపించియున్నాడు. వారు ఆ యొక్క భవనములో 21వ అంతస్తును నిర్మాణము చేయుచున్నారు. దేవుడు అక్షరాల మా తండ్రిగారికి ఇచ్చిన ప్రకారము త్రికోణ ఆకారములో ఆ స్థలము మాకు లభ్యమైనది. ఆ భవములో మూడు విభాగములు అన్నట్లుగా ఉన్నవి. అధికార పీఠము ప్రక్కనే పార్లమెంటును నేరుగా చూడగలుగుచున్నాము. మహా అద్భుతముగా, 'ప్రభువా, ఆర్థికమును మేము ఎలా కనుగొనగలము?' అని మేము ప్రార్థన చేయుచున్నప్పుడు, ప్రభువు, ' నేను దాని కొరకై చెల్లిస్తానని' చెప్పాడు. అక్షరాల, ప్రార్థనా గోపురమును స్థాపించడానికొరకై దేశవ్యాప్తంగా చాలినంత ధనమును ప్రజలు సమకూర్చియున్నాడు. సరైన సమయమునకు దేవుడు మాకు చాలినంత ధనమును అనుగ్రహించియున్నాడు. ఇది ఒక అద్భుత కార్యము.
మహా అద్భుతముగా, ప్రార్థనా గోపురములో ప్రార్థన చేయుటకు ప్రార్థన యోధులను ఆయనే లేవనెత్తియున్నాడు. ప్రతి ప్రార్థన గోపురము కొరకు దేవుడు ఈ దేశములో పిలిచియున్న సరళమైన సామాన్యులు. దేశము కొరకు ప్రార్థించుటకు దేవుడు వారికి గొప్ప తృష్ణను అనుగ్రహించియున్నాడు. ఏమి లేని విధానములో ఉన్నప్పటికిని, వారు జాతీయ ప్రార్థనా గోపురమునకు ప్రార్థించుటకు వచ్చుచున్నారు. దేవుడు దేశములో చేయబోవుచున్న కార్యములను వారి ద్వారా ప్రవచనములను తెలియజేయుచున్నాడు. మహా అద్భుతము కదా! ప్రభువే మా కోసము సమస్తమును స్థిరపరచియున్నాడు. గొప్ప అనుగ్రహము, గొప్పగా ద్వారములు తెరువబడడము మేము చూచియున్నాము. ఆలాగుననే, మన జీవితములోను, మన సేవా పరిచర్యలోను, వృత్తిలోను మరియు మన భవిష్యత్తులోను అట్టి అవకాశములను మనము కనుగొందాము. ఒకవేళ, నా ప్రియులారా, మీరు, ప్రభువు కొరకు ఈ ప్రణాళికను ఎలాగున స్థాపించవలెనని చింతించుచుండవచ్చును, మేము ఈ ఉద్యోగములో ఏలాగున సాఫల్యతను పొందగలము? ఈ పరిచర్యను మేము ఎలాగున స్థాపించగలము? అని తలంచుచుండవచ్చును. అయితే, దేవుని అభిషేకము మీ మీదికి దిగివచ్చును గాక. దేవుని నిమిత్తము మీరు నూతన కార్యములను స్థాపించునట్లుగా మీకు నూతన మార్గములు తెరవబడును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా కొరకు ద్వారములు తెరవజేయుము. దేవా, నీ యొక్క అనుగ్రహము మాకు చూపించుము. ప్రభువా, మా యొక్క ప్రణాళికలను ఎలాగున స్థాపించవలెనో మాకు తెలియజేయుము. దేవా, మా యొక్క ఉద్యోగములో మాకు సాఫల్యతను దయచేయుము. ప్రభువా, నీ యొక్క బలమైన జ్ఞానము మాలోనికి వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము అన్నిటిలోను నీ నామమును ఘనపరచునట్లుగా సాఫల్యతను మేము కలిగియుండునట్లుగాను మరియు నీ బలమైన కార్యములను మా పట్ల జరిగించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము లేచి నిలబడుటకును, నీ అనుగ్రహమును మా మీదికి వచ్చునట్లుగా చేయుము. దేవా, నీ యొద్ద నుండి ఆర్థిక వనరులను, మాకు తెరువబడిన ద్వారములు, మాకు తగిన స్థలమును, ప్రజల యొక్క సహకారము మాకు అందించునట్లుగా, తద్వారా, మేము నీ పరిచర్యను చేయుటకు కృపను మాకు దయచేయుము. ప్రభువా, గొప్ప నైపుణ్యత మరియు సాఫల్యతను మా కార్యములలో మాకు అనుగ్రహించుము. ప్రియమైన ప్రభువైన యేసయ్య, నీ గొప్ప కటాక్షము మా మీద నిలిచియుండునట్లుగాను మరియు మా చేతి పనిని స్థిరపరచుము. దేవా, నూతన ప్రాజెక్టులను, ఉద్యోగములను, వ్యాపారములను, పరిచర్యలను లేదా చదువులు ప్రారంభించే మాకు మార్గాలను తెరువుమని మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


