నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయడం నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హోషేయ 8:1వ వచనమును మనకు అనుగ్రహించి ప్రభువు మనలను పోషించుచున్నాడు. ఆ వచనము, "బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము'' అని చెప్పబడిన ప్రకారముగా బాకాను మీ నోట మీరు ఊదుము. ఈ వచనము ద్వారా, మీరు బాకా ఊదినప్పుడు, ఒక శత్రువు పక్షిరాజు వలె మీకు విరోధముగా వచ్చునని సూచించుచున్నది. ఇంకను ఇది మన వైపునకు ఒక ప్రతిఘటన రాబోవుచున్నదని తెలియజేయుచున్నది. ఎందుకు? ఎందుకనగా, మనం ప్రభువు ఆజ్ఞలను అతిక్రమించియున్నాము. ఇంకను మనం ఆయనను వెదకలేదు, ఆయనను వెంబడించలేదు, ఆయనకు పరిచర్య చేయలేడములేదని ఈ వచనములో ఈలాగున కొనసాగించుచూ మనకు వివరముగా తెలియజేయుచున్నది. కనుకనే, ప్రభువు ఆ విషయాన్ని మనకు ఎత్తి చూపడం ఎంత హృదయ విదారకమైన విషయం కదా! కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నేడే, మనం దేవునిలో మనలను మనము సరిచేసుకుందాము.
అయినప్పటికిని, నా ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉండి, మనలను ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఇలాగున సెలవిచ్చుచున్నాడు: " కాబట్టి, బాకా నీ నోటను ఉంచి ఊదుము'' అని అంటున్నాడు. 'బాకా' అనేది ప్రభువు మనలను పిలుచుచున్న పిలుపునకు ఒక సూచనగా ఉన్నది. ఇంకను వేదనల నడుమ పిలిచే పిలుపును, ఆపదల నడుమ పిలుచుచున్న పిలుపును, చివరకు ఆయనను స్తుతించడానికి మనలను పిలుచుచున్న ఒక పిలుపును కూడా అది సూచించుచున్నది. నా ప్రియులారా, ఈరోజు మనం ఆయనకు మొఱ్ఱపెడదాము. ఆయనకు మొఱ్ఱపెట్టి, ఇలాగున అడగండి, 'ప్రభువా, మమ్మును క్షమించుము, నీవు మాలోనికి వచ్చి మమ్మును నడిపించి, మమ్మును ఆశీర్వదించుము,'' అని మీరు కోరినట్లయితే, నిశ్చ యంగా, ఆయన మన బాకాను వింటాడు. ఒక చిన్నపిల్లవాడు తన తండ్రితో తనకు కావలసినవాటన్నిటిని తెలియజేసి, తన తండ్రి యొద్ద సహాయం అడిగినట్లుగానే, నేడు మనము కూడా మనము తండ్రి యొద్ద సమస్తమును అడగవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మనం మొదట ఆయనకు మొరపెట్టుట ద్వారా, మనము ఆయనను అడగాలని మన పట్ల కోరుకుంటున్నాడు. ఆయనకు విధేయత చూపడం అనగా, మొట్టమొదటగా, మనము ఆయనను వెదకుచూ, ఆయనను అడగడము మాత్రమే. ఆయనకు మొరపెట్టడం లేక ఆయనకు ప్రార్థించడం. దేవుడు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది విధేయతను మాత్రమే. కనుకనే, దేవుని ఆజ్ఞను ఆలకించి, ఆయనకు విధేయత చూపడమే.
కాబట్టి నా ప్రియులారా, ఈ రోజు, " బాకా నీ నోటను ఉంచి ఊదుము.'' అప్పుడు మీకు ఏది కావాలన్నను సరే, మీరు దేవునిని అడగాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయన మీకు సమస్తమును సమకూరుస్తాడు. ఆలాగుననే, మనం ముందుగా ఆయనను వేడుకోవాలి. అందుకే మనకు, 'బాకా ప్రార్థన బృందం'(టిపిజి)కలదు. ఇది ప్రారంభించబడి ఐదు సంవత్సరములు పూర్తి చేసుకొని, ఆరవ వార్షికోత్సవమును జరుపుకుంటున్నది. ఈ 'బాకా ప్రార్థన బృందం'(టిపిజి)లో, మేము ప్రతిరోజు మధ్యాహ్నం 1:00 నుండి 1:30 గంటల మధ్య ప్రార్థనలు జరిగించుచున్నాము. ఈ ప్రార్థన బృందములో మా సేవాపరిచర్యలో ఉన్న అవసరతలన్నింటిని మేము ప్రభువు సన్నిధిలో విన్న వించుకుంటాము. కనుకనే, మీరు కూడా ఈ 'బాకా ప్రార్థన బృందం'(టిపిజి)'లో పాల్గొని ప్రభువును వెదకవచ్చును. కాబట్టి, ప్రతిరోజు, " బాకా నీ నోటను ఉంచి ఊదుము'' అప్పుడు మీ మీద వ్రాలిన పక్షిరాజును దేవుడు తరిమివేయుటకు, మీకు విరోధముగా వచ్చు పక్షిరాజు వలె వ్రాలిన శత్రువును తొలగించి, మిమ్మును ఆశీర్వదించి, నడిపించుటకు మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు ఇప్పుడే దేవునికి మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ నోట ఉన్న బూరను ఆలకించి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము నీకు లోబడే హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, గతంలో నిన్ను మొట్టమొదటగా వెదకడంలో విఫలమైనందుకు నీ క్షమాపణ కోరుచున్నాము. దేవా, ప్రతి పరిస్థితిలోనూ నిన్ను పిలువడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలుగజేయుము. దేవా, మేము నీకు మొరపెట్టినప్పుడు, మాకు విరోధంగా నిలిచియున్న ప్రతి వ్యతిరేకతను మా నుండి తొలగించుము. ప్రభువా, మేము ఎదుర్కొంటున్న పోరాటాలను మా పక్షమున పోరాడి, నీ మార్గాలలో మమ్మును నడిపించుము. దేవా, నీ యొక్క పరలోకపు ఆశీర్వాదములను మా మీదికి వచ్చి, మా హృదయములోనికి నివసించుము. ప్రభువా, మాలో ఉన్న అవిధేయతను మా నుండి తొలగించి, ప్రతిదినం ప్రార్థన ద్వారా నీకు విధేయులముగా జీవించుటకు మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం ఎల్లప్పుడూ నీ సన్నిధిని వెదకునట్లుగాను, నీ సన్నిధిచేత మేము నడిపించబడునట్లుగాను మాకు నీ కృపను దయచేయుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


