నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినము. ఈ రోజు మా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో వీడియోలు మరియు మాధ్యమాలను పరిచర్యను ప్రారంభించబడి నలభైఐదు సంవత్సరములు. ఆ రోజు విశ్వాసముతో ప్రారంభించిన ఈ పరిచర్య ద్వారా నేడు లెక్కలేనంతమంది జీవితాలలో ఆశీర్వాదములను తీసుకొనివచ్చినది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 75:10వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము, "భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును'' అని చెప్పబడినట్లుగానే, ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. నేడు దేవుడు మీ కొమ్ములను హెచ్చించాలని మీ పట్ల కోరుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రతి విధమైన కష్టముల మధ్యలో కూడా మన జీవిత ప్రయాణములో ఉన్న గొప్ప బాధల మధ్యలో కూడా, ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'అట్టి స్థితిగతుల మధ్యలో కూడా, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును' అని వ్రాయబడియున్నది. అవునండి, మనము అట్టి బాధలన్నిటి మధ్యలో నుండి వస్తున్నప్పటికిని, మన యొక్క నీతిని కొనసాగించండి. ఇంకను మీ యొక్క నీతిమార్గములను కొనసాగించండి. ఎప్పుడు కూడా ప్రజలకు విరోధముగా కేకలు వేయకండి. ఎందుకనగా, వారు మీకు కలతలను కలిగించుచున్నారు. కనుకనే, మీరు ఎదుర్కొంటున్న అన్యాయమును బట్టి, మీరు ఎప్పుడు తిరుగుబాటుతో స్పంధించకండి. మీరు వెళ్లి వారితో పోరాడాలి అని ఆలోచించకండి. మీరు వెళ్లి, వారి మీద కోర్టులో కక్ష్య సాధించాలి అన్నట్టుగా అనుకోకండి. మీరు సహించుచూ ఉన్నదానికంతటికి ప్రతిగా నా ఆశీర్వాదము మీ మీదికి వస్తుంది. అటువంటి న్యాయమును నా ప్రజలుగా ఉన్న మీరు పొందెదరు' అని తెలియజేయుచున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, అపవాది మీలో సమస్యలను తీసుకొని రావడము ద్వారా మీలో ఎంతో కోపమును ప్రవేశపెట్టుటకు చూస్తాడు. ఇంకను అపవాది మీరు కోపోద్రేక్తులుగా ప్రతిస్పందించునట్లు మిమ్మును చేస్తాడు. కానీ, నిరంతరాయంగా మీ నీతిని మీరు కొనసాగించినట్లయితే, ఇంకను మీ హృదయమును సమాధానముతో కాపాడుకున్నట్లయితే, దేవుడు మీ పట్ల న్యాయమును జరిగిస్తాడు అనే భావనతో, అట్టి నీతిమంతులైన ప్రజల యొక్క కొమ్ము హెచ్చింపబడుతుంది. ఇటువంటి సమయములో మనము మనలను కాపాడుకొనుట కొరకు నీతివంతమైన ఆత్మను మనకు కావాలనియు మనము అడిగినప్పుడు, అటువంటి ఆత్మ నేడు మనము మీదికి దిగివస్తుంది. మీ నీతి మిమ్మును హెచ్చింపజేస్తుంది.

