నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 46:10 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద నేను మహోన్నతుడనగుదును'' అని చెప్పబడినట్లుగానే, అవును, ఆయన మనకు ప్రభువై ఉంటున్నాడు. ఆయన సమస్తమును తన ఆధీనములో ఉంచుకొనియున్నాడు. మన జీవితములోని ప్రతి చిన్న విషయము కూడా ప్రభువు ఎరిగియున్నాడు. అందుకనే, ఆయన ఈలాగున అంటున్నాడు, "నా ప్రియమైన బిడ్డా, నీవు ఊరక నిలిచియుండుము'' అని సెలవిచ్చుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 46:6వ వచనములో చూచినట్లయితే, "జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన చుట్టూర అనేక విషయములు జరుగుచుండవచ్చును. మరి ఇంకను జనములు ఘోషించుచుండవచ్చును. మన జీవితములో అనేకమైన యుద్ధములు జరుగుచుండవచ్చును. అయితే, ప్రభువు ఏమి చేస్తుంటాడు? అని మనము చూచినట్లయితే, ఆయన తన స్వరమును ఎత్తుతాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 46:9వ వచనములో చూచినట్లయితే, "ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే'' అని చెప్పబడినట్లుగానే, మన ప్రభువు ఒక గొప్ప యోధుడుగా ఉంటున్నాడు. ఆయనే మన జీవితములోని యుద్ధములన్నిటి పక్షమున పోరాడుచున్నాడు. మన శత్రువులను నిర్మూలము చేయుటకు ఆయన అగ్నిని పంపిస్తాడు. ఆయన సింహము వలె గర్జించి, తన కంఠధ్వనిని వినిపిస్తాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేస్తాడు. ఆయన మూల్గులతో విజ్ఞాపనము చేస్తాడు. మన యొక్క ప్రతి యుద్ధమును దేవుడే మన పక్షమున పోరాడుతాడు. కాబట్టి, ఇక నుండి మీరు పోరాడడము ఆపివేయండి. మరి ఇంకను మీ స్వంతముగా మీరు పనులు చేయడము ఆపివేయండి. మీరు మాట్లాడడము ఇక మానివేయండి. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " ఊరక నిలిచియుండుము, ఊరకుండుడి'' అని సెలవిచ్చుచున్నది. కనుకనే, నా ప్రియులారా, కోపములో కూడా మీ నోట నుండి ఏ మాట మాట్లాడకండి. మీరు మౌనముగా ఉండండి.

ఈ రోజు మా మనవరాలు బైబిల్ గ్రంథమును చదువుచుండగా, నేను తన కొరకు చిన్న పిల్లల బైబిల్ గ్రం«థమును కొని ఇచ్చాను. ఒక పేజిలో ఒక ఆలోచన వ్రాయబడియున్నది. ఆ పేజిలో ఈ విధంగా వ్రాయబడియున్నది, "దేవుడు మన పేదవులను ఎంతగానో ప్రేమించుచున్నాడు'' అని చెప్పబడియున్నది. కాబట్టి, కోపముతో మీ యొక్క నోటిని తెరచి, ఎటువంటి కోపముతో నిండియున్న మాటలను మాట్లాడకండి. నా ప్రియులారా, మీ నోటిని ఎంతగానో ప్రేమించుచూ, మీ పెదవులకు రంగును పూసుకుంటూ ఉంటారు కదా! అయితే, మీరు ఊరక ఉండినప్పుడు ప్రభువు మీ నోటిని ఎంతగానో ప్రేమిస్తాడు. మీరు కోపముతో ఉండియున్నప్పుడు, మీరు మీ యొక్క నోటితో ఏ యొక్క తప్పుడు మాటలను మాట్లాడకుండా ఉన్నప్పుడు, దేవుడు మీ పట్ల ప్రీతికలిగియుంటాడు. కాబట్టి, మీ స్వంతగా పనులు చేయడము మానివేయండి. మీ కంఠ ధ్వనిని ఎత్తడము ఆపివేయండి. మీరు చేయవలసినదల్లా, "మీరు ఊరక ఉండుడి మరియు నిశ్చింతగా ఉండండి. ఆయన దేవుడై యున్నాడని తెలుసుకొనండి.''

