నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు ఈ రోజున మన పక్షమున ఉండి, మనలను ఆదరించుటకు సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన మృదువైన ప్రేమ మరియు జాగ్రత్తను మనము అనుభూతి చెందియున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 2:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు’’ అని వాగ్దానము చేయబడినట్లుగానే, ఆయన మిమ్మును వర్థిల్లజేయాలనియు మరియు మీకు కేడెముగా ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా. అవును, నా ప్రియులారా, యథార్థవంతులకు ఆయన విజయమును అనుగ్రహించుచున్నాడు.
యథార్థవంతులు ఎవరు? యథార్థవంతులు అనగా, దేవుని చిత్తప్రకారము నడుచుకొనువారు. ఆయన కోరుకొనిన దానిని చేయడానికి విధేయులగువారు. అనేక ఫర్యాయములు మనము ఆలాగున చేయబడడానికి సౌకర్యవంతమైన మన యొక్క స్థితిగతుల నుండి బయటకు రావలెను. ఇంకను అనేక ఫర్యాయములు అలవాటులేని దానిని చేయవలసి వస్తుంది. అయినప్పటికిని, ప్రభువు ఏది చేయడానికి నడిపిస్తాడో, అందుకు మీరు ఆయనకు విధేయులైన సమయములో, చిన్న పిల్లలుగా తల్లిదండ్రులు చెప్పిన దానిని ఏ విధంగా మీరు చేయగలుగుతారో? విధేయత కలిగి జరిగించుచున్న ప్రతి ఈ చిన్ని చిన్ని త్యాగములను బట్టి, దేవుడు ఘనపరచువాడై యున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుడు అట్టివారికి గొప్ప సాఫల్యతను అనుగ్రహించుచున్నాడు.
నా ప్రియులారా, తన భక్తుల ప్రవర్తనను మరియు మార్గమును ఆయన కేడెముతో కాచునని ఈ వచనము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఎందుకనగా, వారి మార్గములు యథార్థవంతమైనవి మరియు నిందారహితమైనవి మరియు వారి యొక్క నడత నిందారహితమైనది మరియు యథార్థమైనది. కనుకనే, ప్రభువు దానిని ప్రేమించి, తద్వారా, వారు పడిపోకుండా ఉండాలని, వారి నడతను కేడెముగా కాచువాడుగా ఉన్నాడు. ఆలాగుననే, నిరంతరాయముగా వారి సాఫల్యత మార్గములో వారు నడుచునట్లుగా ఉండాలనియు మరియు ఆయన చిత్తానుసారముగా విధేయులై నడుచునట్లుగాను, అనే ఫర్యాయములు ఆయన మన ఆకృతిని రూపించువాడుగా ఉన్నాడు. కనుకనే, ఆయనకు విధేయతను చూపుతూనే, నిత్యము యుక్తమార్గములో సమర్పణతో ముందుకు కొనసాగండి. నిశ్చయముగా మీరు విజయము అనుభవించెదరు.
నా జీవితములో చూచినట్లయితే, నా భార్య శిల్పా, నా కుమారుడైన జేడెన్‌ను గర్భము ధరించిన సమయములో నేను మరియు నా భార్య ఇద్దరము ఎంతగానో ఆనందించాము. కానీ, ఆ సమయములో మేము ప్రభువుతో ఈలాగున చెప్పియున్నాము, ‘ప్రభువా, ఈ కుమారుడు నీ సేవ కొరకు సమర్పించుకొనుచున్నాము. ఈ బిడ్డ నీ కోసమే. ఆ బిడ్డ యొక్క జీవితమును నీ కోసమే ప్రతిష్టించుచున్నాము. మా కోరిక లేక మా ఇష్టప్రకారము ఏమియు జరిగించలేము. ప్రభువా, నీ చిత్తమును మా బిడ్డ పట్ల జరిగించుము. ఆ బిడ్డ జీవితములో ప్రతి దశలోను మరియు ప్రతి భాగములోను కూడా నీకు సమర్పించుకొనుచున్నాము’’ అని దేవుని చిత్తమునకు సమర్పించుకొనియున్నాము. తన యొక్క గర్భధారణ సమయములో కూడా, ఆలాగే నా భార్య గర్భమును ధరించి కొనసాగుచున్న సమయములో కూడా, వైద్య సమాచారమును బట్టి, కొన్నిసార్లు భయకంపితమైన పరిస్థితులు ఎదుర్కోనవలసి వచ్చినది. కానీ, వైద్యులైతే, దీనిని పరీక్షించుకోవాలి, స్కాన్ తీయించుకోవాలి అని చెప్పారు. అయితే, మేము వెనువెంటనే, ప్రార్థించి, ‘ప్రభువా, మేము ఈ బిడ్డను నీ చేతులకు అప్పగించుచున్నాము. నీవు మా బిడ్డను గురించి జాగ్రత్త వహించుము’ అని ప్రార్థించాము. అప్పుడు, మా యొక్క ప్రతి అడుగులో మేమిద్దరము కలిసి ఆయన వైపు చూస్తూ ఉండియుండగా, ఆయన చిత్తమును సంపూర్ణముగా లోపరచుకొనియుండగా, దేవుడు మా యొక్క ప్రతి చిన్న ఆవేదనను గురించియు మరియు ప్రతి చిన్న విషయమును గురించియు బాధ్యత వహించియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుడు మా బిడ్డ పట్ల శ్రేష్టమైన జాగ్రత్తను అనుగ్రహించాడు మరియు ఉత్తమమైన వైద్యులను మాకు ఇచ్చాడు. దేవుడు అన్నియు కూడా మాకు సమృద్ధిగా సమకూర్చాడు. ఇంకను అద్భుతమైన జననమును దేవుడు మా బిడ్డకు అనుగ్రహించాడు. సహజమైన శిశువుగా పుట్టటకు సహాయపడ్డాడు మరియు సంపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు మా బిడ్డకు అనుగ్రహించియున్నాడు. మనము ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకము ఉంచినప్పుడు దేవుడు అనుగ్రహించు అద్భుతమైన గొప్ప ఆశీర్వాదము కదా!