నా యొక్క చిన్న కుమార్తె క్యేటీ కూడా ప్రతి రోజు పాఠశాలకు వెళ్లక ముందుగా యేసుక్రీస్తు ప్రభువునకు ఈలాగున ప్రార్థన చేసుకుంటుంది. ఒక చిన్న బాబు పాఠశాలలో చిన్న పిల్లలను ఏడ్పించినట్లుగానే, ఈ క్యేటీని కూడా ఇబ్బంది పెట్టుచున్నప్పుడు, తనను ఏడ్పించడానికి మరియు బాధించడానికి ఏదో ఒక చిన్ని చిన్ని పనులు అనగా, అల్లరి పనులు చేయుచున్నప్పుడు, పిల్లవాడు ఆలాగున అల్లరి పనులు చేయుచూ, క్యేటీని ఇబ్బంది పెట్టుచుండేవాడు. సాధారణంగా, చిన్న పిల్లలు ఆలాగున చిన్న పిల్లలు చేస్తుంటారు కదా. అయినప్పటికిని, ఒక పాప తల్లిదండ్రులు నా భార్య శిల్పాకు ఫోన్ చేసి, నా కుమార్తె క్యేటీకి జరుగుచున్న ఈ సంగతి అంతయు వారి కుమార్తె గమనించి, తన తల్లిదండ్రులకు తెలియజేసియున్నందున వారు నా భార్యకు చెప్పారు. కానీ, చెడు ప్రవర్తతోను ఆ బాబుకు విరుద్ధముగా ఆమె ప్రవర్తించలేదు. కానీ, దానికి బదులుగా, ఆమె ఆ బాబుతో, ఆలాగున చేయవద్దు, మంచి బాబుగా ఉండు అని చెప్పింది. తద్వారా, ఆ బాబు నిరంతరాయముగా, తను మంచిగా ఉండడానికి కొనసాగించాడు. ఆమె ఆ బాబుకు సహాయము కూడా చేసింది. అటువంటి బిడ్డను నేను ఎప్పుడు కూడా చూడలేదు.

నా ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని బిడ్డలుగా ఉండుటకు మనము ఇటువంటి మంచి సాక్ష్యమును కలిగియుండవలసి ఉన్నది. కీడు చేయువారికి మేలు చేయాలి. ప్రజలు నిరంతరాయముగా వీరు నీతిమంతులైనవారు అని చెప్పుకొనునుట్లగా మనము నీతిగా జీవించాలి. వారికి కీడు చేయువారికి ఏ మాత్రము కీడు చేయరు అని చెప్పుకోవాలి. నేడు మనము అటువంటి ఆత్మ కొరకు దేవునికి మొఱ్ఱపెడదాము. దేవుని యొక్క హెచ్చింపు ఆ విధంగా మీ మీదికి దిగివస్తుంది. మీ కొమ్ములు కూడా హెచ్చింపబడాలంటే, మీరు నీతిగా జీవించుటకు మీ జీవితములను ఆయన హస్తములకు సమర్పించుకున్నప్పుడు, నిశ్చయముగా దేవుడు మీ నీతి జీవితమును చూచి, మిమ్మును హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. దేవా, మేము ఇబ్బంధికరమైన మార్గములో వెళ్లుచున్నప్పటికిని కూడా, విభిన్నమైన ప్రజల నుండి మరియు వివిధమైన పరిస్థితుల నుండి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికిని, మాకు నీతిగల ఆత్మను అనుగ్రహించుము. ప్రభువా, సమాధానకరమైన ఆత్మను మాకు దయచేయుము. యేసయ్యా, లోకమిచ్చు శాంతి కాకుండా, నీ యొక్క శాంతిని మా హృదయములో అనుగ్రహించుము. దేవా, మా చింతలన్నియు మరియు మాలో ఉన్న ఆగ్రహమంతయు కనుమరుగైపోవునట్లుగా చేయుము. ప్రభువా, మాకు నీతి జీవితమును కలుగజేసి, మమ్మును పరిశుద్ధంగా జీవించునట్లుగా చేయుము. దేవా, మా క్రియలలోను, మాటలలోను నీతిగా ఉండునట్లుగాను, దైవీకమైన బహుమానమును మాకు అనుగ్రహించుము. ప్రభువైన యేసూ, మేము పోరాటాల గుండా నడుస్తున్నప్పుడు మరియు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు మాకు నీతిగల ఆత్మను దయచేయుము. దేవా, మేము అపవాదికి చోటు ఇవ్వకుండా, మేము నీతి కలిగి జీవించునట్లుగా మమ్మును మార్చి, మా కొమ్ములను హెచ్చించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.