అందుకే బైబిల్ నుండి కీర్తనలు 46:1వ వచనములో చూచినట్లయితే, " దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మన యొక్క ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. అవును, నా ప్రియులారా, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనకు సహాయము చేయడానికై సిద్ధముగా ఉన్నాడు. పర్వతములు కదిలిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, కొన్ని విషయములు కనుమరుగైపోయినను, కొంతమంది ప్రజలు ఆకస్మాత్తుగా మాయమైపోయినను, అస్సలు నీవు ఎవరో నాకు తెలియదు, నీవు నాకు అక్కరలేదు అని ప్రజలు చెబుతుండవచ్చును. అయితే, మన యొక్క ఆపత్కాలములో ప్రభువే మనము నమ్మకొనదగిన సహాయకుడు. ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆయనే మనకు బలమై ఉంటున్నాడు. ఆయన తన కంఠధ్వనిని మన కోసము ఎత్తుతాడు. ఆయనే మన యుద్ధములన్నిటిని పోరాడుతాడు. కాబట్టి, నా ప్రియులారా, మీరు ఎవరి మీద కూడా ఎటువంటి పగతీర్చుకోవడాన్ని చేయకూడదు. మీతో పోరాడుచున్న ప్రజలను ఒక్క మాట కూడా మీరు మాట్లాడవద్దు. మీరు " ఊరక ఉండుడి.'' నా ప్రియులారా, మీరు అట్టి విధముగా చేసినప్పుడు, ప్రభువు మిమ్మును ఎంతగానో ప్రేమిస్తాడు. మీ నోటిని ప్రభువు ప్రేమిస్తాడు. అప్పుడు, ప్రభువు మీ నోరు ఎంతో అందముగా ఉన్నదని చెబుతున్నాడు. నా మనవరాలు ఈ ఆలోచనను ఈ రోజు చదువుచుండగా, "నీ నోరు చాలా అందముగా ఎలా ఉన్నదని అని ప్రభువు చెబుతాడు'' అని నన్ను అడిగినది. అప్పుడు నేను తనకు అంతయు అర్థమగునట్లుగా చెప్పాను. అవును, నా ప్రియులారా, దావీదు వలె నేడు మనము కూడా ఈ విధంగా దేవునికి ఇలాగున మొఱ్ఱపెట్టవలెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 139:12వ వచనములో చూచినట్లయితే, "ప్రభువా, నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము'' అని భక్తుడైన దావీదు ప్రార్థించినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, మన నోట నుండి ఎటువంటి చెడు మాట రాకూడదు. మనము ఇట్టి విధముగా, ప్రభువుకు ప్రతి దినము మొఱ్ఱపెట్టాలి, 'ప్రభువా, ప్రతిరోజు నేను మౌనముగా ఉండడానికి మాకు సహాయము చేయుము, నిన్ను విశ్వసించే కృపను దయచేయుము. నిన్ను విశ్వసించి, నిన్ను నమ్మడానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము, మేము మౌనముగా ఉండగలిగే కృపను మాకు ఇమ్ము అని అడగాలి.'' నా ప్రియులారా, మనము మౌనముగా ఉండి, ప్రభువు మన పక్షమున పోరాడినప్పుడు, ఆ విజయము మనకు సమాధానమును కలుగజేయుచున్నది. అప్పుడు ప్రభువు కూడా మీరు మౌనముగా ఉండడానికి మీకు సహాయము చేస్తాడు. ఊరక నిలిచియుండుడి. ఆయనే దేవుడుగా ఉన్నాడని తెలుసుకొనుము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మాకు సహాయము చేసి, మాకు విశ్రాంతిని కలుగజేయుము. దేవా, నీవు మా యొక్క యుద్ధములన్నిటిని పోరాడుచున్నవన్న నిశ్చయతను మాకు కలుగజేయుము. ప్రభువా, మేము మా యొక్క స్వరములను ఎత్తకూడదు. దేవా, మేము మా స్వంతముగా పోరాటములను చేయకూడదు. ప్రభువా, మేము ఇతరులతో పోరాడడము ఆపివేయునట్లుగా చేయుము. దేవా, మేము ఎవరితోను పోట్లాడకుండా, మా నోటిని కాచుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క సమాధానము మా హృదయములో ఏలుచుండునట్లుగా చేయుము. యేసయ్యా, మేము దేనిని గూర్చి, చింతించకుండా, మా చింతయావత్తు నీ మీద వేయుటకు మాకు శక్తిని అనుగ్రహించుము. దేవా, నీవే మా పక్షమున ఉండి, మా యుద్ధములన్నిటిని పోరాడి, మాకు విశ్రాంతిని దయచేయుము. ప్రభువా, నీవే మా పక్షమున యోధుడవుగా ఉంటూ, మేము ప్రతిరోజూ ఊరకుండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొద్ద నుండి అగ్ని దిగివచ్చి, మా శత్రువులను కాల్చివేయునట్లుగా చేయుము. దేవా, మేము కోపంతో ఏమియు మాట్లాడకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా, ఇతరులతో గొడవపడకుండా మమ్మును కాపాడుము. ప్రభువా, మా హృదయంలో, ఇంట్లో, పని చేసే చోట నీ సమాధానము ఏలునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి వ్యతిరేకతను ఎదిరించి, మాకు విజయమును అనుగ్రహించుము. ప్రభువా, నీవే మాకు ఆశ్రయంగా, బలంగా ఉండి, మేము ప్రజలపై ఆధారకుండా, కేవలం నీ మీద ఆధారపడునట్లుగా చేయుము. దేవా, మా హృదయం నుండి ఆందోళనను, భయమును తొలగించుము. ప్రభువా, మేము వెళ్లు ప్రతిచోట మాకు స్థిరత్వాన్ని, సమాధానమును, ఆనందమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.