నా ప్రియులారా, మనము కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు, ఎంత గొప్ప ఆశీర్వాదములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. మన మార్గములలో ఆయన మీద నిరీక్షణ, మన జీవిత భాగములలో ఆయన యందు నిరీక్షణ. మన జీవితములో మనము కలిగియున్న వాటి పట్ల కూడా దేవుని మీద నిరీక్షణను కలిగియుండాలి. ఆయన అట్టివారికి సాఫల్యతను అనుగ్రహిస్తాడు. కాబట్టి, మనము ఇప్పుడే, ఆలాగున జరిగించుదామా?ఆలాగైతే, ప్రియ స్నేహితులారా, మీ మార్గమును ఆయనకు సమర్పించుకున్నట్లయితే, మీ జీవితములోని ప్రతి విషయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, మీ కుటుంబమును, మీ భవిష్యత్తును, మరియు ఆయన మీకు అప్పగించిన ప్రతిదానిని ఆయన పరిపూర్ణ చిత్తమునకు సమర్పించి, యుక్తమార్గములో తప్పకుండా నడుచుకుంటూ, యథార్థవంతముగా నడుచుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు యథార్థవంతులైన మీకు కేడెముగా ఉండి, మిమ్మును వర్థిల్లజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా మార్గములలోను మరియు మా నడతలలోను నీవిచ్చిన భద్రత కొరకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా జీవితములను నీకు సమర్పించుకొని, గొప్ప సాఫల్యతను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ యెదుట యథార్థవంతులుగా మేము నడుచుకొనుటకును మాకు సహాయము చేయుము. దేవా, మేము త్యాగం చేయవలసి వచ్చినా లేదా మా సౌకర్యవంతమైన పరిస్థితి నుండి బయటకు అడుగు పెట్టవలసి వచ్చినను సరే, ఎటువంటి స్థితిలోను మేము నీ స్వరమునకు విధేయత చూపడానికి మాకు కృపను చూపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి విషయంలోను, మా కుటుంబము, వృత్తి, ఆరోగ్యం మరియు భవిష్యత్తులోను మేము నీ యందు నమ్మకముంచుటకు నేర్పించుము. తండ్రీ, మా యొక్క ప్రతి ప్రమాదము నుండి మా మార్గమును కాపాడి, మేము పడిపోకుండా మమ్మును సంరక్షించుము. దేవా, మేము నీ చిత్తమునకు లోబడుచుండగా, మమ్మును జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, మా జీవిత మార్గములో ప్రతిదానికి నిన్ను మేము జ్ఞాపకము చేసుకొనునట్లుగా, శ్రేష్టమైన దానిని మాకిచ్చి, మమ్మును ఘనపరచుము. దేవా, మేము ఊహించని గొప్ప కార్యములను మాకు జరిగించి, మమ్మును హెచ్చించుము. ప్రభువా, కనీసము మేము ఈ ఆశీర్వాదములకు యోగ్యులము కాము అని భావించునట్లుగా మా జీవితములో గొప్ప కార్యములను జరిగించి, ఆ రీతిగా మాకు అత్యంత సమృద్ధిని అనుగ్రహించి, మమ్మును ఆశీర్వదించి, గొప్ప సాఫల్యతను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో మేము సాక్ష్యము వెంబడి సాక్ష్యమును చెప్పునట్లుగా మమ్మును మార్చుము. యేసయ్యా, నీ యొక్క అత్యధికమైన ఆశీర్వాదములు మా మీదికి వచ్చునట్లుగాను, మమ్మును బలంగా వినియోగించుకొనుచూ, మా యొక్క వృత్తి మార్గములోను, మేము నీ మహిమ కొరకు ప్రకాశించునట్లు చేయుము. దేవా, మాకున్న సమస్తమును నీ చేతులకు సమర్పించుకోవడానికి మా విశ్వాసమును బలపరచి, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మమ్మును నడిపించి, మా చేతుల పనిని ఆశీర్వదించి, మా జీవితము నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


